ఉప ప్రచారానికి ప్రచారానికి ఎంపీ సబ్బం
కడప : ఉపఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, విజయమ్మలకు మద్దతుగా ప్రచారం చేసేందుకు ఎంపీ సబ్బం హరి కడపకు రానున్నారు. ఇప్పటికే ఆయన జగన్‌కు మద్దతుగా ప్రచారానికి వెళ్లాల్సి ఉన్నా…ఎన్నికలు సమీపించేముందు వాతావరణాన్ని మరింత వేడెక్కించాలని ఆయన భావించారు.
జగన్, విజయమ్మలకు ఫ్యాన్‌గుర్తు వచ్చిన శుభసందర్భంలో శుక్రవారం ఆయన కడపకు ప్రయాణం కానున్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు రవిబాబు, పూడి మంగపతి, కార్పొరేటర్ రవిరాజు, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకుడు విళ్లా శ్రీనివాసరావు బయలుదేరనున్నారు. విశఖ నుండి ఈ రోజు మధ్యాహ్నం ఎయిరిండియా విమానంలో హైదరాబాద్‌కు చేరుకుని అక్కడనుంచి కడపకు వెళతారు.