వార్తా విభాగం

సంకీర్తనలు

సామాన్యమా పూర్వ సంగ్రహంబగు ఫలము

॥పల్లవి॥సామాన్యమా పూర్వ సంగ్రహంబగు ఫలమునేమమునఁ బెనగొనియె నేఁడు నీవనక॥చ1॥జగతిఁ బ్రాణులకెల్ల సంసారబంధంబుతగుల బంధించు దురితంపుఁ గర్మమునమగుడ మారుకుమారు మగువ నీవురముపైతెగికట్టి రెవ్వరో దేవుండవనక॥చ2॥పనిలేక జీవులను భవసాగరంబులోమునుఁగ లేవఁగఁ జేయు మోహదోషమునపనిపూని జలధిలోఁబండఁబెట్టిరి నిన్నువెనకెవ్వరో మొదలివేలుపనక॥చ3॥వుండనియ్యక జీవనోపాయమున మమ్ముకొండలను గొబల తతిగొని తిప్పుఫలముకొండలను నెలకొన్న కోనేటిపతివనఁగనుండవలసెను నీకు నోపలేననక రాగము: ధన్నాశి రేకు: 0032-06 సంపుటము: 1-200 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ధన్నాశిపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

సడిబెట్టెఁగటకటా సంసారము చూడ-

॥పల్లవి॥సడిబెట్టెఁగటకటా సంసారము చూడ-జడధి లోపలి యీఁత సంసారము॥చ1॥జమునోరిలో బ్రదుకు సంసారము చూడచమురు దీసిన దివ్వె సంసారముసమయించుఁ బెనుదెవులు సంసారము చూడసమరంబులో నునికి సంసారము॥చ2॥సందిగట్టినతాడు సంసారము చూడసందికంతలతోవ సంసారముచుందురునిజీవనము సంసారము చూడచంద మేవలెనుండు సంసారము॥చ3॥చలువలోపలివేఁడి సంసారము చూడజలపూఁతబంగారు సంసారముయిలలోనఁ దిరువేంకటేశ నీదాసులకుచలువలకుఁ గడుఁజలువ సంసారము రాగము: భైరవి రేకు: 0032-05 సంపుటము: 1-199 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, భైరవిపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఏదైవము శ్రీపాదన్నఖమునఁ బుట్టినగంగ

॥పల్లవి॥ఏదైవము శ్రీపాదన్నఖమునఁ బుట్టినగంగత్రిలోకపావనము చేయను త్రిపథగామిని ఆయను॥చ1॥యేదైవమువురస్థలంబు దనకును మందిరమైన యిందిరమాతయయ్యే యీజగంబుల కెల్లనుయేదైవము‌ అవలోకన మింద్రాదిది విజగణంబులకెల్లప్పుడును సుఖంబు లాపాదించును॥చ2॥యేదైవము దేహవస్తువని అనిమిషులందరుఁ గూడిశ్రీనారాయణ దేవుండని నమ్మి యుండుదురుఆదేవుఁడే సిరుల కనంతవరదుఁడు తిరువేంకట-గిరినాథుఁడుభయ విభూతినాథుఁడే నానాథుఁడు రాగము: గీతం – నాట రేకు: 0016-06 సంపుటము: 1-100 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలుపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు

॥పల్లవి॥తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలుమనసు చంచలబుద్ధి మానీనా॥చ1॥జడ్డుమానవుఁడు చదువఁజదువ నాసవడ్డివారుఁగాక వదలీనాగుడ్డికుక్క సంతకుఁబోయి తిరిగినదుడ్డుపెట్లే కాక దొరకీనా॥చ2॥దేవదూషకుఁడై తిరిగేటివానికిదేవతాంతరము తెలిసీనాశ్రీవేంకటేశ్వరుసేవాపరుఁడుగాకపావనమతియై పరగీనా రాగము: నాట రేకు: 0032-04 సంపుటము: 1-198 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, నాటపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఏణ నయనల చూపులెంత సొబగైయుండు

॥పల్లవి॥ ఏణ నయనల చూపులెంత సొబగైయుండు ప్రాణ సంకటములగు పనులు నట్లుండు ॥చ1॥ ఎడలేని పరితాప మేరీతిఁ దానుండు అడియాస కోరికలు నటువలెనె యుండు కడలేని దుఃఖసంగతి యెట్లుఁ దానుండు అడరు సంసారంబు నట్లనే వుండు ॥చ2॥ చింతా పరంపరలఁ జిత్తమిది యెట్లుండు వంతఁ దొలఁగన మోహవశము నట్లుండు మంతనపుఁ బనులపయి మనసు మరియెట్లుండు కంతుశరమార్గముల గతి యట్లనుండు ॥చ3॥ దేవుఁడొక్కఁడె యనెడి తెలివి దనకెట్లుండు శ్రీవేంకటేశు కృపచేత లట్లుండు భావగోచరమైన పరిణతది యెట్లుండు కైవల్యసౌఖ్య సంగతులు […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

లంకెలూడుటే లాభము యీ-

॥పల్లవి॥లంకెలూడుటే లాభము యీ-కింకరులను నలఁగెడికంటెను॥చ1॥జంపులఁ జంపక సరుగనఁబాసేటి-లంపటమేపో లాభముకంపుమోపుతోఁ గనలి శరీరపు-కొంపలోన వేఁగుట కంటెను॥చ2॥యీవలనావల నేచేటిల యాసల-లావు దిగుటెపో లాభముయేవగింతలకు నిరవగు నరకపు-కోవులఁబడి మునుఁగుటకంటెను॥చ3॥తివిరి వేంకటాధిపుదాసులకృప-లవలేశమెపో లాభముచవులని నోరికి సకలము దిని తినిభవకూపంబులఁ బడుకంటెను రాగము: నాట రేకు: 0032-03 సంపుటము: 1-197 Tags: Annamacharya పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఎంత చేసిన తనకేది తుద

॥పల్లవి॥ఎంత చేసిన తనకేది తుదచింత శ్రీహరిపైఁ జిక్కుటే చాలు॥చ1॥ఎడపక పుణ్యాలెన్ని చేసినాఁగడమే కాకిఁకఁ గడ యేదితడఁబడ హరియే దైవమనుచును మదివిడువక వుండిన వెరవే చాలు॥చ2॥యెన్నితపము లివి యెట్లఁ జేసినాఅన్నువ కధికము కలవేదివన్నెలఁ గలఁగక వనజాక్షునిపైవున్న చిత్తమది వొక్కటే చాలు॥చ3॥యిందరివాదము లెట్ల గెలిచినాకందే గాకిఁక గరిమేదిఇందరినేలిన యీ వేంకటపతిపొందగు మహిమల పొడవే చాలు రాగము: సామంతం రేకు: 0016-04 సంపుటము: 1-98 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, సామంతంపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

మనుజుఁడైపుట్టి మనుజుని సేవించి

॥పల్లవి॥మనుజుఁడైపుట్టి మనుజుని సేవించిఅనుదినమును దుఃఖమందనేలా॥చ1॥జుట్టెఁడు గడుపుకై చొరనిచోట్లు చొచ్చిపట్టెఁడుగూటికై బతిమాలిపుట్టిన చోటికే పొరలి మనసు పెట్టివట్టిలంపటము వదలనేరఁడుగాన॥చ2॥అందరిలోఁ బుట్టి అందరిలోఁ బెరి-గందరి రూపము లటు దానైఅందమైన శ్రీవేంకటాద్రీశు సేవించిఅందరానిపదమందె నటుగాన రాగము: సామంతం రేకు: 0032-02 సంపుటము: 1-196 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, సామంతంపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఎవ్వరెవ్వరివాడో యీ జీవుఁడు చూడ-

॥పల్లవి॥ఎవ్వరెవ్వరివాడో యీ జీవుఁడు చూడ-నెవ్వరికి నేమౌనో యీ జీవుఁడు॥చ1॥ఎందరికిఁ గొడుకుగాఁ డీజీవుఁడు వెనకకెందరికిఁ దోఁబుట్టఁ డీజీవుఁడుయెందరిని భ్రమయించఁ డీజీవుఁడు దుఃఖ-మెందరికిఁ గావింపఁ డీజీవుఁడు॥చ2॥యెక్కడెక్కడఁ దిరుగఁ డీజీవుఁడు వెనక-కెక్కడో తనజన్మ మీ జీవుఁడుయెక్కడి చుట్టము దనకు నీ జీవుఁడు యొప్పు-డెక్కడికి నేఁగునో యీ జీవుఁడు॥చ3॥ఎన్నఁడును జేటులేనీ జీవుఁడు వెనక-కెన్నిదనువులు మోవఁడీ జీవుఁడుయెన్నఁగల తిరువేంకటేశుమాయలఁ దగిలియెన్నిపదవులఁబొందఁ డీజీవుడు రాగము: నాట రేకు: 0016-03 సంపుటము: 1-97 Tags: Annamacharya Keerthanalu, పూర్తి వివరాలు ...

error: