ఆలయాల వద్ద పటిష్ట నిఘా గ్రామ రక్షక దళాలతో పోలీసుల సమన్వయం అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారమివ్వండి కడప : జిల్లాలో ఉన్న దేవాలయాలు, ప్రార్థనా మందిరాల భద్రతపై పోలీసుల పటిష్ట నిఘాతో పాటుగా రాత్రి వేళ పెట్రోలింగ్ , ఆకస్మిక తనిఖీలను ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్.పి అన్బురాజన్ ఈ రోజు (సోమవారం) మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పాటుగా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలపాలన్నారు. […]పూర్తి వివరాలు ...
సాహితి లోకంలో రారాగా సుప్రసిద్ధులైన రాచమల్లు రామచంద్రారెడ్డిగారి పరిచయభాగ్యం నాకు 1977లో ‘ఈనాడు’ పత్రికలో సబ్‌ఎడిటర్ ట్రెయినీగా పని చేస్తున్నప్పుడు కలిగింది. మా బ్యాచ్‌లో మేము పదిమంది దాకా ఉండేవాళ్ళం. వార్తల్ని ఇంగ్లీషు నుండి తెలుగులోకి ఎలా అనువదించాలో ఆర్నెల్ల పాటు మాకు శిక్షణ ఇచ్చారు. అను వాదం ఎంత సంక్లిష్టమైనదో అప్పుడే నేను తెలుసుకున్నాను. రా.రా.మాకు శిక్షణ గురువు. తాను సంపాదకీయాలు రాస్తూనే వార్తల్ని ఎలా అనువదించాలో మాకు నేర్పించారు. ఆయన నిండైన విగ్రహం నాకింకా […]పూర్తి వివరాలు ...
2004లో రిజర్వాయర్ తొలి సామర్థ్యం 16.850 TMC, మునక గ్రామాలు 14. 2007లో పెంచిన రిజర్వాయర్ సామర్థ్యం 26.85 TMC, మునక గ్రామాలు 22. ———————————- పులివెందుల నియోజకవర్గంలో ఎండిపోతున్న చీనీ చెట్లకు ఆరునెలల్లో నీళ్లిస్తామని, అంతవరకు తాను గడ్డం కూడా తియ్యనని శపథం చేసిన అప్పటి తెదేపా నాయకుడు, శాసనమండలి ఉపాధ్యక్షుడు (ఇప్పుడు కూడా ఈయన “అధికార పార్టీ”లోనే ఉన్నాడు) రెండుమూడేళ్ళుగా గడ్డంతోనే తిరుగుతున్నాడని జాలిపడి, గడ్డం తీయించడానికి తొందరపడి 2017లో గండికోట రిజర్వాయర్ నుంచి […]పూర్తి వివరాలు ...
కడప : అన్నమాచార్య సంకీర్తనలపై విశేష పరిశోధనలు చేసిన ప్రముఖ పండితుడు కామిశెట్టి శ్రీనివాసులు శనివారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. కడప జిల్లాకు చెందిన డాక్టర్ కామిశెట్టి శ్రీనివాసులు (జూన్ 25, 1941) అన్నమాచార్య కీర్తనలపై పరిశోధన చేసిన వారిలో ప్రముఖుడు. ఇదే రంగంలో కీలకమైన పరిశోధన చేసిన రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ శిష్యుడు. ఆయన జూన్ 25, 1941 తేదీన లక్ష్మీదేవి, కామిశెట్టి వెంకటసుబ్బయ్య దంపతులకు కడపలో జన్మించారు. స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నుంచి డిగ్రీ […]పూర్తి వివరాలు ...
నేను పెద్దగా రుచులు తెలిసినవాణ్ణి కాను. రుచుల విషయంలో నాది మా నాన్న తరహా. ఏదైనా పదార్థం తినేటప్పుడు ఎంత రుచిగా ఉంటుందనే దాన్ని బట్టి కాకుండా ఎంత సులభంగా గొంతు దిగుతుంది, తిన్న తర్వాత ఎంత తేలిగ్గా అరుగుతుంది, అరిగాక వంట్లో ఏం చేస్తుంది అన్నదాన్ని బట్టే ఇష్టాయిష్టాలు ఏర్పడుతాయి :-). మా అమ్మ మా చిన్నప్పుడు ఇంట్లోనే ఎప్పటికప్పుడు రకరకాల స్వీట్లు, ఇతర చిరుతిండ్లు చేసి పెట్టేది. ఊర్లో మిగతా పిల్లలు గువ్వలచెరువు (యెస్, […]పూర్తి వివరాలు ...
ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు వస్తే కొన్ని నెలల క్రిందట పత్రికల్లో ఒక వార్త వచ్చింది – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో నాలుగు ప్రాంతీయ అభివృద్ధి/ప్రణాళిక మండళ్లను ఏర్పాటు చేయనుందని. నాలుగు రాయలసీమ జిల్లాలకు కలిపి కడపలో, ఉత్తరాంధ్రకు విజయనగరంలో, మధ్యాంధ్రకు కాకినాడలో, దక్షిణాంధ్రకు గుంటూరులో అన్నారు. మూడు రాజధానుల విషయంలో లాగే నగరాల ఎంపికలోనే నాకు అభ్యంతరం ఉంది తప్ప వికేంద్రీకరణ విషయంలో ఈ మండళ్ల ఏర్పాటును నేను పూర్తిగా సమర్థిస్తాను. ఉత్తరాంధ్రకు విజయనగరం, దక్షిణాంధ్రలోని మూడు […]పూర్తి వివరాలు ...
మైదుకూరు మాజీ శాసనసభ్యుడు పాలకొలను నారాయణ రెడ్డి (84) సోమవారం హైదరాబాదులో కన్ను మూశారు. ఆయన 1962-67 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మైదుకూరు నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహించారు. పోరుమామిళ్ల మండలం అక్కలరెడ్డిపల్లెలో పిచ్చమ్మ, వెంకటసుబ్బారెడ్డి దంపతులకు 1936 ఆగస్టు 9వ తేదీన జన్మించారు. నారాయణ రెడ్డి బి.ఎ. ఎల్.ఎల్.బి చదివి మొదట న్యాయవాద వృత్తిని చేపట్టి అనంతరం రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1967లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థి పి.ఎల్.రెడ్డిపై నారాయణరెడ్డి […]పూర్తి వివరాలు ...
2013లో కడప జిల్లాలో IPC (Indian Penal Code) కింద నమోదైన నేరాల రేటు 222.4గా ఉంది. నేరాల రేటును లక్ష మంది జనాభాను ప్రాతిపదికగా తీసుకుని లెక్కిస్తారు. అదే సంవత్సరం ఆం.ప్ర రాష్ట్రంలో సగటు నేరాల రేటు 244.5గా ఉంది. 2013వ సంవత్సరంలో కృష్ణా (254.1), గుంటూరు అర్బన్ (388.1), నెల్లూరు (232.6), విశాఖపట్నం (297.3), చిత్తూరు (తిరుపతితో కూడిన) (281), రాజమండ్రి నగరం(239.4), విజయవాడ నగరం (416.2), రంగారెడ్డి (469.6), నిజామాబాద్ (269.6), నల్గొండ […]పూర్తి వివరాలు ...
రోజూ కాకపోయినా వీలుకుదిరినప్పుడల్లా ఈనాడు.నెట్లో కడప జిల్లా వార్తలు చూసే నేను క్రైమ్ వార్తల జోలికి పోయేవాడ్ని కాదు. తునిలో రైలు దహనం జరిగిన రోజు అప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యల గురించి తెలిసిన తర్వాత (ఆ వ్యాఖ్యల గురించి కూడా కొన్ని రోజుల తర్వాతే నాకు తెలిసింది) అడపా దడపా నేరవార్తలు కూడా చూడడం మొదలుపెట్టాను. ఎక్కువ జనాభా ఉన్న జిల్లాలో సహజంగానే ఎక్కువ నేరాలు నమోదౌతాయి. ఐతే కడప జిల్లాలో సహజసిద్ధమైన […]పూర్తి వివరాలు ...