స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పోటీ చేస్తే ఏకగ్రీవంగా గెలిపించుకుంటామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దేవగుడి ఆదినారాయణరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, కమలమ్మ అన్నారు. కడప నగరంలోని వైఎస్ గెస్ట్‌హౌస్‌లో శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీగా పోటీ చేయాలని మధ్యవర్తి ద్వారా తాము ప్రతిపాదించినప్పటికీ వివేకానందరెడ్డి సుముఖత చూపలేదన్నారు. ఆయన మొండిగా వ్యవహరించడం అందరికీ బాధాకరంగా ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే తామంతా పదవులు […]పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Sunday, February 27, 2011
కడప : జిల్లాలో మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న రాజీవ్‌ఆరోగ్యశ్రీ వైద్యశిబిరాల వివరాలను రాజీవ్‌ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ మార్కారెడ్డి తెలిపారు. మార్చి 1న అట్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ) పరిధిలోని రెడ్డిపల్లిలో, 3న తొండూరు పీహెచ్‌సీ పరిధిలోని టి.తుమ్మలపల్లిలో, 4న నూలివీడు పీహెచ్‌సీ పరిధిలోని పులికుంటలో, 5నపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Sunday, February 27, 2011
కడప: మార్చి 18 నుంచి కడపలో సీఆర్‌పీఎఫ్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు స్టెప్ సీఈవోమహేశ్వరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం సీఆర్‌పీఎఫ్ అధికారులు జిల్లా కలెక్టర్‌తో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కడప తెలుగు గంగ క్వార్టర్స్‌లోని స్టెప్ ఆర్మీ బిల్డింగులో ఈ ఎంపికలు నిర్వహిస్తారన్నారు. విద్యార్హత: 10వ తరగతి ఉత్తీర్ణులై 170 సెం.మీ ఎత్తు ఉన్న ఆసక్తి గల యువకులు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌కు దరఖాస్తు చేసి ఎంపికలో పాల్గొనాల్సిందిగా ఆయన తెలిపారుపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Friday, February 25, 2011
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తన అల్లుడు సజ్జల శ్రీధర్‌రెడ్డికి మద్దతిచ్చి బలపరచాలని నంద్యాల ఎంపీ ఎస్‌పీవై.రెడ్డి కోరారు. కడప నగరంలోమాజీ కార్పొరేటర్లు, జగన్‌వర్గ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్‌పీవై.రెడ్డి మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి తనకు చాలా సన్నిహితుడని చెప్పారు. తాను అడిగిన వెంటనే వైఎస్ జగన్ మాజీ డీసీసీ అధ్యక్షుడు కె.సురేష్‌బాబును పోటీ నుంచి విరమింపజేసి, తన అల్లుడు సజ్జల శ్రీధర్‌రెడ్డికి మద్దతు ప్రకటించడం సంతోషకరమన్నారు. శ్రీధర్‌రెడ్డికి మద్దతు […]పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Thursday, February 24, 2011
లింగాల : కడప పార్లమెంట్‌కు త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో తన అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి పోటీలో ఉండరని వ్యవసాయశాఖ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి తెలిపారు. లింగాల కుడికాలువను ఆయన గురువారం పరిశీలించారు. అనంతరం ఎంపీపీ ఇంట్లో ఆయన విలేకరులతోమాట్లాడారు.రాజశేఖరరెడ్డికి పార్టీ ఎంపీ టిక్కెట్ వద్దని చెప్పడానికే ఢిల్లీ వెళ్లానన్నారు. ఎమ్మెల్సీ టిక్కెట్ అడగలేదని, అధిష్టానం ఆదేశాల మేరకు పని చేస్తానన్నారు. ఎమ్మెల్సీ టిక్కెట్ ఎవరికిస్తారనే దానిపై ఆయన స్పందిస్తూ నారాయణరెడ్డి, గోవిందరెడ్డి, వరదరాజులరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయన్నారు. […]పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Thursday, February 17, 2011
వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డే రాష్ట్రంలో జన హృదయ నేతని.. వచ్చే ఎన్నికల్లో ఆయనే ముఖ్యమంత్రి అని 35 శాతం మంది ప్రజలు చెప్తున్నారని ఎన్‌టీవీ-నీల్సన్ ఓఆర్‌జీ మార్గ్ సర్వే వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ మెజారిటీ సీట్లు గెలుచుకుని ఒంటరిగానే అధికారంలోకి వస్తుందని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అవుతారని 19 శాతం మంది చెప్తే.. టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రి అవుతారని మరో 19 […]పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Thursday, December 23, 2010
కడప పెద్ద దర్గాను సందర్శించినాక ప్రశాంతత ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవి శంకర్ గురూజీ కడప: కడప ప్రజల మతసామరస్యం ప్రపంచానికే ఆదర్శమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ గురూజీ కొనియాడారు. రవిశంకర్ గురువారం కడప నగరంలోని అమీన్‌పీర్ దర్గా (పెద్ద దర్గా)ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కడప పెద్ద దర్గా మతసామరస్యానికి ప్రతీక అని అన్నారు. ఈ దర్గాకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. అంతేకాకుండా […]పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Monday, July 20, 2009
అనుకున్నట్లుగానే రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి మళ్లీ మొండి చేయి చూపారు. రాష్ట్రానికి చెందిన ముప్పై ముగ్గురు అధికార పార్టీ ఎంపీలు ఉత్సవ విగ్రహాలు గానే మిగిలారు. లాలూప్రసాద్ బాటలోనే మమతాబెనర్జీ కూడా తెలుగు ప్రజల ఉనికిని ఏ మాత్రం లెక్కచేయలేదు. రెండు కొత్త రైళ్లను, రెండు రైళ్ల పొడి గింపును, కొత్త రైలు లైన్ల నిర్మాణానికి మూడు చిన్నా చితక ప్రతిపాదనలనూ, ఒక డబ్లింగ్ పనినీ, ఒక విద్యుద్దీకరణనూ, ఒక గేజ్ మార్పిడి పనినీ ఆంధ్ర ప్రజలకు […]పూర్తి వివరాలు ...