ఇందులోనే కానవద్దా

రాజవు నీకెదురేదీ రామచంద్ర – అన్నమయ్య సంకీర్తన

గండికోట శ్రీరామచంద్రుని స్తుతించిన అన్నమయ్య సంకీర్తన

విజయనగర సామ్రాజ్య కాలంలో వేలుగులీని హైందవ సంప్రదాయానికీ, సంస్కృతికీ ప్రతీకగా నిలిచిన గండికోటను చేరిన ‘పదకవితా పితామహుడు’ అక్కడి రాముని సేవించి తరించినాడు.  గండికోట శ్రీరామచంద్రునికి అన్నమయ్య సమర్పించిన సంకీర్తనా నీరాజనమిది….

వర్గం : శృంగార సంకీర్తన
కీర్తన సంఖ్య: 165 (19వ రాగిరేకు)
రాగం: దేవగాంధారి


‘రాజవు నీకేదురేదీ’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి.

చదవండి :  'గండికోట'కు పురస్కారం

పల్లవి:  రాజవు నీకెదురేదీ రామచంద్ర
రాజీవ నయనుడ రామచంద్ర

చరణం: వెట్టిగాదు నీవలపు వింటి నారికి దెచ్చితిని
(ర)ఱట్టు సేయ బనిలేదు ఇట్టే రామచంద్ర
గుట్టుతోడ జలనిధిపై గొండలు ముడివేసితి
మెట్టు మరవగ వచ్చునివి రామచంద్ర ||రాజవు ||

చరణం: బతిమి తోడుత బైడి పతియె గైకొంటి
రతికెక్కె నీ చలము రామచంద్ర
మితిమీరి జవ్వనము మీదు కట్టితివి నాకై
ఇతరులేమనగలరిక రామచంద్ర ||రాజవు ||

చరణం: నావంటి సీతను నాగేటి కొన దెచ్చితి
రావాడి తమకముతో రామచంద్ర
ఈ వేళ శ్రీ వేంకటాద్రి నిరవై నన్ను గూడితి
చేవదేర గండికోట శ్రీరామచంద్ర ||రాజవు ||

చదవండి :  అన్నమయ్య దర్శించిన ఆలయాలు


‘రాజవు (పు) నీకేదురేదీ’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి.

ఇదీ చదవండి!

సింగారరాయుడ

సింగారరాయుడ వౌదు చెన్నకేశా – అన్నమయ్య సంకీర్తన

మాచనూరు చెన్నకేశవుని సంకీర్తనలు – 1 పదకవితా పితామహుడు దర్శించిన క్షేత్రాలు అనేకం కడప జిల్లాలో ఉన్నాయి. ఆయా వైష్ణవ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: