
కడప కార్పోరేషన్ వైకాపా పరం
కడప నగరపాలక సంస్థ (కార్పోరేషన్) వైకాపా పరమైంది. మొత్తం 50 డివిజన్లకు 42 డివిజన్లలో వైకాపా కార్పొరేటర్లు గెలుపొందారు. తెదేపా ఇక్కడ కేవలం 8 స్థానాలకు పరిమితమైంది. తెదేపా తరపున మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగిన బాలకృష్ణ యాదవ్ వైకాపా అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.
ఇక్కడ వైకాపా తరపున మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సురేష బాబు ఎన్నిక లాంచనం కానుంది.