వార్తా విభాగం

కథలు సాహిత్యం

దాపుడు కోక (కథ) – డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి

చెన్నమ్మ నాగరిక నాయిక కాదు. కాబట్టి ఆమె ఆర్తనాదంలో విపంచీ కలస్వరాలు పలకలేదు. బస్సు యింజను రొదలో ప్రయాణీకుల రణగొణ ధ్వనుల్లో, చెన్నమ్మ గోడు ఎవరికీ అర్థం కాలేదు. కాని చెన్నమ్మ వులికిపాటు చూసి కొందరు గొల్లుమన్నారు. చెన్నమ్మ తీరు తెన్నుల్లో కొందరు సెక్సును చూస్తున్నారు, కండక్టరు ద్రోణుడు సృష్టించిన పద్మ వ్యూహంలో చిక్కుకుని వొక మూల నలిగిపోతున్న వీరయ్య, ఆ అరిచింది తన కూతురని గుర్తించాడు.పూర్తి వివరాలు ...

పర్యాటకం వ్యాసాలు

‘ఏముండయన్నా కడపలో’? : కడప పర్యటన – 1

(విజయభాస్కర్ తవ్వా ) “టీం ఔటింగ్ ఎప్పుడు?” జట్టు సమావేశమైన ప్రతీసారి ఆనంద్ తెచ్చే ప్రస్తావన… ‘ఎన్నో రోజుల నుండి ప్రయత్నించి విఫలమైనా ఈ సారి జట్టుగా ఔటింగ్ కు వెళ్ళాలి. బాగా ప్లాన్ చెయ్యాలి.’ ఆనంద్ ఊటీ పేరు ప్రతిపాదిస్తే, శ్వేత కేరళ అంది. ప్రతీ మంగళవారం జరిగే జట్టు సమావేశంలో ఈ సారి నేనే ప్రస్తావన తెచ్చాను – ‘టీం ఔటింగ్ కి ఎక్కడి వెళ్దాం?’ అని. “ఏదైనా సరే నేను రెడీ – […]పూర్తి వివరాలు ...

వార్తలు

నేడు ఒంటిమిట్ట సీతారాముల పెళ్లి ఉత్సవం

ఒంటిమిట్ట: కౌసల్య దశరథమహారాజు తనయుడు శ్రీరామచంద్రమూర్తికి జనక మహారాజు తనయ సీతామహాదేవితో స్వస్తిశ్రీ శ్రీనందననామ సంవత్సర ఉత్తరాయణే, వసంత రతువే, చైత్రమాసే చతుర్ధశి గురువారం సరియగు 5వ తేదీ రాత్రి 10 గంటలకు కల్యాణం జరుగులాగున దేవదేవులు నిర్ణయించారు. అత్యంత వైభవంగా, కనుల పండువగా నిర్వహించనున్న శ్రీరామచంద్రమూర్తి కల్యాణోత్సవానికి వీక్షించి, పులకించ మనవి.పూర్తి వివరాలు ...

ఆలయాలు పర్యాటకం

అపర అయోధ్య.. ఒంటిమిట్ట

అపర అయోధ్యగా కొనియాడబడుతున్న ఏకశిలానగరం ఒంటిమిట్ట క్షేత్రానికి సంబంధించి పురాణ, చారిత్రక విశేషాలున్నాయి. బహుళ ప్రచారంలో ఉన్న కథనాల కన్నా మరింత ఆసక్తిదాయకమైన విశేషాలు కూడా ఉన్నాయి. శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాల సందర్భంగా కొన్ని విశేషాలు … ఒంటిమిట్టలో మాత్రమే… రాత్రిపూట కల్యాణం సాధారణంగా అన్ని దేవాలయాల్లోనూ దేవతామూర్తుల కల్యాణోత్సవాలను పగలు మాత్రమే నిర్వహిస్తారు. కానీ కేవలం ఒంటిమిట్ట క్షేత్రం లో మాత్రమే రాత్రి 11 గంటల తర్వాత నిర్వహిస్తారు. దీనికో పురాణగాథ ఉందని పరిశోధకులు చెబుతున్నారు. […]పూర్తి వివరాలు ...

ప్రసిద్ధులు వ్యాసాలు

సాహితీలోకానికి ఘన కీర్తి పద్మశ్రీ పుట్టపర్తి

‘ఏమానందము భూమీతలమున  శివతాండవమట.. శివలాస్యంబట! వచ్చిరొయేమో వియచ్ఛరకాంతలు జలదాంగనలై విలోకించుటకు ఓహోహోహో..  ఊహాతీతము ఈయానందము ఇలాతలంబున..!’  సరస్వతీపుత్ర పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు ప్రొద్దుటూరు అగస్తేశ్వరస్వామి ఆలయంలో 18 రోజుల్లో రాసిన ‘శివతాండవంలోనివి ఈ పంక్తులు’. సంగీతం, సాహిత్యం మిళితమై నాట్యానికనుగుణంగా ఉన్న ఈ రచన ఆయనకు అనంత కీర్తి ప్రతిష్టలను ఆర్జించి పెట్టింది.పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

మార్చి 17వతేదీవరకు కడపలో టెలీసీరియల్‌ చిత్రీకరణ

కడప :  ఆహ్వానం టెలీ సీరియల్‌కు సంబంధించి ఈనెల 17వతేదీవరకు కడప నగరంలోని వివిధ ప్రాంతాల్లో చిత్రీకరణ చేయనున్నారు. ప్రారంభ సన్నివేశాలను శనివారం దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరాలయంలో సినీనటుడు మురళీమోహన్‌పై చిత్రీకరించారు. ప్రార్థనా సన్నివేశాన్ని శ్రీవారి పాద మండపం వద్ద చేశారు. సీరియల్‌లో కథానాయకి నవ్యశ్రీ, శ్రీరామ్‌ తదితరులపై కొన్ని సన్నివేశాలను దర్శకుడు చిరంజీవి చిత్రీకరించారు. రమా ఫిలిమ్స్‌ బ్యానర్‌పై 10ఎపిసోడ్ల టెలిఫిలిం నిర్మిస్తున్నామని నిర్మాత మోపూరి వెంకటసుధాకర్‌ తెలిపారు. మురళీమోహన్‌ను చూడడానికి ప్రజలు ఆసక్తి చూపారు. […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

జూన్ ఆఖరుకు కడప విమానాశ్రయం సిద్ధం

విమాన సర్వీసులను నడిపేందుకు దరఖాస్తు చేసుకున్న పలు విమానయాన సంస్థలు ఆగస్టు 15 నుంచి సర్వీసుల ప్రారంభం? కడప: మీరు కడప నుంచి తిరుపతికి విమానంలో వెళ్లాలనుకుంటున్నారా? అయితే మరో నాలుగు నెలలు ఆగండి. తిరుపతికే కాదు… కడప నుంచి హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, బెంగళూరు, చెన్నైతో పాటు ముంబయి, న్యూఢిల్లీలాంటి మహానగరాలకూ వెళ్చొచ్చు. కడపలో కొత్తగా నిర్మించబోయే ఏయిర్‌పోర్టు పనులు చివరి దశలో ఉన్నాయి. జూన్ చివరికల్లా విమానాల రాకపోకలకు ‘కడప ఏయిర్‌పోర్టు’ సిద్ధంగా ఉంటుంది.పూర్తి వివరాలు ...

కైఫియత్తులు ప్రత్యేక వార్తలు

భక్త కన్నప్పది మన కడప జిల్లా

భక్త కన్నప్ప కడప (వైఎస్సార్) జిల్లా వాడే. కైఫీయతుల్లో ఇందుకు స్పష్టమైన ఆధారం ఉందని ఘంటాపథంగా చెబుతున్నారు. దీంతో కన్నప్ప కర్నాటకవాడనీ, తమిళుడని, ఆ ప్రాంతాల వారు చేసిన వాదనలో నిజం లేదని స్పష్టమైంది. కన్నప్ప వైఎస్సార్ జిల్లావాడేననడానికి రుజువుగా ఆయన ప్రతిష్టించిన శివలింగం రాజంపేట మండలం ఊటుకూరులో నేటికీ ఉందని పండిత పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.పూర్తి వివరాలు ...

వార్తలు

నేటి నుంచి దేవుని కడప బ్రహ్మోత్సవాలు

కడప: జిల్లాలో అత్యంత ప్రాచీనమైన పుణ్యక్షేత్రం దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయం. తిరుమలకు తొలి గడపగా పేరున్న ఈ క్షేత్రంలో యేటా జరిగే తిరుణాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు. కడప రాయునిగా, వెంకటాద్రి కడప రాయనిగా, కప్పురపు నవ్వుల కడప రాయనిగా భక్తుల పూజలందుకుంటున్న ఈ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పాడ్యమి నుంచి సప్తమి వరకూ నిర్వహిస్తారు. రథసప్తమి నాడు జరిగే రథోత్సవం ‘దేవునికడప’ తిరుణాలగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.పూర్తి వివరాలు ...

error: