వార్తా విభాగం

ఆచార వ్యవహారాలు ప్రత్యేక వార్తలు

కనుల పండువగా కోదండరాముని రథోత్సవం

ఒంటిమిట్ట : కోదండరాముని రథోత్సవం శుక్రవారం కన్నుల పండువగా సాగింది. సీతాలక్ష్మణ సమేతుడై రథంపై ఊరేగి వచ్చిన  కోదండరాముడు పుర వీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. అంతకు ముందు ఉత్సవ విగ్రహాలకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రథం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించిన రథం వద్దకు ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి ఆశీనులను చేశారు. స్థానిక తహశీల్దార్ కనకదుర్గయ్య పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. రామనామస్మరణ […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

‘పులివెందులకు తాగునీటి ఇక్కట్లు తప్పవు’

జలాశయాలను పరిశీలించిన జగన్ 16 టిఎంసిల నీళ్ళు ఇవ్వాల్సి ఉంటే 2.55 టిఎంసీలే ఇచ్చారు పులివెందుల: విపక్ష నేత, పులివెందుల శాసనసభ్యుడు వైఎస్ జగన్ శుక్రవారం మాయిటాల పులివెందులకు నీరందించే పెంచికల బసిరెడ్డి జలాశయం, పైడిపాలెం జలాశయాలను సందర్శించారు. అలాగే పార్నపల్లె తాగునీటి పథకాన్ని, అలాగే వెలిదండ్లలోని నీటికుంటను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నీటి కేటాయింపుల విషయంలో ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. జగన్ ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ… ‘‘పెంచికల బసిరెడ్డి జాలశయం (చిత్రావతి […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు రాజకీయాలు

పాత హామీల ఊసెత్తని ముఖ్యమంత్రి

కడప: గురువారం కోదండరాముని పెళ్లి ఉత్సవంలో పాల్గొనేందుకు వచ్చి ఒంటిమిట్ట బహిరంగ సభలో మాట్లాడిన  ముఖ్యమంత్రి శ్రీరామ ఎత్తిపోతల పథకానికి రూ.34 కోట్లు, ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు, రాజంపేట – కడప రోడ్డులో కొంత భాగానికి రూ.5 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు అక్కడి నుంచి రోడ్డుమార్గాన బయలుదేరి ఒంటిమిట్ట ఆలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం వావికొలను సుబ్బారావు కొండపైకి చేరుకుని పరిశీలించారు. తరువాత జిల్లా […]పూర్తి వివరాలు ...

ఆచార వ్యవహారాలు ప్రత్యేక వార్తలు

వైభవంగా కోదండరాముడి పెళ్లి ఉత్సవం

ఒంటిమిట్ట: ఒంటిమిట్టలో గురువారం రాత్రి శ్రీసీతారాముల పెళ్లి ఉత్సవం శాస్త్రోక్తంగా, వైభవంగా జరిగింది. గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ దంపతులు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేర్వేరుగా స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తితిదే  తరపున కార్యనిర్వహణాధికారి సాంబశివరావు పట్టు వస్త్రాలు అందజేశారు. అంతుకు ముందు సీతా రాములను వేర్వేరుగా వేద పండితులు, ఆలయ సిబ్బంది ఆలయం నుంచి కల్యాణ వేదిక వద్దకు పల్లకిలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. సర్వాంగ సుందరంగా ముస్తాబైన రామయ్య, సీతమ్మను కల్యాణ వేదికపైకి తెచ్చి నిర్వహించిన […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

పశుగణ పరిశోధనా కేంద్రాన్నిఉపయోగంలోకి తీసుకురండి

ప్రభుత్వానికి విపక్షనేత జగన్ విజ్ఞప్తి పులివెందుల: 247 కోట్ల రూపాయల నిధులూ, 650 ఎకరాల క్యాంపస్ కలిగిన పశుగణ పరిశోధనా కేంద్రాన్ని ఉపయోగంలోకి తీసుకువస్తే రైతులకు మేలు జరుగుతుందని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని ప్రతిపక్ష నాయకుడు, వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం పులివెందులలోని అధునాతన పశుగణ పరిశోధనా కేంద్రాన్ని (ఐజీ కార్ల్) సందర్శించారు. ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ…. ”వ్యవసాయం గిట్టుబాటు కాని దుస్థితి ఉంది. పశుపోషణ […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

ఈ రోజు రాత్రి ఒంటిమిట్టలో సీతారాముల పెళ్లి

ఓఒంటిమిట్ట: ఈ రోజు (గురువారం) రాత్రి జరగనున్న కోదండరామయ్య పెళ్లి ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయినాయి. ప్రభుత్వ లాంఛనాలతో సీతారాముల పెళ్లి ఉత్సవాన్ని కనులపండువగా నిర్వహించనున్నారు. శ్రీరామనవమి నుంచి ఆరో రోజున రాత్రివేళ వెన్నెలలో ఈ కల్యాణం నిర్వహించడం మొదటి నుంచి ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. అధిక సంఖ్యలో భక్తులు కల్యాణాన్ని వీక్షించేందుకు వీలుగా పలు ఏర్పాట్లు చేశారు. అలాగే పెద్దఎత్తున భద్రత ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఒంటిమిట్ట ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటయ్యే బహిరంగ సభలో ముఖ్యమంత్రి […]పూర్తి వివరాలు ...

పర్యాటకం

ఒంటిమిట్ట కోదండరామాలయం

రాష్ర్టవిభజన నేపథ్యంలో భద్రాచల రామాలయం తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి వెళ్లడంతో ఆంధ్రప్రదేశ్‌లో శ్రీరామనవమి వేడుకలను అధికార లాంఛనాలతో కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయం వేదికగా నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆ ఆలయ విశేషాల పట్ల తెలుగువారిలో సహజంగానే ఆసక్తి నెలకొంది. ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా ఎన్నో విశిష్టతలను సంతరించుకున్న ఈ రామాలయం వివరాలు… కడప నుంచి తిరుపతికి వెళ్లే ప్రధానమార్గంలో కడపకు 24 కి.మీ. దూరంలో మండలకేంద్రం ఉంది. ఈ గ్రామం త్రేతాయుగం నాటిదని స్థలపురాణం వివరిస్తోంది. […]పూర్తి వివరాలు ...

వార్తలు

శశిశ్రీ ఇక లేరు

కడప:  సంవత్సర కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ కవి, రచయిత, సీనియర్ పాత్రికేయుడు షేక్ బేపారి రహమతుల్లా అలియాస్ శశిశ్రీ బుధవారం అర్ధరాత్రి కడప నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. స్థానిక  ద్వారకానగర్‌లోని ఆయన ఇంటికి చేరుకుని అభిమానులు, సాహితీవేత్తలు, పాత్రికేయులు బుధవారం సాయంత్రం కన్నీటి వీడ్కోలు పలికారు. భౌతికకాయం వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు, పాత్రికేయులు, సీమ జిల్లాలకు చెందిన సాహితీవేత్తలు కూడా ఆయన […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

‘కడప జిల్లాపై వివక్ష కొనసాగిస్తూనే ఉన్నారు’

ముఖ్యమంత్రికి రాసిన బహిరంగలేఖలో కడప జిల్లా కాంగ్రెస్ కడప: కడప జిల్లాకు ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యాన్ని, జిల్లాపైన తెదేపా కొనసాగిస్తున్న వివక్షను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖ రాసింది. ఈమేరకు ఇందిరాభవన్‌లో బుధవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నజీర్  అహ్మద్ ఆ లేఖను విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను సమానంగా చూస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కడప జిల్లాపై వివక్ష కొనసాగిస్తూనే ఉన్నారని ఆరోపించారు. ‘మీరు […]పూర్తి వివరాలు ...

error: