
చంద్రప్రభ వాహనంపై వూరేగిన కడపరాయడు
దేవుని కడప: దేవునికడప బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం వేంకటేశ్వర స్వామి వారు సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం చంద్రప్రభ వాహనంపై వూరేగారు. ఉదయం నిత్యహోమాలు, బలిహరణం, గ్రామబలి నిర్వహించారు. సాయంత్రం స్నపన తిరుమంజనం, వూంజల్‌సేవ చేసి సేదతీర్చారు. ఆలయ ప్రధాన అర్చకులు మచ్ఛాశేషాచార్యులు, మయూరం కృష్ణమాచార్యులు స్వామి వూంజల్‌సేవను, డోలోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వూంజల్‌సేవను తిలకించి భక్తులు తరించారు.
