వార్తా విభాగం

ఆచార వ్యవహారాలు

వైభవంగా శ్రీవారి పుష్పయాగం

దేవుని కడప: కడపరాయని వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీవారికి వైభవంగా పుష్పయాగం చేశారు. తితిదే అర్చకులతో పాటు స్థానిక అర్చకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కాగా ఉదయం వారికి అభిషేకాలు,పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో జరిగిన దోష నివారణార్ధం ధ్వజావరోహణ జరిగిన మరుసటి రోజున స్వామి వారికి పుష్పయాగం చేస్తారు. బ్రహ్మోత్సవాల ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండిపూర్తి వివరాలు ...

ఆచార వ్యవహారాలు

ఈ రోజు నుంచి కాటివాలె సాహెబ్ ఉరుసు

కడప: నగరంలోని కాగితాలపెంటలో వెలిసిన కాటివాలె సాహెబ్ (ఖుద్-సె-సిర్రహుల్) దర్గాలో శనివారం నుంచి ఉరుసు ఉత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు ప్రకటనలో తెలిపారు. ఉరుసులో భాగంగా శనివారం రోజు గంధం, ఫిబ్రవరి 1 ఆదివారం రోజు ఉరుసు , 2వ తేదీ సోమవవారం నాడు తహ్‌లీల్ నిర్వహించనున్నట్లు తెలిపారు.పూర్తి వివరాలు ...

రాజకీయాలు

బాబును గద్దె దింపాలనే దుర్బుధ్ధితోనే…

పులివెందుల: స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట గురువారం తెలుగు తమ్ముళ్లు జగన్ దీక్షకు వ్యతిరేకంగా నిరసన దీక్ష చేపట్టడం వింతగా కనిపిస్తోంది. ప్రభుత్వం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే జగన్ నిరసన దీక్షకు దిగడం సిగ్గుచేటంటూ  తెదేపా రాష్ట్ర కార్యదర్శి రాంగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించినారు. కడప జిల్లా సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడైనా శాసనసభలో ప్రతిపక్ష నేత హోదాలో గళమెత్తావా? ఇప్పుడెందుకు నిరసన దీక్షలు చేయబోతున్నావు? […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

జాతీయ ఈత పోటీలకు మనోళ్ళు 11మంది

రాష్ట్రస్థాయి పోటీల్లో 17 బంగారు, 15 రజత, 2 కాంస్య పతకాలు కడప: ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు కేరళలో జరగనున్న జాతీయస్థాయి ఈత పోటీలకు 11మంది కడప జిల్లా ఈతగాళ్ళు అర్హత సాధించడం విశేషంగా ఉంది. కర్నూలులో ఇటీవల జరిగిన సబ్‌జూనియర్, జూనియర్, వింటర్ అక్వాటెక్ ఛాంపియన్‌షిప్ రాష్ట్రస్థాయి పోటీల్లో కడప ఈతగాళ్ళు పతకాల పంట పండించారు. ఇందులో 17 బంగారు, 15 రజత, 2 కాంస్య పతకాలతో మొత్తం 34 పతకాలు సాధించి కడప […]పూర్తి వివరాలు ...

వార్తలు

దేవుని కడప బ్రహ్మోత్సవాలలో గురువారం

దేవుని కడప బ్రహ్మోత్సవాలలో గురువారం (29 జనవరి 2015) నాటి ఉత్సవ కార్యక్రమాలు… ఉదయం వసంతోత్సవం, చక్రస్నానం, అవభృథ స్నానం సాయంత్రం వూంజల్‌సేవ, హంసవాహనసేవ, ధ్వజావరోహణంపూర్తి వివరాలు ...

ఆచార వ్యవహారాలు

చంద్రప్రభ వాహనంపై వూరేగిన కడపరాయడు

దేవుని కడప: దేవునికడప బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం వేంకటేశ్వర స్వామి వారు సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం చంద్రప్రభ వాహనంపై వూరేగారు. ఉదయం నిత్యహోమాలు, బలిహరణం, గ్రామబలి నిర్వహించారు. సాయంత్రం స్నపన తిరుమంజనం, వూంజల్‌సేవ చేసి సేదతీర్చారు. ఆలయ ప్రధాన అర్చకులు మచ్ఛాశేషాచార్యులు, మయూరం కృష్ణమాచార్యులు స్వామి వూంజల్‌సేవను, డోలోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వూంజల్‌సేవను తిలకించి భక్తులు తరించారు.పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

మన పోలీసుకుక్కలకు బంగారు, రజత పతకాలు

కడప: మూడు రాష్ట్రాల పోలీసు డాగ్ స్క్వాడ్‌లకు నిర్వహించిన పోటీల్లో కడప డాగ్‌స్క్వాడ్‌లు మొదటి, రెండవ బహుమతులు దక్కించుకున్నాయి. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇంటిలిజెన్స్ శిక్షణ అకాడమిలో ఈ పోటీలు జరిగినాయి. తెలంగాణ, అరుణాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కుక్కలకు ఈ పోటీలు నిర్వహించారు. కడప జిల్లా కుక్కలు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలవడంతో బంగారు, రజత పతకం అందచేశారు. ఈ సందర్భంగా డాగ్‌స్క్వాడ్‌ భాద్యతలు చూసే రామ్మోహన్‌రెడ్డి, శ్రీనివాసులు, పీరయ్య, శివకుమార్‌లను జిల్లా ఎస్పీ […]పూర్తి వివరాలు ...

ఆచార వ్యవహారాలు

ఈ రోజూ రేపూ ఇస్తిమా

రాయచోటి: సుండుపల్లి- సానిపాయ మార్గంలో బుర్రలదిన్నెపల్లె దగ్గర ఈ గురు, శుక్ర వారాలలో ఇస్తిమా (ఆధ్యాత్మిక సమ్మేళనం) జరగనుంది. ఇందుకు సంబంధించి నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ ప్రాంతాల నుండి సుమారు రెండు లక్షలకు పైగా  భక్తులు వస్తారని భావిస్తున్నారు. భారీ స్థాయిలో తాగునీటి వసతి, షామియానాలు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను ఆయా మార్గాల్లో నిలిపేందుకు అనువైన ప్రాంతాలను ఎంపిక చేశారు. ఈ సమావేశాల్లో ప్రవక్త బోధనలు, సామూహిక ప్రార్థనలు, […]పూర్తి వివరాలు ...

వార్తలు

ప్రొద్దుటూరులో వరుస దొంగతనాలు

ప్రొద్దుటూరు: నగరంలో దొంగతనాలు కొనసాగుతూనే ఉన్నాయి. దొంగలు తాళం వేసి ఉన్న ఇళ్లను ఎంచుకుని మరీ దొంగతనం చేస్తుండడంతో నగర వాసులు ఇల్లు విడిచి పోవాలంటే భయపడుతున్నారు. ఒకటి రెండు రోజుల పాటు ఆ ఇంటిని గమనిస్తూ, ఇంట్లో వారు ఎక్కడికి వెళ్లారో తెలుసుకొని దొంగలు రంగంలోకి దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఐదు రోజుల క్రితం మోడంపల్లె, జిన్నారోడ్డులోని నాలుగు ఇళ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన మరువక ముందే మోడంపల్లెలోని శారదా ప్రేమవాణి అనే […]పూర్తి వివరాలు ...

error: