ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని “వెనుకబడిన” ఏడు జిల్లాల అభివృద్ధి కోసం ఒక్కొక్క జిల్లాకు 50 కోట్ల రూపాయల చొప్పున ప్రకటించింది. ఆ ఏడు జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు. వాస్తవానికి ఆ ఏడు జిల్లాలూ అభివృద్ధి విషయంలో ఒకేలా లేవు. ఈ జిల్లాల మధ్య వివిధ రంగాల్లో అభివృద్ధిలో ఎంత అంతరముందో ప్రభుత్వ గణాంకాల ద్వారానే పరిశీలిద్దాం. వ్యవసాయ రంగం: 1. వ్యవసాయ ఉత్పాదకత: చిత్తూరు […]పూర్తి వివరాలు ...
కడప: పుష్పగిరి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు 11 రోజులపాటు నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 20న చందనోత్సవం, 21న గరుడవాహనం, 22న కల్యాణం, 23 రధోత్సవం నిర్వహిస్తారు. వెయ్యిసంవత్సరాల పురాతత్వ విశేషం కలిగిన పుష్పగిరిలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు వల్లూరు మండల అధికారులు, పుష్పగిరి మఠం వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాల్లో తొలిసారిగా ఏడు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్టస్థ్రాయి పోటీలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. గ్రామీణ క్రీడలు, మేధోక్రీడలు, చిత్రలేఖన సాహిత్యం, సంస్కృతికి ప్రతిబింబాలుగా ఏడు అంశాలలో, […]పూర్తి వివరాలు ...
కడప: కడప జిల్లాకు చెందిన ‘అక్కిశెట్టి నాగరాజ’ ప్రస్తుతం యుకెలో జరుగుతున్నస్థానిక ఎన్నికల బరిలో పోటీ చేస్తున్నారు. యుకెలో మూడవ అతి పెద్ద పార్టీ అయిన లిబరల్ డెమొక్రాట్స్ తరపున నాగరాజ ‘సౌత్ సోమర్సెట్’ జిల్లా కౌన్సిల్ అభ్యర్థిగా ‘యోవిల్ సౌత్’ నుండి పోటీ చేస్తున్నారు. మే 7న జరగనున్న ఈ ఎన్నికలలో నాగరాజ విజయం సాధించాలని కోరుకుందాం! మెకానికల్ ఇంజనీరింగ్ పట్టభద్రుడైన నాగరాజ ఉద్యోగరీత్యా యుకెలో స్థిరపడ్డారు.పూర్తి వివరాలు ...
కడప : జిల్లా ప్రజలపైన ఆరోపణలు గుప్పిస్తూ, జిల్లా అభివృద్ధికి ఆటంకంగా మారిన జిల్లా కలెక్టర్ ను గవర్నర్ వెంటనే వెనక్కి పిలిపించాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కలెక్టరేట్ ముట్టడిలో వివిధ రాజకీయపక్షాల నాయకులూ (తెదేపా మినహా), కార్యకర్తలూ, వివిధ ప్రజా సంఘాలు, ప్రజలూ పాల్గొన్నారు. ముందుగా కలెక్టరేట్ ఎదుట కూర్చుని నిరసన తెలిపిన అఖిలపక్షం ఆ తర్వాత కలెక్టరేట్ లోపలికి చొచ్చుకు పోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకుని, లాఠీచార్జీ చేశారు. […]పూర్తి వివరాలు ...
1997 ప్రాంతంలో ఒకసారి వేంపల్లెకు పోయినప్పుడు అక్కడి గ్రంథాలయంలో ‘సాహిత్యనేత్రం’ అని ఒక కొత్త పత్రిక కంటబడింది. మంచి కథలు, శీర్షికలు, కవితలు ఉన్న ఆ పత్రిక కడప నుంచి వెలువడుతోందని తెలిసి చాలా సంబరపడ్డాను. ఆ తర్వాత కడపకు పోయినప్పుడు నగర నడిబొడ్డైన ఏడురోడ్ల కూడలికి అతిసమీపంలో ఉన్న ఆ పత్రిక కార్యాలయానికి వెళ్ళి సంపాదకుడిని కలుసుకుని పాత సంచికలన్నీ తెచ్చుకున్నాను. ఆ సంపాదకుడు శశిశ్రీ. s తర్వాత అప్పుడప్పుడూ నేత్రం ఆఫీసుకు వెళ్తూ ఉండేవాడిని. […]పూర్తి వివరాలు ...
నిన్న ‘పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారా?’ అని మేము ప్రచురించిన విశ్లేషణను చదివిన కొంతమంది ఇలా చెబుతున్నారు, నేరాల రేటు కాదు కడపలో హత్యలూ, మానభంగాలు లాంటి వాటిలో కడప జిల్లా స్థానం సంగతి చెప్పండి అనీ. వీటి ప్రాతిపదికగానే గౌరవ ముఖ్యమంత్రి గారు కడప జిల్లాకు సదరు కీర్తిని కట్టబెట్టారు అనీ. 2013 నేర గణాంకాల ప్రకారం అం.ప్ర లో వివిధ రకాల నేరాల తీవ్రతను అధికంగా కలిగిన జిల్లాలు… మానభంగాలు లేదా అత్యాచారాలు: మొదటి స్థానం సైబరాబాద్ […]పూర్తి వివరాలు ...
శుక్రవారం తమిళనాడు సరిహద్దును ఆనుకుని ఉన్న చిత్తూరు జిల్లాలోని సత్యవేడు శ్రీసిటీ ప్రత్యేక ఆర్ధిక మండలిలో 11 పారిశ్రామిక యూనిట్లకు శంకుస్థాపన చేసిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనక జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ పరిశ్రమలు రావాలంటే శాంతిభద్రతల ఆవశ్యకత ఎంత అనేది సెలవిచ్చారు. సంతోషం, ఒక ముఖ్యమంత్రి పారిశ్రామికవేత్తల సమక్షంలో వారి మనసును రంజిపచేసే విషయాలు మాట్లాడి వారిని ఆకట్టుకున్నందుకు అభినందనలు. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి గారు కడప జిల్లాను గురించి తన […]పూర్తి వివరాలు ...
తేల్చిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వేమూరి రాధాకృష్ణ – ఆంధ్రజ్యోతి మీడియా గ్రూపుకు అధిపతి, ఆం.ప్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆప్తుడు, ఆంతరంగికుడు అని తెదేపా వర్గాలు చెబుతుంటాయి. రాధాకృష్ణ గారు ‘కొత్తపలుకు’ పేర ఇవాళ ఆంధ్రజ్యోతిలో రాసిన సంపాదకీయంలో ‘పట్టిసీమ’ అసలు గుట్టు విప్పినారు. ఇదే విషయాన్ని కడప.ఇన్ఫో రాస్తే అదంతా ఊహే అని తీసిపారేశారు కొంతమంది. ‘వాస్తవానికి, పట్టిసీమ అనేది తాత్కాలికంగా చేస్తున్న ఏర్పాటు మాత్రమే! పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నప్పటికీ, […]పూర్తి వివరాలు ...
కడప: జిల్లా కలెక్టర్ కెవి రమణ వ్యవహారశైలికి నిరసనగా సోమవారం నాడు కలెక్టరేట్ ముట్టడికి అఖిలపక్షం పిలుపునిచ్చింది. కడప జిల్లా ప్రజలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడమే కాకుండా, ప్రజా వ్యతిరేఖ చర్యలకు పాల్పడుతున్న కలెక్టర్ ఇక్కడి నుండి వెళ్లిపోవాలని కోరుతూ ఈ ఆందోళనను నిర్వహించనున్నట్లు అఖిలపక్షం నేతలు ఒక ప్రకటనలో తెలియజేశారు.పూర్తి వివరాలు ...