కడప : అక్టోబరు 30 నుంచి యోవేవి అనుబంధ కళాశాలలలో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం కోర్సులు చదువుతున్న విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 40 వేల మంది విద్యార్థులు సెమిస్టర్ పరీక్షలకు హాజరుకానున్నారు. 30న ప్రారంభమై నవంబరు 21 వరకు సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయి.పూర్తి వివరాలు ...
కడప : వైఎస్సార్ జిల్లాకు కొత్త ఎస్పీగా నియమితులయిన అన్బురాజన్ శుక్రవారం కడపలో విధుల్లో చేరారు. గతంలో జిల్లా ఎస్పీగా పనిచేసిన అభిషేక్ మొహంతి సుదీర్ఘ సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో అన్బురాజన్ ఎస్పీగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాత కేసులను పరిశీలించి వాటి పురోగతిపై దృష్టి పెడతానని పేర్కొన్నారు. నగరంలోని ట్రాఫిక్‌పై దృష్టి సారిస్తానని, సమస్య ఏదైనా నిర్భయంగా తన దగ్గరకు రావచ్చని తెలిపారు. కమాండ్ కంట్రోల్ రూమ్‌లో మరింత మెరుగైన టెక్నాలజీని ఉపయోగించి […]పూర్తి వివరాలు ...
ఇప్పటికి శివతాండవం పదిసార్లైనా ప్రింటు అయివుంటుంది. కానీ నేను ఆర్ధికంగా లాభపడింది మాత్రం చాలా తక్కువ. కారణాలు అనేకాలు. ముఖ్యంగా ఈ రాయలసీమ చీకటి ఖండం. ఈ ప్రాంతాల్లోనే గడ్డకు వచ్చి ఒక పేరు, ప్రతిష్ట సంపాదించుకోవలంటే చాలా కష్టం. సాహిత్యకంగా నా జీవితంలో ఎన్నో కల్లోలాలు ఎదుర్కోవలసివచ్చింది. ఒకసారి గుంటూరికి సాహిత్య మిత్రులు కొందరు నన్నాహ్వానించినారు. నాకు శరీర ఆరోగ్యము కూడా సరిగాలేదు అప్పుడు. ప్రయాణినికి కావలసిన జాగ్రత్తలన్నీ వారే చూచుకున్నారు. రామాయణం పైన నా […]పూర్తి వివరాలు ...
కడప : ముద్దనూరు మండలంలోని చింతకుంట సమీపంలో శుక్రవారం అధికారులు వజ్రాల గని ఏర్పాటుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఊరికి సమీపంలోని కొండ ప్రాంతంలో 45.649 హెక్టార్లలో వజ్రాల ముడి ఖనిజం (క్వార్ట్జ్) గనుల ఏర్పాటుకు షేక్ అల్లాహ్ మహమ్మద్ భక్షి అనే మైనింగ్ వ్యాపారి ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ.. గనులలో స్థానికులకు ఉపాధి కల్పించాలన్నారు. మైనింగ్ కాస్ట్‌లో 2 శాతం ఊరి […]పూర్తి వివరాలు ...
కడప : సీనియర్ జర్నలిస్టు, కడప జిల్లాకు చెందిన దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. శ్రీనాథ్‌రెడ్డి సుదీర్ఘ కాలం 28 సంవత్సరాల పాటు ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలలో సీనియర్ జర్నలిస్టుగా పని చేశారు. 2014 నుంచి సాక్షి పొలిటికల్ సెల్‌కు సలహాదారులుగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీయు డబ్ల్యుజేలో వివిధ హోదాల్లో పని చేశారు. రాయలసీమ ఉద్యమంలో కీలకంగా పని […]పూర్తి వివరాలు ...
కడప జిల్లా విషయంలో విస్మయపరిచే తీరు పుష్కరం కిందట 2007లో ప్రొద్దుటూరికి చెందిన చదువులబాబు అనే రచయిత జిల్లాలోని అన్ని మండలాలూ తిరిగి శ్రమకోర్చి సమాచారం సేకరించి ‘కడప జిల్లా సాహితీ మూర్తులు’ అనే పుస్తకం రాశారు. వేరొకరు ముందుకొచ్చి ఖర్చులు భరించి దాన్ని ప్రచురించారు. బహుశా అదే సమయంలో తెలంగాణకు చెందిన మౌనశ్రీ మల్లిక్ రాసిన ‘కడప జిల్లా చైతన్యమూర్తులు’ అనే పుస్తకం కూడా వచ్చింది. అది ఆంధ్రజ్యోతి అనే పత్రికకు ఎంత భరించరానిదైందంటే ఆ రెంటిని […]పూర్తి వివరాలు ...
భారతీయ సంస్కృతిలో సూర్యారాధనకు ఉన్న ప్రాధాన్యత అమితమైనది. కోణార్క్ లోని సూర్యదేవాలయాన్ని ఇందుకు ప్రతీకగా చెప్పుకుంటాం. మన రాష్ట్రంలో ‘అరసవెల్లి’ సూర్య దేవాలయం కూడా బహుళ ప్రాచుర్యం పొందింది. రాయలసీమలో సైతం సూర్యారాధనకు విశిష్ట ప్రాధాన్యత ఉందని చెప్పడానికి అనేక చోట్ల సూర్య దేవాలయాలు ఉన్నాయి. ‘తిరుచానూరు’లోని సూర్య నారాయణ దేవాలయం,ఉరవకొండ సమీపం లోని ‘బూదగవి’ సూర్యనారాయణ ఆలయం, భక్తుల పూజలను అందుకుంటున్నాయి. కడప జిల్లా ఎర్రగుంట్ల సమీపంలోని “నిడుజువ్వి” లో ఈ సూర్య విగ్రహం ఉంది. […]పూర్తి వివరాలు ...
పుస్తకం : సంవేదన , సంపాదకత్వం: రాచమల్లు రామచంద్రారెడ్డి , ప్రచురణ : యుగసాహితి, అక్టోబర్1968లో ప్రచురితం.పూర్తి వివరాలు ...
కడప జిల్లాకు సంబంధించిన మీ అవగాహన ఎంత ? కడప జిల్లాను గురించి మీ అవగాహన సంపూర్ణమైతే ఈ ప్రశ్నలకు సమాధానాలు పూర్తి చేసి బహుమతులు గెలుచుకోండి.పూర్తి వివరాలు ...