వార్తా విభాగం

ప్రత్యేక వార్తలు

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల షెడ్యూలు 2015

రేపటి నుంచి ఉత్సవాల అంకురార్పణ కడప: ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలను ఈ నెల 27వ నుంచి ఏప్రిల్ 6 వరకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెంకటరమణ తెలిపారు. భక్తులు దర్శనానికి వెళ్లే సమయంలో సెల్‌ఫోన్లు, కెమేరాలు వెంట తీసుకెళ్లరాదని, పాదరక్షలు వేసుకుని వెళ్లరాదని సూచించారు. దర్శనం టికెట్ దేవస్థానంలో కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. 27వ తేదీ ఉదయం 4 గంటల నుంచి ప్రజలు స్వామిని దర్శించుకునే వీలు కల్పించామన్నారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

విద్యుత్ చార్జీల పెంపు సమంజసమా!

ప్రొద్దుటూరు: లోటును అధిగమించేందుకు విద్యుత్ చార్జీలు, పన్నుల పెంపు సమంజసమే అని మాజీ శాసనసభ్యుడు నంద్యాల వరదరాజులురెడ్డి సమర్ధించారు. బుధవారం స్థానిక తెదేపా కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ… స్పీకర్ పట్ల వైకాపా సభ్యులు అనుచితంగా ప్రవర్తించి ప్రజాస్వామ్యాన్ని అభాసుపాలు చేశారని ఆరోపించారు. వైకాపా తన వైఖరిని మార్చుకోవాలని వరద సూచించారు. ప్రతిపక్షం హుందాగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్న విషయం జగన్‌కు తెలియదా అని ప్రశ్నించారు. వైకాపాలో గూండాగిరి చేసే వారు అధికంగా […]పూర్తి వివరాలు ...

కవితలు

వానొచ్చాంది (కవిత)

ఆకు అల్లాడ్డంల్యా గాలి బిగిచ్చింది ఉబ్బరంగా ఉంది ఊపిరాడ్డంల్యా ఉక్క పోచ్చాంది వంతు తప్పేట్లు లేదు వంక పారేట్లే ఉంది. పొద్దు వాల్తాంది మిద్దెక్కి సూచ్చనా వానొచ్చాదా రాదా? పదునైతాదా కాదా? అదును దాట్తే ఎట్లా? ఏడు పదుల కరువు పందికొక్కుల దరువు పంకియ్యని ప్రభువు ముదనష్టపు అప్పు ఉరితాళ్ళ బతుకు. అద్దద్దో…ఆపక్క మోడం ఎక్కొచ్చాంది ఆ మూల నుంచి కుమిల్లు కుమిల్లు నల్లగ కలయబారతాంది కొత్తమిట్ట కాడికొచ్చె దున్నంగి పంపుల్లో దిగబడే అబ్బీ……వచ్చరా….వానొచ్చరా…. మాంచి మోదుబ్బీ… […]పూర్తి వివరాలు ...

వార్తలు

కేసీ కాలువ కోసం 25కోట్లడిగితే 4.9కోట్లిస్తారా?

కడప: కడప – కర్నూలు కాలువ ఆధునికీకరణ పనుల కోసం రూ.25కోట్లు ఖర్చుచేయాల్సి వస్తుందని అధికారులు చెబితే ప్రభుత్వం రూ.4.9కోట్లు కేటాయించడం దారుణమని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య ఆరోపించారు. రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి నిధులు, నికర జలాలు సాధించి సకాలంలో పూర్తిచేస్తానని మేనిఫెస్టోలో ప్రకటించిన చంద్రబాబునాయుడు ప్రస్తుతం సీమ ప్రయోజనాలను గాలికొదిలేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం ఆధ్వర్యంలో సోమవారం రాజోలి ఆనకట్ట పరిశీలనకు ప్రతినిధి బృందం వెళ్లి వచ్చింది. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ కేసీ కాలువ […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

పట్టిసీమకు అనుకూలంగా తెదేపా నేతల ర్యాలీ

పట్టిసీమ ద్వారా రాయలసీమకు కృష్ణా జలాలను తీసుకురావడానికి సీఎం చంద్రబాబు మహాయజ్ఞం చేస్తుంటే, విపక్ష నేత జగన్ దీనికి అడ్డుపడుతున్నారని ఆరోపిస్తూ శాసనమండలి ఉపాధ్యక్షులు సతీష్‌కుమార్‌రెడ్డి (తెదేపా) ఆధ్వర్యంలో సోమవారం పులివెందుల పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి జిల్లాలోని తెదేపా నేతలంతా హాజరై పట్టిసీమకు అనుకూలంగా మాట్లాడటం విశేషంగా ఉంది. అనంతరం ర్యాలీనుద్దేశించి సతీష్‌రెడ్డి, తెదేపా నేతలు ప్రసంగించారు. వర్షాలు లేకపోవడంతో ఈ ప్రాంత రైతులు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, ఇటువంటి పరిస్థితి మున్ముందు […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

ఒంటిమిట్టలో రోడ్ల పునరుద్ధరణకు 45లక్షలు

కడప: ఒంటిమిట్ట కోదండరామాలయం సమీపంలోని రోడ్లు పునరుద్ధరించేందుకు, అలాగే రథం తిరిగే రోడ్డు వెంబడి మరమ్మతులు చేసేందుకు గాను ప్రభుత్వం 45 లక్షల రూపాయలను  (G.O.RT.No. 242) మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం పేర (పంచాయతీ రాజ్ శాఖ) కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి  జీవో నెంబరు 242ను మార్చి 11న విడుదల చేశారు. ఇందులో 40 లక్షల రూపాయలను వెచ్చించి వాహనశ్రేణి (విఐపి) తిరిగేందుకు వీలుగా ఆలయ సమీపంలోని రోడ్లను పునరుద్ధరిస్తారు. మిగతా ఐదు […]పూర్తి వివరాలు ...

జానపద గీతాలు

సుక్కబొట్టు పెట్టనీడు… జానపదగీతం

అనుమానపు మగడు ఆ ఇల్లాలిని ఎంతో వేధించాడు. విసిగించాడు. పాపం ఆ ఇల్లాలు అతని సూటిపోటి మాటలు భరించలేకపోయింది.  సుక్కబొట్టు పెట్టినా, రంగుచీర కట్టినా, అద్దంలో చూసినా, సహించలేని తన భర్తను గురించి ఆమె ఇలా చెప్తోంది… వర్గం: జట్టిజాం పాట పాడటానికి అనువైన రాగం: శుద్ధ సావేరి స్వరాలు (దేశాది తాళం) సుక్కబొట్టు పెట్టనీడు సుట్టాల సూడనీడు ఎన్నాళ్ళు కాయిలుంటడో ఈనాకుసించ ఎన్నాళ్ళు కాయిలుంటడో పచ్చబొట్టు పెట్టనీడు పసుపుసీరె కట్టనీడు ఎన్నాళ్ళు కాయిలుంటడో ఈనాకుసించ ఎన్నాళ్ళు […]పూర్తి వివరాలు ...

రాయలసీమ వార్తలు

రాయలసీమ మహాసభ కడప జిల్లా కమిటీ

రాయలసీమ మహాసభ ఆదివారం జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకుంది.కడప జిల్లా కమిటీ సభ్యులు వీరే… అధ్యక్షుడు –  ఎన్.ఎస్.ఖలందర్ ఉపాధ్యక్షులు – నూకా రాంప్రసాద్‌రెడ్డి, తవ్వా ఓబుల్‌రెడ్డి ప్రధాన కార్యదర్శి – జింకా సుబ్రహ్మణ్యం కార్యదర్శులు – సూర్యనారాయణరెడ్డి, పోలు కొండారెడ్డి సహాయ కార్యదర్శులు – గంగనపల్లె వెంకటరమణ, పుట్టా పెద్ద ఓబులేశు కోశాధికారి – మొగలిచెండు సురేశ్ కార్యవర్గ సభ్యులు – సాయిప్రసాద్, చంద్రశేఖర్‌రెడ్డి, జి.పార్వతీ టి.వెంకటయ్య, నాగరాజు కల్చరల్ కమిటీ కన్వీనర్ – ధర్మిశెట్టి […]పూర్తి వివరాలు ...

రాయలసీమ వార్తలు

దుమ్ముగూడెంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాల

కడప: దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టును కేంద్రం తక్షణమే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని రాయలసీమ మహాసభ తీర్మానించింది.  స్థానిక సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంలో ఆదివారం జరిగిన సమావేశంలో సీమ జిల్లాలకు చెందిన రచయితలు, కళాకారులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాయలసీమ సమగ్రాభివృద్ధి సాధనే ధ్యేయంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని రాయలసీమ మహాసభ కేంద్రకమిటీ అధ్యక్షులు డా.శాంతినారాయణ పిలుపునిచ్చారు.  ఈ సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. పోలవరం వల్ల ప్రయోజనం స్వల్పమేనన్నారు. […]పూర్తి వివరాలు ...

error: