వార్తా విభాగం

వార్తలు

దేవుని కడప బ్రహ్మోత్సవాలలో ఈ రోజు

దేవుని కడప బ్రహ్మోత్సవాలలో ఐదోరోజు శనివారం నాటి ఉత్సవాలు… ఉదయం కల్పవృక్ష వాహనంపై ఊరేగింపు, స్నపన తిరుమంజనం సాయంత్రం 6గంటలకు వూంజల్‌సేవ సాయంత్రం గరుడవాహన సేవ నగరసంకీర్తన ఉత్సవాలలో భాగంగా నగరంలోని ప్రధాన పురపాలక ఉన్నత పాఠశాల వద్ద ఉన్న అన్నమయ్య విగ్రహానికి అభిషేకోత్సవం, అలంకరణ ఉంటుందని రుక్మిణి పాండురంగ భజన బృందం తెలిపింది. అనంతరం స్వామి గరుడసేవలో పాల్గొనే భక్తులకు అన్నదానం చేయనున్నట్లు కమిటీ పేర్కొంది. సాయంత్రం నాలుగు గంటలకు భజన బృందంతో అన్నమయ్య విగ్రహం […]పూర్తి వివరాలు ...

ఆచార వ్యవహారాలు

చిన్నశేష, హనుమంత వాహనాలపైన కడపరాయడు

దేవుని కడప: బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగో రోజైన శుక్రవారం కడపరాయడు (లక్ష్మీ వేంకటేశ్వరుడు) చిన్నశేష, హనుమంత వాహనాలపైన భక్తులకు దర్శనమిచ్చినారు. ఉదయం చిన్న శేష వాహనంపైన కొలువుదీరి గ్రామోత్సవానికి తరలి వెళ్ళిన స్వామి వారు సాయంత్రం ఉయ్యాల సేవ అనంతరం హనుమంత వాహనంపైన దేవుని కడప మాడ వీధులలో భక్తులకు దర్శనమిచ్చినారు. చెక్కభజనలు, కోలాటాలు, గోవింద నామస్మరణల నడుమ భక్తుల జయజయధ్వానాల నడుమ  దేవదేవుడు ఊరేగినారు.పూర్తి వివరాలు ...

అభిప్రాయం

ఆశలన్నీ ఆవిరి

కడప జిల్లా వాసుల ఆశలన్నీ ఆవిరి కందుల సోదరులను భాజపాలో చేర్చుకోవడానికి మొన్న 18న కడపకొచ్చిన వెంకయ్య నాయుడు గారు కడప జిల్లా అభివృద్ధి విషయంలో మినుకుమినుకుమంటున్న ఆశల మీద నిర్దాక్షిణ్యంగా చన్నీళ్ళు గుమ్మరించి చక్కా వెళ్ళిపోయారు. కేంద్ర కేబినెట్లో ఆంధ్రప్రదేశ్ వాణిని బలంగా వినిపించగల నాయకుడిగా, చాలాకాలంగా ఈ ప్రాంత సమస్యలు, పరిస్థితుల గురించి అవగాహనతోబాటు బాధ్యతకూడా కలిగిన సీనియర్ నాయకుడిగా ఆయన్నుంచి కడప జిల్లావాసులు ప్రధానంగా కోరుకున్నది నాలుగు విషయాల్లో స్పష్టత – అవి: […]పూర్తి వివరాలు ...

వార్తలు

దేవునికడప బ్రహ్మోత్సవాల్లో ఈ పొద్దు

దేవుని కడప బ్రహ్మోత్సవాలలో నాలుగోరోజు శుక్రవారం నాటి ఉత్సవాలు… ఉదయం చిన్నశేషవాహనంపై ఊరేగింపు ఉదయం 10గంటలకు స్నపన తిరుమంజనం సాయంత్రం 6గంటలకు వూంజల్‌సేవ సాయంత్రం హనుమంత వాహనం పై ఊరేగింపుపూర్తి వివరాలు ...

ఆచార వ్యవహారాలు

సూర్యప్రభ, సింహ వాహనాలపైన ఊరేగిన కడపరాయడు

దేవుని కడప: శ్రీలక్ష్మీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడో రోజైన గురువారం కడపరాయడు సింహవాహనం, సూర్యప్రభ వాహనాలపైన భక్తులకు దర్శనమిచ్చినారు. ఉదయం లోకకల్యాణం కోసం నిత్యహోమాలు జరిగాయి. అనంతరం సూర్యప్రభ వాహనంపైన స్వామి దేవుని కడప మాడ వీధులలో భక్తులకు దర్శనమిచ్చినారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఉదయమూ, సాయంత్రం శ్రీనివాసునికి భక్తుల సమక్షంలో వూంజల్‌సేవ నిర్వహించినారు. మంగళహారతుల అనంతరం స్వామి సింహవాహనంపై కన్నుల పండువగా గ్రామోత్సవానికి తరలి వచ్చారు. కడపరాయని బ్రహ్మోత్సవాలలో భాగంగా తితిదే ధర్మప్రచారపరిషత్తు […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

‘కచ్చితంగా ఒంటిమిట్టలోనే నిర్వహించాల’

కడప: జిల్లా పట్ల వివక్ష చూపుతున్న ప్రభుత్వం శ్రీరామనవమి ఉత్సవాలను ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో చేపడితే సహించేదిలేదని, ప్రభుత్వం నిర్వహించే ఉత్సవాలను కచ్చితంగా ఒంటిమిట్టలోనే నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నజీర్అహ్మద్ డిమాండ్ చేశారు. బుధవారం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… భద్రాచలంలోని శ్రీరామచంద్రమూర్తికి రాష్ట్ర ప్రభుత్వం పట్టువస్త్రాలు, పీతాంబరాలు సమర్పించేదని, ప్రస్తుతం రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో భద్రాచలం తెలంగాణ ప్రభుత్వంలోకి వెళ్లిందన్నారు. ఈ నేపథ్యంలో […]పూర్తి వివరాలు ...

వార్తలు

దేవుని కడప బ్రహ్మోత్సవంలో ఈ రోజు

దేవుని కడప బ్రహ్మోత్సవాలలో బేస్తవారం (గురువారం) నాటి  కార్యక్రమాలు… ఉదయం 10 గంటలకు స్నపన తిరుమంజనం ఉదయం సూర్య ప్రభవాహనంపైన స్వామి భక్తులకు దర్శనమిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఊంజల్‌సేవ సాయంత్రం సింహ వాహనంపైన దేవుని కడప వీధులలో ఊరేగుతారు.  పూర్తి వివరాలు ...

రాజకీయాలు

93 మందితో వైకాపా జిల్లా కార్యవర్గం

కడప: 93 మంది సభ్యులతో కూడిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ప్రకటించారు. పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారి పదిమంది ప్రధాన కార్యదర్శులు, పన్నెండు మంది కార్యదర్శులు, పద్దెనిమిది మంది సంయుక్త కార్యదర్శులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, కోశాధికారి, క్రమశిక్షణ కమిటీ సభ్యులు ఇద్దరు, 44 మంది కార్యనిర్వాహక సభ్యులతో భారీ కార్యవర్గాన్ని ప్రకటించారు. స్థానిక వైఎస్ గెస్ట్‌హౌస్‌లో బుధవారం నగర మేయర్  కె.సురేష్‌బాబు, మైదుకూరు ఎమ్మెల్యే […]పూర్తి వివరాలు ...

ఆచార వ్యవహారాలు

శేషవాహనంపైన కడపరాయడు

దేవుని కడప: కడప రాయడు శ్రీలక్ష్మీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా సాగినాయి. భక్తుల గోవింద నామస్మరణలతో దేవుని కడప మార్మోగింది. ఉత్సవాలలో భాగంగా ఉదయం తిరుచ్చి గ్రామోత్సవం, ధ్వజారోహణం కార్యక్రమాలను నిర్వహించినారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేతుడైన స్వామి వారు శేషవాహనం పైన దేవిని కడప వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చినారు. ఉదయం తితిదే తిరుచానూరు నుంచి వచ్చిన వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారికి అభిషేకోత్సవం నిర్వహించినారు. దివ్య అలంకార శోభితులైన శ్రీదేవి, భూదేవి […]పూర్తి వివరాలు ...

error: