వార్తా విభాగం

వార్తలు

5న భాజపా ఆధ్వర్యంలో ఛలో సిద్దేశ్వరం

కడప: కర్నూలు జిల్లా సిద్ధేశ్వరం వద్ద అలుగు నిర్మించాలని, గుండ్రేవుల వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టాలనే డిమాండ్ తో రేపు (మే 5న) భాజపా ఆధ్వర్యంలో ‘ఛలో సిద్ధేశ్వరం’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు బీజేవైఎం జాతీయ కార్యవర్గసభ్యుడు నాగోతు రమేష్‌ తెలిపారు. మంగళవారం రాజంపేటలోని ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ రెండు ప్రాంతాల్లో అలుగు, బ్యారేజీ నిర్మాణం వల్ల రాయలసీమకు సుమారు 40 టీఎంసీల నీరు అదనంగా వచ్చే అవకాశముందన్నారు. వీటిని నిర్మించాలని […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం

శ్రీశైలంతో కృష్ణా డెల్టాకు అనుబంధం తొలిగిపోయిందిలా!

యనమల రామకృష్ణుడు గారు 2016 -17 ఆంద్రప్రదేశ్ రాష్ట్ర బడ్జట్ శాసనసభలో ప్రవేశ పెడుతూ చేసిన ప్రసంగంలో “గోదావరి, క్రిష్ణా జిల్లాల ప్రాంతమంత 160 సంవత్సరాల క్రితం దుర్భర దారిద్ర్యములో ఉండేదని, సర్ ఆర్దర్ కాటన్ మహాశయుడు ధవలేశ్వరం మరియు విజయవాడల దగ్గర బ్యారేజిల నిర్మాణం చేయడం వలన ఆ ప్రాంతాలు ధాన్యాగారాలుగా మారాయి” అని వివరించారు. అదేవిధంగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి రాయలసీమను ధాన్యాగారంగా మారుస్తుందని చెప్పారు. గోదావరి నదిని క్రిష్ణానదితో అనసంధానించడం ద్వారా […]పూర్తి వివరాలు ...

వార్తలు

‘జువారి సిమెంట్స్’కు ఉత్తమ యాజమాన్య అవార్డు

కడప: 2015-16 సంవత్సరానికి గానుఅం.ప్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ యాజమాన్య అవార్డుకు ఎర్రగుంట్లలోని ‘జువారి సిమెంట్స్’ కర్మాగారం ఎంపికైందని ఆ సంస్థ మానవ వనరుల విభాగం సీనియర్ మేనేజర్ శ్రీరాం కడప.ఇన్ఫోకు తెలిపారు. కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం విజయవాడ నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (వర్క్స్) వైఎస్ రావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. కర్మాగారంలో అనుసరించిన ఉత్తమ విధానాల కారణంగా తమకు ఈ […]పూర్తి వివరాలు ...

జీవోలు సాగునీటి పథకాలు

జీవో 69 (శ్రీశైలం నీటిమట్టం నిర్వహణ)

జీవో నెంబర్ : 69 (సాగునీటి పారుదల శాఖ) విడుదల తేదీ : 15.06.1996 ప్రధాన ఉద్దేశ్యం : ‘కృష్ణా జలాలను ఎక్కడా ఆపకుండా వీలైనంత త్వరగా డెల్టాకు చేరవేయడం‘ అని సాగునీటి రంగ నిపుణులు పేర్కొంటారు. జీవో 69 సారాంశం : విద్యుత్ ఉత్పత్తి నెపంతో అధికారికంగా శ్రీశైలం నీటిని కృష్ణా, గుంటూరు జిల్లాలకు తరలించేందుకు ‘జీవో 69’ని ఆం.ప్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో శ్రీశైలం జలాశయ కనీస నిర్వహణా నీటిమట్టాన్ని 834 అడుగులుగా […]పూర్తి వివరాలు ...

ఈ-పుస్తకాలు

ఎంపరర్ ఆఫ్ కరప్షన్ ఈ-పుస్తకం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి ‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’ పేర వైఎస్సార్ కాంగ్రెస్ ప్రచురించిన పుస్తకం. ఈ పుస్తకాన్ని వైకాపా డిల్లీలో పలువురు రాజకీయ నాయకులకు, కేంద్ర మంత్రులకు పంచి పెట్టింది.పూర్తి వివరాలు ...

వార్తలు

ఎంసెట్‌ రాసే అభ్యర్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం

కడప: ఎంసెట్‌-2016 పరీక్ష రాసే విద్యార్థులకు పరీక్ష రోజున ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ గోపీనాథ్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులు హాల్‌టిక్కెట్టు చూపించి ఇంటి నుంచి పరీక్షా కేంద్రాలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. కడప, ప్రొద్దుటూరు ఆర్టీసీ బస్టాండుల నుంచి పరీక్షా కేంద్రాల వరకు ఉదయం, మధ్యాహ్నం ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో తెలియచేశారు. కడప: ఎంసెట్‌-2016 పరీక్ష […]పూర్తి వివరాలు ...

వార్తలు

కోస్తాకేమో కృష్ణా గోదారి నీళ్ళు… మాకేమో ఇంకుడు గుంతలా

కడప జిల్లాపై ముఖ్యమంత్రి తీవ్ర వివక్ష చూపిస్తున్నారు రెండు జిల్లా వాళ్ళ మూడో పంట కోసమే పట్టిసీమ ఇంకుడు గుంతల పేరు చెప్పి ప్రాజెక్టులు అటకెక్కిస్తున్నారు ప్రొద్దుటూరు: కోస్తా ప్రాంతంలోని రెండు జిల్లాలకు కృష్ణా గోదారి నీళ్ళు రాయలసీమకు ఇంకుడు గుంతలా అని సిపియం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. స్థానిక సిపియం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేకించి కడప జిల్లాపై చంద్రబాబునాయుడు తీవ్ర […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

వైకాపాకు మైసూరారెడ్డి రాజీనామా

కడప : వైకాపాలో సీనియర్ నేతగా ఒక వెలుగు వెలిగిన మైసూరారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించి వైకాపా అధినేతకు ఆయన రాసినట్లుగా చెబుతున్న నాలుగు పేజీల లేఖ బుధవారం మీడియాకు విడుదలైంది. మైసూరారెడ్డి గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ వైఖరి పట్ల అసంతృప్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మైసూరా లేఖలో తెలిపారు. వైకాపాలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని లేఖలో మైసూరా ఆరోపించారు. గతంలో తన ప్రమేయం లేకుండానే వైకాపాలో […]పూర్తి వివరాలు ...

వార్తలు

బిందు సేద్యం చేయండి: చంద్రబాబు

ఊటుకూరు వద్ద రైల్వే ఫ్లైఓవర్  నిర్మాణానికి శంకుస్థాపన కడప: జిల్లా రైతులు బిందు సేద్యం ద్వారా పంటలు సాగు చేయాలని ముఖమంత్రి  చంద్రబాబు పిలుపునిచ్చారు. సోమవారం వివిధ కార్యక్రమాలలో పాల్గొనే నిమిత్తం జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి తొలుత ఇటీవల మరణించిన మాజీ ఎంపీ గునిపాటి రామయ్య కుటుంబాన్ని రైల్వేకోడూరులో పరామర్శించారు. తర్వాత రామాపురం మండలం నల్లగుట్టపల్లి చేరుకొని అక్కడి నీరు-చెట్టు పనులను పరిశీలించారు. అనంతరం కడపకు వచ్చిన ఆయన ఒక ప్రయివేటు ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన […]పూర్తి వివరాలు ...

error: