నిధుల కొరతతో నీరసిస్తున్నయోగి వేమన విశ్వవిద్యాలయం పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం కడప: నగరంలోని యోగి వేమన విశ్వవిద్యాలయంపై నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోంది. ఫలితంగా విశ్వవిద్యాలయ అభివృద్ది కుంటుపడుతోంది. ఈ నేపధ్యంలో యోగివేమన విశ్వవిద్యాలయానికి సంబంధించి సాక్షి దినపత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం కడప.ఇన్ఫో వీక్షకుల కోసం… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14 విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం రూ.383 కోట్లు నిధులు విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లాలోని యోగి వేమన విశ్వవిద్యాలయానికి […]పూర్తి వివరాలు ...
మూడు ప్రాంతాల మధ్య కృష్ణా జలాల పంపకం బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను ఆధారంగా చేసుకుని రాష్ట్రంలోని రాయలసీమ, కోస్తా, తెలంగాణా ప్రాంతాల మధ్య కృష్ణా జలాలను ప్రభుత్వం క్రింది విధంగా పంపిణీ చేసింది. సమాచార హక్కు చట్టం క్రింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సేకరించిన కృష్ణా జలాల పంపకం వివరాలు కడప.ఇన్ఫో వీక్షకుల కోసం… పూర్తి వివరాలు ...
సాగునీళ్ళలో సీమకు జరిగిన మోసమేమిటి? కీ.శే కె శ్రీరామకృష్ణయ్య (శ్రీరామక్రిష్ణయ్య) గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇరిగేషన్ ఇంజనీరుగా పని చేసి పదవీ విరమణ పొందినారు. గుంటూరు జిల్లాలోని రేపల్లె తాలూకాలో భాగమైన బేతపూడికి చెందిన వీరు సివిల్ ఇంజనీరింగ్ పట్టభద్రులు. రాయలసీమకు సంబంధించి సాగునీటి పథకాల ప్రతిపాదనలు తయారు చేయడంలో వీరు పాలు పంచుకున్నారు. వీరి కృషిని గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడప జిల్లాలోని బ్రహ్మంసాగర్ జలాశయం (ఇది తెలుగుగంగ పథకంలో […]పూర్తి వివరాలు ...
కృష్ణా జలాల పంపకంపై మూడు పరీవాహక రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ల మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించి, లభ్యమయ్యే నీటిని పంపకం చేసేందుకు 1969 ఏప్రిల్ 10 న కేంద్ర ప్రభుత్వం బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. జస్టిస్ ఆర్.ఎస్.బచావత్ అధ్యక్షుడిగా ఈ ట్రిబ్యునల్ అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం 1956 కు లోబడి ఏర్పాటయింది. కృష్ణా నదిలో నమ్మకంగా ప్రవహిస్తుందని అంచనా వేసిన 2060 టి.ఎం.సి. నికర జలాలను 1976 లో ట్రిబ్యునల్ కింది విధంగా సాగునీటి […]పూర్తి వివరాలు ...
తెలుగు చిత్రసీమ కీర్తిబావుటాను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయిన తొలినాటి దిగ్గజాలను అందించిన రాయలసీమకు నేడు అదే సినిమాలలో అంతులేని అపఖ్యాతి లభిస్తోంది. సీమ సంస్కృతిపై ఏ మాత్రం అవగాహన లేని రచయితలు, దర్శకులు తోడై ఒక హింసాయుత విధ్వంసకర దృశ్యానికి సీమలోని ఊర్లపేర్లు పెట్టి “రాయలసీమ సంస్కృతి” అంటే ఇదే అనుకునే భ్రమను యావదాంధ్రులకు కలిగిస్తున్నారు. తెలుగులో శబ్దచిత్రాలు ప్రారంభమయ్యాక మల్లీశ్వరి వంటి సినిమాలతో తెలుగు చిత్రసీమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయిన బి.నాగిరెడ్డి, బి.ఎన్.రెడ్డి […]పూర్తి వివరాలు ...
31 రోజులలో 1918 మంది కడప విమానమెక్కినారు మన కడప విమానాశ్రయం నుండి 2015లో 1918 మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించారు. 7 జూన్ 2015న ప్రారంభమైన కడప విమానాశ్రయం నుండి ఆ సంవత్సరం ఎయిర్ పెగాసస్ సంస్థ వారానికి మూడు రోజుల పాటు కడప – బెంగుళూరుల నడుమ విమాన సర్వీసును నడిపింది. 2015లో 31 రోజుల పాటు కడప – బెంగుళూరు విమాన సర్వీసు నడిచింది. 2015 సంవత్సరానికి గాను కడప విమానాశ్రయంలో ప్రయాణీకుల […]పూర్తి వివరాలు ...
రాయచోటి: పాయలోపల్లి (మండలం: చక్రాయపేట, గ్రామ పంచాయతీ: సురభి) సమీపంలోని అటవీ ప్రాంతంలో మూడు చిరుతపులులు సంచరిస్తున్నట్లు ఇటీవల స్థానికులు గుర్తించారు. ఊరి చుట్టూ మామిడి తోటలు అధికంగా ఉండటంతో పాటు, ఊరికి సమీపంలోనే అటవీ ప్రాంతం ఉంది. బుధవారం అడవిలోకి గొర్రెలను తోలుకెల్లిన సమయంలో ఒక చిరుతపులి గొర్రెల మందపై దాడి చేసి ఒక గొర్రెను తినేసిందని కాపరులు చెప్పారు. దీంతో గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. రాయచోటి: పాయలోపల్లి (మండలం: చక్రాయపేట, గ్రామ […]పూర్తి వివరాలు ...
కడప జిల్లా గురించి ఎవరూ ఏమీ అడక్కపోయినా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గత రెండేళ్ళుగా చెప్తూనే వస్తున్నారు. ఆయన ఎప్పుడైనా అలసిపోయి ఊరుకుంటే ఆయన ఏరి కోరి నియమించుకున్న కలెక్టరు కె వెంకటరమణ గారు కడప జిల్లా అంటే “భయం… భయం…” అని అందరికీ నూరిపోస్తూనే ఉన్నారు (కాకతాళీయంగా పదో తరగతి ఫలితాలు విడుదలైన రోజే ఈ జిల్లా కలెక్టరుగా ఆయనకు చివరిరోజు). వీళ్ళ దృష్టిలో ‘రాష్ట్రంలో ఎక్కడ ఏ దుర్ఘటన జరిగినా…మొదటి నిందితులు కడప […]పూర్తి వివరాలు ...
చలసాని, శివాజీలకు బైరెడ్డి హెచ్చరిక అనంతపురం: మేధావిగా చెప్పుకునే చలసాని, సినీనటుడు శివాజి రాయలసీమ పిల్లోల్లపై జరిగిన దాడులపై 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో వాళ్ళ ఇళ్ళ దగ్గర విద్యార్థులు నిరసనలకు దిగుతారని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి హెచ్చరించారు సోమవారం అనంతపురంలో చలసాని, శివాజీల ప్రోద్భలంతో విద్యార్థి సంఘ నాయకులు క్రిష్ణానాయక్, ప్రతాప్‌రెడిలప్డై జరిగిన దాడిని నిరసిస్తూ రాయలసీమకు చెందిన వివిధ సంఘాల నేతృత్వంలో మంగళవారం నగర పాలక సంస్థ […]పూర్తి వివరాలు ...