
చిన్న శేషవాహనం పైన దేవుని కడప లక్ష్మీ వేంకటేశ్వరుని చిద్విలాసం
చిన్నశేష, హనుమంత వాహనాలపైన కడపరాయడు
దేవుని కడప: బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగో రోజైన శుక్రవారం కడపరాయడు (లక్ష్మీ వేంకటేశ్వరుడు) చిన్నశేష, హనుమంత వాహనాలపైన భక్తులకు దర్శనమిచ్చినారు.
ఉదయం చిన్న శేష వాహనంపైన కొలువుదీరి గ్రామోత్సవానికి తరలి వెళ్ళిన స్వామి వారు సాయంత్రం ఉయ్యాల సేవ అనంతరం హనుమంత వాహనంపైన దేవుని కడప మాడ వీధులలో భక్తులకు దర్శనమిచ్చినారు.

చెక్కభజనలు, కోలాటాలు, గోవింద నామస్మరణల నడుమ భక్తుల జయజయధ్వానాల నడుమ దేవదేవుడు ఊరేగినారు.