వార్తా విభాగం

సంకీర్తనలు

ఎటువంటిరౌద్రమో యెటువంటికోపమో – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఎటువంటిరౌద్రమో యెటువంటికోపమోతటతట నిరువంక దాఁటీ వీఁడే॥చ1॥తోరంపుఁ బెనుచేతుల మల్లచఱచిదారుణలీలఁ బెదవు లవుడుకఱచికారించి చాణూరుఁ గడుభంగపఱచివీరుఁడై యెముకలు విఱచీ వీఁడే॥చ2॥పిడుగడచినయట్టు పెడచేత నడిచి –పడనీక పురములోపలఁ జొరఁబొడిచితొడిచి చాణూరు నెత్తుక దయవిడిచివడివెట్టి నెత్తురు వడిచీ వీఁడే॥చ3॥బుసకొట్టుచును వూరుపులఁ జెమరించిమసిగాఁగ బెదపెదమల్లుల దంచీ-నెసఁగి శ్రీతిరువేంకటేశుఁడై మించిముసిముసినవ్వుల ముంచీ వీఁడే రాగము: ఆహిరి రేకు: 0034-04 సంపుటము: 1-211 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఇన్నిచేఁతలును దేవుఁడిచ్చినవే – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఇన్నిచేఁతలును దేవుఁడిచ్చినవేవున్నవారియీవులెల్ల నొద్దికయ్యీనాread॥చ1॥తెగనియాపదలకు దేవుఁడే కలఁడుగాకవగలుడుపఁ బరులవస మయ్యీనానొగిలి యితరలకు నోళ్ళుదెరచిననగుఁబాటేకాక మానఁగఁబొయ్యీనా॥చ2॥అగ్గలపుదురితాలు హరియే మానుపుఁగాకబగ్గన నొక్కరు వచ్చి పాపఁబొయ్యేరాతగ్గుముగ్గులైనవేళ తలఁచినవారెల్లసిగ్గుఁబాటేకాక తమ్ముఁ జేరవచ్చేరా॥చ3॥యెట్టు నేసినను వేంకటేశుఁడే నేరుచుఁగాకకట్టఁగడవారెల్లఁ గరుణించేరాయిట్టే యేమడిగిన నీతఁడే యొసఁగుఁగాకవుట్టిపడి యెవ్వరైనా నూరడించేరా రాగము: శంకరాభరణం రేకు: 0034-03 సంపుటము: 1-210 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శంకరాభరణంపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

పాపమెరంగనిబ్రహ్మఁడు యెందుఁ – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥పాపమెరంగనిబ్రహ్మఁడు యెందుఁజూపరానిచోట చూపీనయ్యాread॥చ1॥తనివోక జీవముతలకాయ నంజుడుపనివడి తిని తిన్న బ్రాహ్మఁడుయెనసి యెదిరిఁ దన్ను నెఱఁగక విభుఁడైఘనవంశము మంటఁ గలపీనయ్యా॥చ2॥యెవ్వారు నెఱఁగనియెముకలయింటిలోపవ్వళింపుచునున్న బ్రహ్మఁడుజవ్వనమదమున జడినేటికోమలిఁబువ్వులతోఁటలోఁ బొదిగీనయ్యా॥చ3॥చెలఁగి కన్నెరికము చెడనిపడుచుఁ దెచ్చిపలువేదనలఁబెట్టే బ్రహ్మఁడు,తెలిసి వేంకటాధిపునిదాసుఁడైపులుగు పంజారాన బొదిగీనయ్యా రాగము: మాళవిగౌళ రేకు: 0034-02 సంపుటము: 1-209 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, మాళవిగౌళపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

పోయఁ బోయఁ గాలమెల్ల గాలమెల్ల పూఁట పూఁటకు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥పోయఁ బోయఁ గాలమెల్ల గాలమెల్ల పూఁట పూఁటకురోయనిరోఁతలు చూచి రుచి చూరఁబోయ॥చ1॥తాడిమానెక్కేటివాని తడయక పట్టిపట్టితోడఁదోడ నెందాఁకాఁ దోయవచ్చునుకాడువడ్డ చిత్తమిది కలకాలము నిట్టేఆడికెలకులోనై తనియక పోయ॥చ2॥మన్నుదినియేటిదూడ మానుమంటా మొత్తిమొత్తికన్నిగట్టి యెందాఁకఁ గాయవచ్చునుసన్నపుటాసలమీఁదిచరిఁబడ్డదేహమిదికన్నపుఁగత్తులచూపు కట్టరాకపోయ॥చ3॥హేయము దొక్కకుమన్న యేచి తినేననేవాఁడుచాయకు రాకున్న నేమిసేయవచ్చునుమాయలవేంకటపతి మచ్చుచల్ల నాయాత్మపాయక యాతనిఁజేరి భయమెల్లఁ బోయ రాగము: దేసాక్షి రేకు: 0034-01 సంపుటము: 1-208 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

పటుశిష్టప్రతిపాలకుఁడ వనఁగ – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥పటుశిష్టప్రతిపాలకుఁడ వనఁగఘటన నఖిలమును గాతువుగా॥చ1॥తత్తుమురుగ దైత్యుల దనుజుల నవిమొత్తి మోఁది చలమునఁ జెలగిజొత్తుపాపలుగ సొరిది విరోధుల-నెత్తురు వడుతువు నీవేకా॥చ2॥తళతళమెఱుచుసుదర్శనాయుధం-బలరుచు నొకచే నమరఁగనుబలుదైత్యులదొబ్బలుఁ బేగులు ననినిలువునఁ జెండుదు నీవేకా॥చ3॥దిట్టవు సూత్రవతీపతి వసురలఁజట్టలు చీరఁగఁ జతురుఁడవురట్టడి వేంకటరమణుని వాకిటి-పట్టపు నేనాపతిపటకా రాగము: సాళంగనాట రేకు: 0033-06 సంపుటము: 1-207 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

పోయఁబోయఁ గాలమెల్ల పూఁటవూఁటకు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥పోయఁబోయఁ గాలమెల్ల పూఁటవూఁటకుచేయి నోరు నోడాయ చెల్లఁబో యీరోఁతలు॥చ1॥తిప్పన తొప్పన కేతు దేవన బావన గనున్నపప్పన బొప్పనగారి బాడిపాడికుప్పలుఁదెప్పలు నైనకోరికెలు మతిలోనయెప్పుడుఁ బాయకపోయ నెన్ని లేవు రోఁతలు॥చ2॥కాచన పోచన మాచు కల్లప బొల్లప మల్లుబాచన దేచనగారిఁ బాడిపాడియేచినపరసుఖము నిహమును లేకపోయచీచీ విరిగితిమి చెప్పనేల రోఁతలు॥చ3॥బుక్కన తిక్కన చెల్లు బూమన కామన పేరి-బక్కల నిందరి నోరఁ బాడిపాడియెక్కువైన తిరువేంకటేశునిఁ దలఁచలేకకుక్కకాటుఁ జెప్పుటాటై కూడె నిన్ని రోఁతలు రాగము: సామంతం రేకు: 0033-05 సంపుటము: 1-206 Tags: Annamacharya Keerthanalu, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

చాలదా హరిసంకీర్తనంగల- – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥చాలదా హరిసంకీర్తనంగల-మే లిది దీననే మెరసిరి ఘనులు॥చ1॥తలఁప వేదాశాస్త్రములు గానకఅలరుచు వాల్మీకాదులుతలకొని హరిమంత్రమే దగఁ బేర్కొనిఅలవిమీరఁ గడు నధికములైరి॥చ2॥యితరదైవముల నెఱఁగనేరకప్రతిలేనిమహిమఁ బార్వతిమతిఁ దలఁపుచు హరిమంత్రమె పేర్కొనిసతతము హరులో సగమై నిలిచె॥చ3॥చదువులుఁ బలుమరుఁ జదువనోపకఅదివో నారదాదులుపదిలపువేంకటపతిహరినామమేవదల కిదియ జీవనమై మనిరి రాగము: సామంతం రేకు: 0033-04 సంపుటము: 1-205 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతంపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఎంతమానుమన్నఁ జింతలేల మానునే – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఎంతమానుమన్నఁ జింతలేల మానునేపంతపుమనసు హరిపై నుంటేఁగాకread॥చ1॥తీరని బంధాలు నేఁడే తెగుమంటే నేల తెగుభారపుమమతఁ బెడఁబాసినఁగాకవూరటగా మమత నేనొల్లనంటే నేల మానువోరువుతో లంపటము లొల్లకుంటేఁగాక॥చ2॥వేఁకపుఁగోపము నేఁడే విడుమంటే నేల విడుతోఁకచిచ్చయినయాసఁ దుంచినఁగాకఆఁకట నానేల మాను అన్నిటాను యిందరికిమాఁకుపడి తత్తరము మఱచుంటేఁగాక॥చ3॥పెట్టనిది దైవ మిట్టే పెట్టుమంటే నేల పెట్టుయిట్టే వేంకటపతి యిచ్చినఁగాకయిట్టునట్టు నీతఁడు దా నిందరికి నేల యిచ్చువొట్టినవిరక్తి నేమి నొల్లకుంటేఁగాక రాగము: ముఖారి రేకు: 0033-03 సంపుటము: 1-204 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

పసలేని యీబ్రదుకు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥పసలేని యీబ్రదుకుఅసలు చొచ్చి చొచ్చి అలసినట్టాయెread॥చ1॥తొల్లిటిజన్మాదులఁ గానినరరూపుపల్లించుకొన్న యీబ్రదుకుకల్లసుఖములచే కనలి కమ్మరముల్లుదీసి కొఱ్ఱు మొత్తినట్టాయ॥చ2॥బూటకములనెల్లఁ బొరలి సంసారంపు-పాటు దెచ్చినయీబ్రదుకునీటుగ నెద్దు దన్నీనని గుఱ్ఱము –చాటు కేఁగినయట్టిచందమాయె॥చ3॥పగగొన్న పొగ కోపక మంటఁ బడిపడిపగలు రేలైనయీబ్రదుకుతగువేంకటేశ్వరుఁ దలఁచి నేల నుండియెగసి మేడమీఁది కేఁగినట్లాయె రాగము: ముఖారి రేకు: 0033-02 సంపుటము: 1-203 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic పూర్తి వివరాలు ...

error: