వార్తా విభాగం

రాజకీయాలు

జిల్లా పేరు మార్చాలని తెదేపా తీర్మానం

కడప: వైఎస్‌ఆర్ జిల్లాకు కడప జిల్లాగానే పేరు మార్చాలని ఆదివారం కడపలో జరిగిన తెదేపా మినీ మహానాడులో ఆ పార్టీ నేతలు తీర్మానించారు. కడపకు ఎంతో ఘనచరిత్ర ఉందని, జిల్లాలో ఎంతోమంది కవులు, కళాకారులు, మహనీయులు, పుట్టారని, అలాంటి వారి పేర్లను మరచి జిల్లాకు వైఎస్‌ఆర్ కడప జిల్లా అన్న పేరు పెట్టడం దురదృష్టకరమని పలువురు తెలుగుదేశం నాయకులు పేర్కొన్నారు. ఆదివారం జరిగిన మినీమహానాడులో నూతన అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి దృష్టికి ఈ అంశాన్ని తీసుకురాగా వైఎస్‌ఆర్ పేరు […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

పదోతరగతిలో మనోళ్ళు అల్లాడిచ్చినారు

98.54 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే ప్రధమ స్థానం 484 మందికి పదికి పది జిపిఏ కడప : మూడేళ్లుగా ఉత్తీర్ణత శాతాన్ని గణనీయంగా పెంచుకుంటూ వచ్చిన కడప జిల్లా.. ఈ ఏడు పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. బుధవారం విడుదలైన ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు 98.54 శాతం ఉత్తీర్ణత సాధించి కడప జిల్లాను ప్రధమ స్థానంలో నిలిపినారు.  జిల్లా వ్యాప్తంగా 35,366 మంది పరీక్షలకు హాజరవ్వగా 34,848 మంది ఉత్తీర్ణులయ్యారు. దాంతో […]పూర్తి వివరాలు ...

జానపద గీతాలు

వదిమాను సేనుకాడ : జానపదగీతం

అత్త కూతురుతో మనువు కుదిరింది మల్లన్నకు. ఆ చనువుతో మల్లన్న మరదలిని తనతో కోతకు రమ్మని పిలిచినాడు. పెళ్లి కాకుండా ఇద్దరం కలిసి తిరిగితే నిన్నూ, నన్నూ ఛీ కొడతారంది మరదలు. అందుకతడు నేను ధర్మం తప్పేవాన్ని కాదు అన్నాడు. ఎన్నో ఆశలు చూపినాడు. ఏది ఏమైనా పెళ్ళైన పెళ్లి తర్వాతనే నీ చేనంతా కోస్తానంటుంది. సున్నితమైన బావా మరదళ్ల సరసాలు ఈ పాటలో చూడండి. వర్గం: కోతల పాటలు పాడటానికి అనువైన రాగం: మాయామాళవ గౌళ […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా గంటా?

కడప: మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా నియమితులయ్యారు. తాజాగా ముఖ్యమంత్రి అన్ని జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులను నియమించగా.. కడప జిల్లా బాధ్యతలను గంటాకు అప్పగించినట్లు సమాచారం. విశాఖ నగరంలోని భీమిలి నియోజకవర్గం నుంచి ఆయన శాసనసభ్యుడిగా గెలుపొందారు.పూర్తి వివరాలు ...

ఆచార వ్యవహారాలు

నేడు హనుమజ్జయంతి

ఆంజనేయస్వామి జయంత్యుత్సవం పురస్కరించుకుని జిల్లాలో ఉన్న ఆంజనేయస్వామి దేవస్థానాల్లో బుధవారం హనుమజ్జంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం నుంచే భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆలయాల నిర్వాహకులు భక్తులు స్వామిని దర్శించుకునేందుకు అన్నిఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా భక్తులు ఆంజనేయస్వామికి ఇష్టమైన ఆకుపూజలు చేయించి తమ మొక్కుబడులు తీర్చుకుంటారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి ఉదయం గణపతిపూజ, పుణ్యాహవాచనం, పురుషసూక్త, శ్రీసూక్త, నమక, చమక, మన్యుసూక్తపారాయణము, రుద్రహోమం, పూర్ణాహుతి, శ్రీరామాంజనేయ మూలమంత్ర జపం, అభిషేకం, అర్చన, నివేదనం, మంత్రపుష్పం […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

తితిదే పాలకమండలి సభ్యుడిగా పుట్టా సుధాకర్

మైదుకూరు: తెదేపా మైదుకూరు నియోజకవర్గ భాద్యులు పుట్టా సుధాకర్‌యాదవ్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యునిగా రాష్ట్రప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జె.ఎస్.వి.ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. సుధాకర్ గత ఎన్నికల్లో తెదేపా తరఫున మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. సుధాకర్‌యాదవ్ నియామకంపై జిల్లాకు చెందిన పలువురు తెదేపా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడికి సుధాకర్ యాదవ్ వియ్యంకుడు. యనమల సిఫార్సు ఆధారంగానే సుధాకర్ తితిదే […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

‘తానా’ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా మనోడు

కడప : ప్రవాసాంధ్రుల సంఘం ‘తానా’ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా కడప జిల్లాకు చెందిన వేమన సతీష్ ఎంపికయ్యారు. ప్రస్తుత కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు జరిగిన ఎన్నికలలో సతీష్ 5120 ఓట్ల ఆధిక్యత సాధించి కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సతీష్ ఇప్పటికే తెదేపా తరపున క్రియాశీలకంగా పని చేస్తున్నారు. తానా ఆధ్వర్యంలో చేపట్టే సామాజిక, సాంస్కృతిక సేవా కార్యక్రమాలలో సతీష్ కడప జిల్లాను కూడా భాగం చేస్తారని ఆశిద్దాం. తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన వేమన సతీష్ గారికి అభినందనలు!పూర్తి వివరాలు ...

అభిప్రాయం

వెనుకబడిన జిల్లాల మీద ధ్యాస ఏదీ?

మొన్న పద్దెనిమిదో తేదీ ఈనాడులో వచ్చిన వార్తాకథనంలో రాష్ట్రంలో పారిశ్రామిక కేంద్రాలుగా అభివృద్ధి చెయ్యడానికి ఎంపిక చేసిన 11 ప్రాంతాల జాబితా ఇచ్చారు: పైడి భీమవరం – శ్రీకాకుళం జిల్లా అచ్యుతాపురం – విశాఖపట్నం జిల్లా నక్కపల్లి – విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం – విశాఖపట్నం జిల్లా కాకినాడ – తూర్పుగోదావరి జిల్లా కంకిపాడు – కృష్ణా జిల్లా గన్నవరం – కృష్ణా జిల్లా జగ్గయ్యపేట – కృష్ణా జిల్లా కొప్పర్తి – కడప జిల్లా ఏర్పేడు-శ్రీకాళహస్తి […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

ఆకట్టుకున్న అలెగ్జాండర్ నాటక ప్రదర్శన

ప్రొద్దుటూరు: సినిమా నటుడు జయప్రకాశ్‌రెడ్డి ప్రదర్శించిన అలెగ్జాండర్ నాటకం ఆహూతులను కడుపుబ్బా నవించింది. స్థానిక జార్జిక్లబ్ సభాభవనంలో ప్రొద్దుటూరు నాటక కళాపరిషత్ 18వ వార్షికోత్సవం ముగింపు సభ ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయప్రకాశ్‌రెడ్డి అలెగ్జాండర్ నాటకాన్ని ప్రదర్శించినారు. ఇందులో పదవీ విరమణ పొందిన మేజర్ పాత్రను పోషించిన జయప్రకాశ్‌రెడ్డి ఆద్యంతం నాటకాన్ని రక్తి కట్టించారు. కుటుంబ వివాదాల నడుమ ఒంటరి జీవితం గడపాలని నిర్ణయించుకున్న మేజర్ నామజిక రుగ్మతలకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఒక […]పూర్తి వివరాలు ...

error: