కమలాపురం సమీపం లోని పెద్దచెప్పలి గ్రామంలో వెలసిన పురాతన దేవలాలకు ఎంతో విశిష్టమైన చరిత్ర ఉంది. అగస్త్యేశ్వర ఆలయం ఇక్కడి కామాక్షి సహిత అగస్త్యేశ్వర ఆలయాన్ని క్రీస్తు శకం 6వ శతాబ్దంలో రేనాటి చోళరాజైన పుణ్యకుమారుడు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఆయన పెద్దచెప్పలిని రాజధానిగా చేసుకుని తన రాజ్యాన్ని పాలించాడు. తన శాసనాలన్నింటినీ తెలుగులోనే వాడాడనటానికి అగస్త్యేశ్వరాలయంలోని స్తంభాలకు చెక్కబడిన తెలుగు శాసనాలే నిదర్శనం. ఇక్కడి ఆలయంలోని మూలవిగ్రహాలను అగస్త్యముని ప్రతిష్ఠించినట్లు మాలేపాడు శాసనం ద్వారా తెలుస్తోంది. […]పూర్తి వివరాలు ...
ఆ బువ్వ అంటే తెలుసా మీకు? నా చిన్నప్పటి స్నేహితులు తెలీదు, మా వూరు తెలీదు, అవి ఏవీ తెలీనప్పుడు ఆబువ్వ అంటే ఎట్ట తెలుస్తుందిలెండి? ఆబువ్వ అంటే ఏ బువ్వో కాదండి, ఇప్పుడు మనందరం తింటున్న వరి బియ్యం బువ్వ. అందరం తినే అన్నానికి అంతగా చెప్పాల్నా అనొచ్చు. ఇప్పుడు అందరం తింటున్నాం కాని అప్పుడు మేం తినేవాళ్ళం కాదండి. తినేవాళ్ళం కాదంటే కొవ్వెక్కి తినేవాళ్ళంకాదని కాదు. అప్పుడు మాకు ఆబువ్వ అందుబాటులో వుండేది కాదు, […]పూర్తి వివరాలు ...
పసుపు పచ్చని విషం తెదేపా, ఆ పార్టీ నేతలు, వారికి బాకా ఊదే కరపత్రాలు పదే పదే కడప జిల్లాను, ఇక్కడి సంస్కృతిని, ప్రజలను కించపరుస్తూ వ్యాఖ్యలు చెయ్యటం సర్వ సాధారణమైపోయింది. ఈ నేపథ్యంలో పచ్చ పార్టీకి చెందిన పలువురు నేతలు కడప జిల్లా, రాయలసీమల పైన చేసిన విపరీత వ్యాఖ్య/ఆరోపణలను వీక్షకుల సౌలభ్యం కోసం ఇక్కడ పొందుపరుస్తున్నాం… తేదీ: 03 ఫిబ్రవరి 2023, సందర్భం: మీడియా సమావేశం (అమరావతి) నాయకులు: అచ్చెంనాయుడు [divider style=”normal” top=”10″ […]పూర్తి వివరాలు ...
కడప : పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిధ్ధమయింది. ఏపీకార్ల్‌లో ఈ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడనున్నాయి. సుమారు 50 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేయనున్నారు. డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ పరిశోధనా కేంద్రం పనిచేయనుంది. ఇక్కడ శాస్త్రవేత్తల ద్వారా అరటిలోని అన్నిరకాలపై పరిశోధనలు చేస్తారు. ఈ ప్రాంతంలో సాగుకు అనుకూలమైన రకం ఏది, తెగుళ్లను తట్టుకోవడంతో పాటు […]పూర్తి వివరాలు ...
కడప : జిల్లాకు చెందిన ప్రసిధ్ద రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ‘తానా నవలల పోటీ – 2019’ బహుమతికి ఎంపికైంది. అమెరికా నుంచి, భారత్ నుంచి పోటీకి మొత్తం 58 నవలలు వచ్చాయి. వాటన్నిటిలో సన్నపురెడ్డి నవల ఉత్తమంగా నిలిచి రెండు లక్షల రూపాయిల ‘తానా’ బహుమతి గెలుచుకుంది. తానా నవలల పోటీలో రెండు లక్షల రూపాయల బహుమతిని అందుకుంటున్న తొలి రచనగానూ ఇది నిలిచిపోనుంది. అవార్డుకు అర్హమైన నవలల ఎంపికలో, ప్రముఖ […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాలో ఉన్న అరుదైన ఆలయాలు ఈ అగస్త్యేశ్వరాలయాలు. సరైన ప్రచారానికి నోచుకోకుండా, జనబాహుళ్యంలో ఈ అరుదైన ఆలయాల గురించి చాల తక్కువ మందికి తెలుసు. చరిత్ర ప్రకారంగా చూస్తే, వీటిని రేనాటి చోళుల కాలంలో (క్రీ. శ. 6-9 శతాబ్దాల కాలం) నిర్మించారని శాసనాల ద్వారా తెలుస్తోంది. అగస్త్య మహాముని దక్షిణ భారతదేశ యాత్రలో, తాను బస చేసిన ప్రదేశాలలో శివలింగాలని ప్రతిష్టించారు అని కథనం. అగస్త్య ప్రతిష్టితమైన ఈ శివలింగాలు భారీలింగ రూపంలో, స్థంభములాగా, […]పూర్తి వివరాలు ...
అన్నమయ్య సంకీర్తనలలో ఒంటిమిట్ట కోదండరాముడు ఒంటిమిట్టలోని కోదండరాముడ్ని దర్శించి తరించిన పదకవితా పితామహుడు ఆయన సాహస గాధల్ని (అలౌకిక మహిమల్ని)ఇట్లా కీర్తిస్తున్నాడు … వర్గం: ఆధ్యాత్మ సంకీర్తన రాగము: నాట రేకు: 0096-01 సంపుటము: 1-477 ఇందులోనే కానవద్దా యితఁడు దైవమని విందువలె నొంటిమెట్ట వీరరఘురాముని యెందు చొచ్చె బ్రహ్మవర మిల రావణుతలలు కందువ రాఘవుఁడు ఖండించునాఁడు ముందట జలధి యేమూల చొచ్చెఁ గొండలచే గొందింబడఁ గట్టివేసి కోపగించేనాడు ||ఇందులోనే|| యేడనుండె మహిమలు యిందరి కితఁడు వచ్చి వేడుకతో […]పూర్తి వివరాలు ...
తాళ్ళపాక అన్నమయ్య, అక్క(ల)మ్మల (అక్కమాంబ) సంతానమైన పెదతిరుమలయ్య వాళ్ళ నాయన మాదిరిగానే శ్రీ వేంకటేశ్వరుని సేవలో తరించినాడు. తిమ్మయ్య, తిమ్మార్య, తిరుమలాచార్య, తిమ్మడు, తిరుమలగురుడుగా పేర్కొనబడిన పెదతిరుమలయ్య కూడా దేవుని కడప లక్ష్మీ వల్లభుని దర్శించుకుని తరించినాడు. తన సంకీర్తనలతో కడపరాయని కీర్తించి గానం చేసినాడు. కడపరాయని కీర్తించిన పెదతిరుమలయ్య సంకీర్తనలలో ఇది కూడా ఒకటి. వర్గం: శృంగార సంకీర్తన రాగము: రామక్రియ రేకు: 74-6 సంపుటము: 17-386 ఏమి నీ కింత బలువు యెవ్వ రిచ్చిరి […]పూర్తి వివరాలు ...
కడప : నగర శివారులోని మామిళ్లపల్లి దగ్గర ఏర్పాటు చేసిన నగరవనం సుందరంగా ముస్తాబై జిల్లావాసులకు ఆహ్లాదాన్ని పంచడానికి సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ కడప నగరానికి కూతవేటు దుపంలో మామిళ్లపల్లి వద్ద 428 హెక్టార్లలో రూ.342.78 లక్షల వ్యయంతో నగరవనాన్ని తయారు చేసింది. త్వరలో పర్యాటకులకు అందుబాటులోకి రానున్న కడప నగరవనం విశేషాలు.. ప్రజలకు స్వచ్ఛమైన గాలితో పాటు ఆహ్లాదాన్ని అందించడానికి పాలకొండ రిజర్వు ఫారెస్టు పరిధిలోని మామిళ్లపల్లి ప్రాంతాన్ని నగరవన ఏర్పాటు కోసం అటవీశాఖ ఎంచుకుంది. […]పూర్తి వివరాలు ...