వార్తా విభాగం

సంకీర్తనలు

ఏడ వలపేడ మచ్చిక ఏడ సుద్దులు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఏడ వలపేడ మచ్చిక ఏడ సుద్దులుఆడుకొన్న మాటలెల్లా నవి నిజాలా॥చ1॥తొలుకారు మెఱుపులు తోచి పోవుఁగాకనెలకొని మింట నవి నిలిచీనాపొలఁతుల వలపులు పొలసిపోవుఁగాకకలకాలం బవి కడతేరీనా॥చ2॥యెండమావులు చూడ నేరులై పారుఁగాకఅండకుఁబోవ దాహ మణఁగీనానిండినట్టి మోహము నెలఁతల మదిఁ జూడవుండినట్టేవుండుఁగాక వూఁతయ్యీనా॥చ3॥కలలోనిసిరులెల్ల కనుకూర్కులేకాకమెలఁకువఁ జూడ నవి మెరసీనాఅలివేణులమేలు ఆసపాటేకాకతలఁపు వేంకటపతిఁ దగిలీనా రాగము: పాడి రేకు: 0036-01 సంపుటము: 1-220 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

హరినెఱఁగనిపుణ్య మంటేరుగాన – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥హరినెఱఁగనిపుణ్య మంటేరుగానదురితాలే దురితాలే దురితాలే సుండీread॥చ1॥దొడ్డపుణ్యములు సేసి తుదలేనిసంపదలుఅడ్డగించుకొని రాసులగుగురుతుజడ్డులేనిహారికధ చవిలేకుండిన నిట్టేగొడ్డేరే గొడ్డేరే గొడ్డేరే సుండీ॥చ2॥వలేనని మేలేల్ల వడిఁజేసి కైవల్య-మలమి చేతికిలోననగు గురుతుతలఁపు వైష్ణవభక్తిఁ దగులకుండిన నంతాఅలయికే అలయికే అలయికే సుండీ॥చ3॥తిరమైన తీర్ధాలు దిరిగి యందరిలోనధరఁ బుణ్యఁడవుట యంతకు గురుతుతిరువేంకటపతిఁ దెలియకుండిన నంతావిరసాలే విరసాలే విరసాలే సుండీ రాగము: ఆహిరి రేకు: 0035-06 సంపుటము: 1-219 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఏమి గలిగెను మా కిందువలన – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఏమి గలిగెను మా కిందువలనవేమారుఁ బొరలితిమి వెఱ్ఱిగొన్నట్లు॥చ1॥తటతటన నీటిమీఁదట నాలజాలంబు-లిటునటుఁ జరించవా యీఁది యీఁదిఅటువలెనెపో తమకమంది సంసారంపు-ఘటనకై తిరిగితిమి కడ గానలేక॥చ2॥దట్టముగఁ బారావతముల మిన్నుల మోవకొట్టఁగొన కెక్కవా కూడి కూడివట్టియాసలనే యిటువలెనేపో యిన్నాళ్ళుబట్ట బయ లీఁదితిమి పనిలేనిపాట॥చ3॥బెరసి కుమ్మరపురువు పేఁడలోపలనెల్లపొరలదా పలుమారుఁ బోయిపోయివరుస జన్మముల నటువలెనె పొరలితిమితిరువేంకటాచలాధిపుఁ దలఁచలేక రాగము: ఆహిరి రేకు: 0035-05 సంపుటము: 1-218 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

వెరపులు నొరపులు వృధా వృధా – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥వెరపులు నొరపులు వృధా వృధాధరపై మరయంతయును వృధా॥చ1॥తడయక చేసినదానంబులు వృథయెడనెడ నెఱిఁగిన యెఱుక వృథావొడలిలోనిహరి నొనరఁగ మతిలోఁదడవనిజీవమె తనకు వృథా॥చ2॥జగమునఁ బడిసినసంతానము వృథతగిలి గడించినధనము వృథజగదేకవిభుని సకలాత్ముని హరిఁదెగి కొలువనిబుద్దియును వృధా॥చ3॥పనివడికూడిన పరిణామము వృథవొనరఁగనుందినవునికి వృథాఘనుఁడుగు తిరువేంకటగిరి హరిఁగనిమననేరని జన్మములు వృథా రాగము: ముఖారి రేకు: 0035-04 సంపుటము: 1-217 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ముఖారిపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

వేదనఁ బొరలే వెరవేలా – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥వేదనఁ బొరలే వెరవేలాయీదయ విధి దన కీయదాread॥చ1॥తత్తరపాట్ల తనువికారములఁజిత్తము దెంచే చెలువేలాబత్తితో దాఁచిన పరధనంబుంగొనిసత్తయి వుండుట చాలదా॥చ2॥యెక్కువతమకపుటింతులఁ బొందకపక్కుచువాడేవయసేలామొక్కుచు దాఁచిన మూలధనము గన-నెక్కువ దైవం బియ్యదా॥చ3॥సేఁతలఁ బొరలెడి చిక్కులఁ గెరలెడి-.రోఁతల యీనేరుపులేలాబాఁతిగ వేంకటపతిరతిఁ జిత్తపు-టూఁతలఁ గోరిక లూనవా రాగము: శ్రీరాగం రేకు: 0035-03 సంపుటము: 1-216 Tags: Annamacharya Keerthanalu, Telugu పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఇందునందుఁ దిరుగుచు నెవ్వరివాఁడవుగాక – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఇందునందుఁ దిరుగుచు నెవ్వరివాఁడవుగాకబందెపసురమవైతి బాపు జీవుఁడా॥చ1॥తోలుబొక్కలోనఁ జొచ్చి తూలేటిఁయాకలిచేతపాలుమాలి యిందరికి బంటుబంటవైయేలినవానిఁ గానక యేచినయాసల వెంటకూలికిఁబో దొరకొంటి కూళజీవుఁడా॥చ2॥తీఁటమేనిలోనఁ జొచ్చి దిమ్మరిదొంగలచేతమూఁటగట్టించుక నీవు మూలదొరవైగాఁటపువిభునిచేతిఘనత కోరికలకువేఁటకుక్కవైతివి వెఱ్ఱిజీవుఁడా॥చ3॥చీమలింటిలోనఁ జొచ్చి చిక్కువడి అందరిలోదోమకరకుట్లకు తోడిదొంగవైయేమరి వేంకటవిభు నెఱఁగక జాడుఁజొప్పనాము మేయ దొరకొంటి నాలిజీవుఁడా రాగము: ఆహిరి రేకు: 0035-02 సంపుటము: 1-215 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ఆహిరిపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఎండగాని నీడగాని యేమైనఁగాని – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఎండగాని నీడగాని యేమైనఁగానికొండలరాయఁడే మా కుల దైవము॥చ1॥తేలుగాని పాముగాని దేవపట్టయినఁగానిగాలిగాని ధూళిగాని కాని యేమైనాకాలకూటవిషమైన గక్కున మింగిన నాటినీలవర్ణుఁడే మానిజ దైవము॥చ2॥చీమగాని దోమ గాని చెలఁది యేమైనఁగానిగాముగాని నాముగాని కాని యేమైనాపాములన్నిమింగే బలుతేజిపైనున్నధూమకేతువే మాకు దొర దైవము॥చ3॥పిల్లిగాని నల్లిగాని పిన్న యెలుకైనఁగానికల్లగాని పొల్లగాని కాని యేమైనాబల్లిదుఁడై వేంకటాద్రిపైనున్నయాతఁడే మ-మ్మెల్లకాలమును నేలేయింటి దైవము రాగము: బౌళి రేకు: 0035-01 సంపుటము: 1-214 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

తన కర్మమెంత చేఁతయు నంతే – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥తన కర్మమెంత చేఁతయు నంతేగొనకొన్న పనియంత కూలీనంతే॥చ1॥తలఁపులో హరి నెంత దలఁచె నేఁడే వానికలిమియు సుఖమును గల దంతేతులఁదూఁచఁ బైఁడెంత తూఁకము నంతేనెలకొన్నపిండెంత నిప్పటీ నంతే॥చ2॥సిరివరుపూజెంత సేసె నేఁడే వాని-దరియును దాపు నెంతయు నంతేపురిగొన్న యీవెంత పొగడూ నంతేనరపతిచనవెంత నగవూ నంతే॥చ3॥శ్రీవేంకటపతి చింత యంత నేఁడేభావపరవశము పలుకూ నంతేదైవము కృప యంత తానూ నంతేయేవంక జయమెంత యిరవూ నంతే రాగము: సాళంగం రేకు: 0034-06 సంపుటము: 1-213 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఆసమీఁద విసుపౌ దాఁక యీ – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఆసమీఁద విసుపౌ దాఁక యీగాసిఁ బరచుతన కపటమే సుఖము॥చ1॥తిరమగుఁ కర్మము దెగుదాఁక తన-గరిమ సుఖము పొగడునందాఁకపరమార్గం బగపడుదాఁక తన-పరితాపపు లంపటమే సుఖము॥చ2॥కాయము గడపల గనుదాఁక యీమాయ దన్ను వెడమరుదాఁకరాయడి మదము గరఁగుదాఁక యీ-రోయఁదగిన తనరూపమే సుఖము॥చ3॥లంకెలఁ బొరలి నలఁగుదాఁక యీయంకెల భవము లెరవౌదాఁకవేంకటపతిఁ దడవిన దాఁక యీకింకురువాణపు గెలుపే సుఖము రాగము: ఆహిరి రేకు: 0034-05 సంపుటము: 1-212 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, [&పూర్తి వివరాలు ...

error: