వార్తా విభాగం

రాయలసీమ వార్తలు

రాయలసీమ మహాసభ కడప జిల్లా కమిటీ

రాయలసీమ మహాసభ ఆదివారం జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకుంది.కడప జిల్లా కమిటీ సభ్యులు వీరే… అధ్యక్షుడు –  ఎన్.ఎస్.ఖలందర్ ఉపాధ్యక్షులు – నూకా రాంప్రసాద్‌రెడ్డి, తవ్వా ఓబుల్‌రెడ్డి ప్రధాన కార్యదర్శి – జింకా సుబ్రహ్మణ్యం కార్యదర్శులు – సూర్యనారాయణరెడ్డి, పోలు కొండారెడ్డి సహాయ కార్యదర్శులు – గంగనపల్లె వెంకటరమణ, పుట్టా పెద్ద ఓబులేశు కోశాధికారి – మొగలిచెండు సురేశ్ కార్యవర్గ సభ్యులు – సాయిప్రసాద్, చంద్రశేఖర్‌రెడ్డి, జి.పార్వతీ టి.వెంకటయ్య, నాగరాజు కల్చరల్ కమిటీ కన్వీనర్ – ధర్మిశెట్టి […]పూర్తి వివరాలు ...

రాయలసీమ వార్తలు

దుమ్ముగూడెంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాల

కడప: దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టును కేంద్రం తక్షణమే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని రాయలసీమ మహాసభ తీర్మానించింది.  స్థానిక సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంలో ఆదివారం జరిగిన సమావేశంలో సీమ జిల్లాలకు చెందిన రచయితలు, కళాకారులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాయలసీమ సమగ్రాభివృద్ధి సాధనే ధ్యేయంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని రాయలసీమ మహాసభ కేంద్రకమిటీ అధ్యక్షులు డా.శాంతినారాయణ పిలుపునిచ్చారు.  ఈ సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. పోలవరం వల్ల ప్రయోజనం స్వల్పమేనన్నారు. […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

ఉర్దూ విశ్వవిద్యాలయం దీక్ష విరమణ

ముఖ్యమంత్రిని కలిసేందుకు సతీష్ హామీ కడప: సంఖ్యాపరంగా, పాఠశాలల పరంగా చూసినా కడపలో ఉర్దూ విశ్వవిద్యాలయం సాధనకు మేం శాయశక్తులా కృషిచేస్తాం, విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని శాసనమండలి ఉపాధ్యక్షుడు సతీష్‌రెడ్డి అన్నారు. యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 20రోజుల నుంచి కడప కలెక్టరేట్ వద్ద జరుగుతున్న నిరాహార దీక్షాశిబిరాన్ని సందర్శించిన సతీష్  నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారమే ఉర్దూ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు సలా ఉద్దీన్, ఇతర ప్రముఖులతో […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

‘వాస్తు కోసం దక్షిణ ద్వారం మూయండి’: కలెక్టర్

ఒంటిమిట్ట: వాస్తు రీత్యా దక్షిణద్వారం అనర్థదాయకం కావడంతో కోదండ రామాలయ దక్షిణ ద్వారాన్ని మూసి వేయాలని జిల్లా సర్వోన్నత అధికారి కేవిరమణ అధికారులకు సూచించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను శనివారం జిల్లాకలెక్టరు కేవీ రమణ పరిశీలించారు. కల్యాణం నిర్వహించే ప్రదేశాన్ని పరిశీలించారు. బ్రహ్మోత్సవాల సమయంలో బారికేడ్లతో భక్తులకుఇబ్బందులు కలగకుండా పటిష్టమైన వరుసలు ఏర్పాటు చేయాలని అధికారులకు చెప్పారు. కల్యాణం నిర్వహించే ప్రాంత వంకను పూడ్చాలని జెడ్పీవైస్‌ఛైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి కలెక్టరు సూచించారు. ప్రస్తుతం సమయంతక్కువగా […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

కూల్‌డ్రింక్స్ వల్ల అనారోగ్య సమస్యలు

కడప: జనవిజ్ఞానవేదిక కడప జిల్లా కమిటీ ప్రచురించిన ‘కూల్‌డ్రింక్స్ మానేద్దాం.. సహజ పానీయాలే తాగుదాం’ అన్న కరపత్రాలను ఇన్‌ఛార్జి జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి అరుణ సులోచనాదేవి శుక్రవారం జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషక విలువలు లేని, అనారోగ్య సమస్యలు సృష్టించే శీతల పానీయాలను తాగడం మానేయడం మంచిదన్నారు. శీతల పానీయాల్లో అదనపు క్యాలరీలు స్థూలకాయానికి దారితీస్తాయన్నారు. వాటిని ఎక్కువకాలం తాగితే మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువన్నారు. చిన్నారులు శీతలపానీయాలు తాగకుండా తల్లిదండ్రులు నిరుత్సాహపరచాలని […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

గవర్నర్ చేతులమీదుగా కోదండరామ కళ్యాణం

ఒంటిమిట్ట : కోదండరాముని కల్యాణాన్ని ఏప్రిల్ 2న గవర్నర్ నరసింహన్ చేతులమీదుగా నిర్వహిస్తామని దేవాదాయశాఖ సహాయ కమిషనరు శంకర్‌బాలాజీ చెప్పారు. శుక్రవారం ఒంటిమిట్టలో పాత్రికేయులతో మాట్లాడుతూ… చేత్తో ఒలిచిన బియ్యం గింజలతో సీతారాముల తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహిస్తామని  ఆయన తెలిపారు. చేత్తో ఒలిచిన బియ్యం గింజలను చుట్టుప్రక్కల గ్రామస్థులు 27 వరకూ తెచ్చి ఇవ్వవచ్చునన్నారు. ఈ ఏడాది నూతనంగా ప్రవేశ పెట్టే ఈ ఆచారాన్ని విజయవంతం చేయాలన్నారు. కల్యాణంలో పాల్గొనదలచిన 25లోగా భక్తులు రూ. వెయ్యి చెల్లించి […]పూర్తి వివరాలు ...

వార్తలు

రేపు రాయలసీమ మహాసభ సమావేశం

మైదుకూరు: రాయలసీమ మహాసభ అధ్వర్యంలో ఆదివారం (మార్చి 22వ తేదీ) కడపలోని సి.పి.బ్రౌన్ గ్రంథాలయంలో రాయలసీమ రచయితల, కవుల, కళాకారుల, ప్రజాసంఘాల, విద్యార్ధి, మహిళా,  రైతుసంఘాల ప్రతినిధుల సమావేశం జరుగనుంది . ఉదయం 10 గంటలకు రాయలసీమ గురించి చర్చ జరుగుతుంది. మధ్యాహ్నం రాయలసీమ మహాసభ కడప జిల్లా కార్యవర్గ ఎంపిక జరుగుతుంది. సంబందిత ప్రతినిధులందరికీ , రాయలసీమ అస్తిత్వం గురించి తపన పడే మిత్రులకు సమావేశం ఆహ్వానం పలుకుతోంది.పూర్తి వివరాలు ...

వార్తలు

బీఎస్ఎన్ఎల్‌కు జిల్లాలో రూ.13 కోట్ల నష్టం

ఇదే కొనసాగితే ప్రైవేటుకు అప్పగించినా ఆశ్యర్యపోనవసరం పులివెందుల: ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ సంస్థను లాభాలబాట పట్టించేందుకు ఉద్యోగులంతా కృషి చేయాలని జీఎం శివశంకరరెడ్డి సూచించారు. సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఉద్యోగులతో సమావేశం అయిన ఆయన మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా సంస్థకు గత ఏడాది రూ.785కోట్లు నష్టం వస్తే జిల్లాలో రూ.13 కోట్ల నష్టం వచ్చిందన్నారు. ఇదే కొనసాగితే భవిష్యత్తులో జీతాలు కూడా ఉండవన్నారు. వసతులూ నిలిపేస్తూ ప్రైవేటు సంస్థకు నిర్వహణ అప్పగించినా ఆశ్యర్యపోనవసరం లేదని చెప్పారు. ల్యాండ్‌ఫోన్ల […]పూర్తి వివరాలు ...

వార్తలు

తాగే నీళ్ళ కోసం..ఖాళీ బిందెలతో ఆందోళన

కడప: నగరపాలక సంస్థ పరిధిలో తాగునీటి సమస్య నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ నగరంలో రోజురోజుకు నీటి సమస్య ఎక్కువవుతోందని, కలుషిత నీటితో జనం రోగాలబారిన పడుతున్నారని తెలిపారు. నీటి ఎద్దడి నివారణకు శాశ్వత మార్గాలు అన్వేషించకపోతే కార్పొరేషన్ కార్యకలాపాలను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ఐదురోజులుగా సీపీఐ నాయకులు బృందాలుగా ఏర్పడి […]పూర్తి వివరాలు ...

error: