వార్తా విభాగం

ప్రత్యేక వార్తలు

కడప విమానాశ్రయం నుండి ప్రయాణీకుల రాకపోకలు 2015

31 రోజులలో 1918 మంది కడప విమానమెక్కినారు మన కడప విమానాశ్రయం నుండి 2015లో 1918 మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించారు. 7 జూన్ 2015న ప్రారంభమైన కడప విమానాశ్రయం నుండి ఆ సంవత్సరం ఎయిర్ పెగాసస్ సంస్థ వారానికి మూడు రోజుల పాటు కడప – బెంగుళూరుల నడుమ విమాన సర్వీసును నడిపింది. 2015లో 31 రోజుల పాటు కడప – బెంగుళూరు విమాన సర్వీసు నడిచింది. 2015 సంవత్సరానికి గాను కడప విమానాశ్రయంలో ప్రయాణీకుల […]పూర్తి వివరాలు ...

వార్తలు

‘పాయలోపల్లి’లో చిరుతల సంచారం

రాయచోటి: పాయలోపల్లి (మండలం: చక్రాయపేట, గ్రామ పంచాయతీ: సురభి) సమీపంలోని అటవీ ప్రాంతంలో మూడు చిరుతపులులు సంచరిస్తున్నట్లు ఇటీవల స్థానికులు గుర్తించారు. ఊరి చుట్టూ మామిడి తోటలు అధికంగా ఉండటంతో పాటు, ఊరికి సమీపంలోనే అటవీ ప్రాంతం ఉంది. బుధవారం అడవిలోకి గొర్రెలను తోలుకెల్లిన సమయంలో ఒక చిరుతపులి గొర్రెల మందపై దాడి చేసి ఒక గొర్రెను తినేసిందని కాపరులు చెప్పారు. దీంతో గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. రాయచోటి: పాయలోపల్లి (మండలం: చక్రాయపేట, గ్రామ […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం

ముఖ్యమంత్రి గారూ, అభినందించండి సార్!

కడప జిల్లా గురించి ఎవరూ ఏమీ అడక్కపోయినా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గత రెండేళ్ళుగా చెప్తూనే వస్తున్నారు. ఆయన ఎప్పుడైనా అలసిపోయి ఊరుకుంటే ఆయన ఏరి కోరి నియమించుకున్న కలెక్టరు కె వెంకటరమణ గారు కడప జిల్లా అంటే “భయం… భయం…” అని అందరికీ నూరిపోస్తూనే ఉన్నారు (కాకతాళీయంగా పదో తరగతి ఫలితాలు విడుదలైన రోజే ఈ జిల్లా కలెక్టరుగా ఆయనకు చివరిరోజు). వీళ్ళ దృష్టిలో ‘రాష్ట్రంలో ఎక్కడ ఏ దుర్ఘటన జరిగినా…మొదటి నిందితులు కడప […]పూర్తి వివరాలు ...

రాయలసీమ వార్తలు

మా పిల్లోల్లకు 48 గంటల్లో క్షమాపణ చెప్పాల

చలసాని, శివాజీలకు బైరెడ్డి హెచ్చరిక అనంతపురం: మేధావిగా చెప్పుకునే చలసాని, సినీనటుడు శివాజి రాయలసీమ పిల్లోల్లపై జరిగిన దాడులపై 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో వాళ్ళ ఇళ్ళ దగ్గర విద్యార్థులు నిరసనలకు దిగుతారని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి హెచ్చరించారు సోమవారం అనంతపురంలో చలసాని, శివాజీల ప్రోద్భలంతో విద్యార్థి సంఘ నాయకులు క్రిష్ణానాయక్‌, ప్రతాప్‌రెడిలప్డై జరిగిన దాడిని నిరసిస్తూ రాయలసీమకు చెందిన వివిధ సంఘాల నేతృత్వంలో మంగళవారం నగర పాలక సంస్థ […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

పదోతరగతి ఫలితాల్లో కడప జిల్లాదే అగ్రస్థానం

98.89 శాతం ఉత్తీర్ణత 797 మందికి పదికి పది జిపిఏ కడప: పదోతరగతి ఫలితాల్లో మళ్లీ మనోళ్ళు సత్తా చాటారు. కడప జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపారు. పదోతరగతిలో కడప జిల్లా విద్యార్థులు 98.89 శాతం ఉత్తీర్ణత (Pass) సాధించి జిల్లాను మొదటి స్థానంలో నిలబెట్టారు. మొత్తం 797 మంది విద్యార్థులు (2.2 శాతం) పదికి పది జీపీఏ సాధించి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచారు. జిల్లా విద్యాశ్ఖాదికారులు  తెలిపిన సమాచారం ప్రకారం 2015-16 విద్యాసంవత్సరానికి గాను జిల్లాలో […]పూర్తి వివరాలు ...

వార్తలు

కె.వి.సత్యనారాయణ జిల్లా కలెక్టర్‌గా భాద్యతలు తీసుకున్నారు

కడప: ఇటీవల కడప జిల్లా కలెక్టర్‌గా నియమితులైన కె.వి.సత్యనారాయణ బదిలీపై వెళుతున్న కలెక్టర్ కె.వి. రమణ నుంచి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్‌ బంగ్లాలో జరిగిన కార్యక్రమంలో సత్యనారాయణ బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ పనిచేసిన కె.వి.రమణ గృహనిర్మాణశాఖ ఎండీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సత్యనారాయణను ప్రభుత్వం కడప జిల్లా కలెక్టరుగా నియమించింది. సత్యనారాయణ స్వస్థలం కృష్ణా జిల్లాలోని గన్నవరం. బాధ్యతలు తీసుకున్న అనంతరం వేద పండితులు కొత్త కలెక్టర్‌ను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందచేశారు. పలువురు అధికారులు, […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం రాయలసీమ

ఓ స్వయం ప్రకటిత మేధావీ…

ఓ స్వయం ప్రకటిత మేధావీ గారు.. చాల్లే చూశాం గానీ… కొన్నేళ్ల క్రితం వరకు మేధావులంటే చాలా అంచనాలుండేవి. మేధావులు ప్రపంచానంతా ఒక యూనిట్ గా చూస్తారని అనుకునే వాడిని. వారికి ప్రాంతాలు, కులాలు, మతాలతో సంబంధం ఉండదనుకునే వాడిని. కానీ ఏపీలో స్వయంప్రకటితులుగా వెలసిన కొందరు మేధావులను చూశాక మేధావుల వెనుక కూడా మర్మాలుంటాయని అర్థమైంది. చలసాని శ్రీనివాసరావు. సమాజం గౌరవించదగ్గ వ్యక్తి. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పగానే జనం కోసం నడుం బిగించారు. […]పూర్తి వివరాలు ...

రాయలసీమ వార్తలు

సీమ సమస్యలపై ప్రశ్నించినందుకు దాడి

ప్రత్యేకహోదా డ్రామా వికటించింది ఒకే రోజులో డ్రామా కట్టేశారు (అనంతపురం నుండి మా విశేష ప్రతినిధి) అనంతపురంలో ప్రత్యేకహోదా పేరుతో నిన్నటి నుండి నిరవధిక దీక్ష చేస్తున్న చలసాని శ్రీనివాస్, ఈ రోజు అక్కడికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన సినిమా నటుడు శివాజీలను సీమ సమస్యలపై ప్రశ్నించిన రాయలసీమ సోషల్ మీడియా ఫోరంకు చెందిన యువకుడిపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనతో నిన్నటి నుండి ప్రత్యేక హోదా పేరుతో చలసాని, శివాజీలు కలిసి రక్తి కట్టిద్దామనుకున్నడ్రామా కాస్తా […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు వార్తలు

కడప జిల్లాలో వరి వద్దు చీనీ సాగే ముద్దు

జిల్లా రైతులకు ముఖ్యమంత్రి పరోక్ష సందేశం కడప:  రైతులు కడప జిల్లాలో వరి సాగు చేయకుండా ఉద్యాన పంటలు పండించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరోక్షంగా సందేశమిచ్చారు. అలాగే కడప జిల్లాను హార్టీకల్చర్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని, అందుకే ఇక్కడి నుంచి ఉద్యాన రైతుల రుణ ఉపశమన పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. స్థానిక పురపాలిక మైదానంలో శనివారం ఉద్యాన రైతుల రుణ ఉపశమన పత్రాలు మరియు చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా […]పూర్తి వివరాలు ...

error: