బేట్రాయి సామి దేవుడా-నన్నేలినోడ బేట్రాయి సామి దేవుడా కాటేమి రాయుడా ! కదిరి నరసిమ్మడా మేటైన వేటుగాడ నిన్నే నమ్మితిరా 1బే1 శాపకడుపున చేరి పుట్టగా-రాకాసిగాని కోపామునేసి కొట్టగా ఓపినన్ని నీళ్ళలోన వలసీ వేగమె తిరిగి బాపనోళ్ళ సదువులెల్ల బెమ్మదేవరకిచ్చినోడ 1బే1 తాబేలై తాను పుట్టగ -ఆ నీల్లకాడ దేవాసురులెల్ల గూడగ దోవసూసి కొండకింద దూరగానె సిల్కినపుడు సావులేని మందులెల్ల దేవర్ల కిచ్చినోడ !బే1 అందగాడవవుదు లేవయా-గోపాల గో విందా రచ్చించ రావయా పందిలోన సేరి కోరపంటితో […]పూర్తి వివరాలు ...
సామాజిక నిష్ఠ కలిగియున్న రసం ఏదైనా కావ్యాన్ని చిరస్థాయి స్థితిలో నిల్పుతుంది అనేది అలంకారికుల అభిప్రాయం. విశ్వజనీనమైన, విశ్వసృష్టికి ఆధార భూతమైన, సకల ప్రాణికోటికి సమాన ధర్మమైన శృంగారం ప్రాచీన సాహిత్యంలో ప్రధానమైన స్థానాన్ని పొందబట్టే భోజుడు శృంగార ఏవ ఏకోరసం’’ అన్నాడు. అందుకేనేమో ఒకటవ శతాబ్దిలో శాతవాహన చక్రవర్తి హాలుడు సేకరించిన ప్రాకృత గాథల సమాహారమైన “”గాధాసప్తశతి’’ లో శృంగారమే అధిక పాళ్ళలో కనిపిస్తూంటుంది. ప్రాకృత భాషలో ఉన్న ఈ గాథల్ని “ఛాయ’గా సంస్కృతంలోకి ప్రాచీనులు […]పూర్తి వివరాలు ...
“కాటమరాయుడా..కదిరి నరసిం హుడా” అంటూ పవన్ కల్యాణ్ “అత్తారింటికి దారేదీ” అనే చిత్రం కోసం పాడిన పాట రాయలసీమలో జనులు పాడుకునే ఒక ప్రసిద్ధ జానపదగీతం. కదిరి తాలూకా ఒకప్పుడు కడప జిల్లాలో భాగంగా ఉండేది. అందువల్ల కడప జిల్లా జానపదులకు కూడా ఈ గీతం బాగా పరిచయమే! శ్రీ మహావిష్ణువు దశావతారాలను ఈ గీతం వివరిస్తుంది. ఈ గీతాన్ని చక్క భజన కళాకారులూ ఇతర జానపద కళాకారులూ వివిధ పద్దతుల్లో పాడుకొంటూ ఉంటారు.. 1940 లో […]పూర్తి వివరాలు ...
వాణిజ్య ప్రకటనల యవనిక పై ఏ సూడో రైతు నాయకుడో వెండితెర వేలుపో ప్రత్యక్షమై బహుళజాతి చిలుకల్లా పలుకుతున్నారు చితికిన కొబ్బరి రైతు సాక్షిగా బోండాముల్లో హలాహలాన్ని చిమ్మి కోలాల కోలాహలం సృష్టిస్తున్నారు ఖాజీపేట గోళీసోడా, మైదుకూరి నన్నారి షర్బత్, అనాగరిక పానీయాలంటున్నారు పులియో గరే, కుర్ కురే, పిజ్జా, బర్గర్లను మహాప్రసాదాలుగా అభివర్ణిస్తున్నారు చింతకుంట సాయిబులు ఒంటెద్దు బండ్లో ఉప్పునూ వంకమర్రి వాళ్లు చెంబుల పిండినీ అమ్మొచ్చినప్పుడు వీధుల్ని అలుముకునే జీవన నాదాన్ని నిర్ధాక్షిణ్యంగా నులిమేస్తున్నారు […]పూర్తి వివరాలు ...
గండికోట శ్రీరామచంద్రుని స్తుతించిన అన్నమయ్య సంకీర్తన విజయనగర సామ్రాజ్య కాలంలో వేలుగులీని హైందవ సంప్రదాయానికీ, సంస్కృతికీ ప్రతీకగా నిలిచిన గండికోటను చేరిన ‘పదకవితా పితామహుడు’ అక్కడి రాముని సేవించి తరించినాడు. గండికోట శ్రీరామచంద్రునికి అన్నమయ్య సమర్పించిన సంకీర్తనా నీరాజనమిది…. వర్గం : శృంగార సంకీర్తన కీర్తన సంఖ్య: 165 (19వ రాగిరేకు) రాగం: దేవగాంధారి ‘రాజవు (పు) నీకేదురేదీ’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి. ‘రాజవు నీకేదురేదీ’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ […]పూర్తి వివరాలు ...
కేతు విశ్వనాథరెడ్డి గురించి సొదుం జయరాం “జ్ఞాపకశక్తికీ నాకూ చుక్కెదురు. విశ్వం, నేనూ ఎప్పుడు దగ్గరయ్యామో నాకు సరిగ్గా గుర్తు లేదు. ఇద్దరం ప్రొద్దుటూరు మునిసిపల్ హైస్కూల్లో చదువుకున్నాం. కానీ ఆ రోజుల్లో మా ఇద్దరికీ స్నేహం అయినట్టు లేదు. నేను ఇంటర్మీడియేట్ చదువుతున్న రోజులలో రా.రా గారు కడపకొచ్చారు. ఆయన ఎక్కడెక్కడి వాళ్ళను ఒకచోట చేర్చారు. గజ్జల మల్లారెడ్డి, కేతు విశ్వనాధరెడ్డి, ఆర్వీఆర్, రామప్ప, బండి గోపాల్ రెడ్డి, వై.సి.వి.రెడ్డి, కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి, గోవిందరెడ్డి, రామ్మోహన్ […]పూర్తి వివరాలు ...
యంగమునివ్యవసాయంకథ మోచేతులు దాటి ఖాకీ చొక్కా, మోకాలు దాటి ఖాకీ నిక్కరు, గడ్డపార భుజాన ఒకవైపు పికాసి, మరోవైపు చెట్లడ్డ, పారతో యంగముని, పంగలకర్ర, మచ్చుగత్తి, ప్లాస్టిక్ బిందెతో సావిత్రి, టైర్ లేయర్‌తో చేసిన ఆకు చెప్పలు వేసుకుని చీకటి విచ్చీ విచ్చకముందే ఒకవిడత ఉప్పుతో ఊరబెట్టిన అంబలితాగి, మధ్యాహ్నానికి రెండు ఎరగడ్డలు, రెండు పచ్చిమిరపకాయలు, చద్దన్నం మూట, ప్లాస్టిక్ బిందెలో పదిలంగా పెట్టుకని బోడిగుట్టకు కోడు కొట్టుకుందుకు బయలుదేరుతారు. పనిలోకి వంగితే ఇద్దరి మధ్య మాటా […]పూర్తి వివరాలు ...
వదినకు ఒకసరి బిందెకు బిగసరి బంగారు జడ కుచ్చుల మా వదిన అహ బంగారు జడ కుచ్చుల మావదిన ।వదినకు । తాటి తోపులో పామును చూసి (2) వడ్డాణమంటది మా వదిన తన నడుముకు కట్టమంటది మా వదిన ।వదినకు । చెరువులొ ఉండే కప్పల్ని చూసి బోండాలంటది మా వదిన తాను భోంచేస్తానంటది మా వదిన ।వదినకు । బండిని తోలే బండోణ్ని చూసి నా మొగుడంటది మా వదిన ఎగిరి బండెక్కి కూర్చుంటది […]పూర్తి వివరాలు ...
బమ్మెరపోతన మనుమలు కేసన, మల్లనలు. వీరు పోతనకు ముమ్మనుమలనియు తెలుస్తున్నది. వీరు జంటకవులు. విష్ణు భజనానందం, దాక్షాయణీ పరిణయం అను రెండు కావ్యాలు రచించారు. దాక్షాయణీ పరిణయంలోని ‘సుకవి స్తుతి’లో తమ తాత పోతరాజును, ఇతర కవులను ప్రశంసించారు. ఆ గ్రంథం అముద్రితం. వావిళ్ల వారి శ్రీమదాంధ్ర భాగవత ముద్రణలోని శేషాద్రి రమణ కవుల ‘భాగవత ప్రశంస’ నుండి ఆ ప్రశంసా పద్యాన్ని ఎత్తి చూపుతున్నాను. ఆ పద్యమిది. చ|| నెఱిగుఱిగల్గు నన్నయమనీషిని దిక్కన శంభుదాసునిన్ బరువడి […]పూర్తి వివరాలు ...