ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా కడప జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ ఆసక్తికరమైన విషయం చెప్పారు. తన తండ్రి అమరనాధరెడ్డి రాజకీయాలలో వై.ఎస్. రాజశేఖరరెడ్డి కన్నా సీనియర్ అని , వై.ఎస్.తండ్రి రాజారెడ్డి ఒకసారి జైలులో ఉంటే అమరనాధరెడ్డి విడిపించారని కిరణ్ చెప్పడం విశేషం.ఉపఎన్నికల ప్రచారంలో ఈ విషయం చెప్పడం ద్వారా కిరణ్ వైఎస్ కుటుంబం కంటే తమ కుటుంబం గొప్ప అని చెప్పదలుచుకున్నారా! లేక వ్యూహాత్మకంగా వైఎస్ కుటుంబానికి నేరచరిత్ర ఉందని చెప్పదలుచుకున్నారా!పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు అటవీశాఖ డివిజన్ పరిధిలో ఏడు చోట్ల చిరుతపులి పాదాల గుర్తులను సేకరించినట్లు అటవీశాఖాధికారులు పేర్కొన్నారు. ప్రొద్దుటూరు రేంజిలో 10,264.07 హెక్టార్లు, బద్వేలు రేంజిలో 9,786 హెక్టార్లలో లంకమల అభయారణ్యం విస్తరించి ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈనెల 2-8 వరకు లంకమలలో వన్యప్రాణులు, వన్యమృగాల సంచారం, సంతతిపై అటవీశాఖాధికారులు క్ష్రేతస్థాయిలో సర్వే చేశారు. బద్వేలు రేంజి పరిధిలోని బాలాయపల్లె బీటులో సాకుడుచెల ప్రాంతంలో నాలుగు చిరుతలు సంచరించినట్లు గుర్తించారు. అదేవిధంగా బట్టమానుచెల, ముల్లెద్దుచెల ప్రాంతాల్లో వీటి […]పూర్తి వివరాలు ...
అనంతపురం: ఏదో ఒక రోజు సిబిఐ ఇలా చేస్తుందని ముందే ఊహించామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన మాట్లాడుతూ సాక్షికి సంబంధించిన సంస్థల బ్యాంకు ఖాతాలను నిలిపివేయడాన్ని ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనన్నారు. ఇటువంటి అప్రజాస్వామిక చర్యలతో సాక్షి మీడియాను నిరోధించలేరన్నారు.పూర్తి వివరాలు ...
ఉపఎన్నికలు సమీపిస్తున్న కీలక తరుణంలో సాక్షి టివీ, సాక్షి పత్రికల భ్యాంకు ఖాతాలను సిబిఐ స్థంభింపచేసింది. ఇది కుట్రపూరితం అని, ప్రజాస్యామ్యంపై దాడి అని కంపెనీ అధినేత, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్ తీవ్రంగా ఖండించారు. అయితే అధికార కాంగ్రెస్, విపక్ష తెదేపాలు సిబిఐ చర్యను సమర్థించడం విశేషం. జగన్ ఇప్పటికే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సాక్షి మేనేజింగ్ ఎడిటర్ దిలీప్ రెడ్డి ఉద్యోగులు అధైర్యపడవద్దని అన్నారు.పూర్తి వివరాలు ...
సుందరమ్మకంతా కలలో ఉన్నట్లుంది. పెండ్లంటే మేళతాళాలూ, పెద్దల హడావుడీ, పిల్లల కోలాహలం, మొదలైనవన్నీ వుంటాయనే ఆమె మొదట భయపడింది. మూడేండ్లనాడు తన మొదటి పెండ్లి ఆ విధంగానే జరిగింది. ఈ రెండవ పెండ్లి యే ఆర్భాటమూ లేకుండా కొద్దిమంది ఆత్మీయుల సమక్షంలో నవనాగరిక పద్ధతిలో జరుగుతుందని వారం రోజులనాడు తెలిసినప్పుడు ఆమె కెంతో మనశ్శాంతి కలిగింది. పెండ్లి ఐన సంవత్సరానికే వైధవ్యభారం నెత్తిన వేసుకొని పుట్టినిల్లు జేరిన తాను తిరిగి పెండ్లికూతురు వేషం ధరించాలంటే ఆమె చాలా […]పూర్తి వివరాలు ...
కడప : జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు సివిల్ సర్వీస్ ఎంపిక ఫలితాల్లో తమ సత్తా చాటారు. వీరు జాతీయస్థాయి సివిల్ సర్వీస్ ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించి మెరిశారు. జిల్లాకు చెందిన అన్నం మల్లికార్జునయాదవ్ 20వ ర్యాంకును, ఎంసీవీ మహేశ్వరరెడ్డి 196వ ర్యాంకు సాధించారు. వీరివురు వైద్యవృత్తి ద్వారా సేవ చేస్తూ సివిల్ సర్వీసును ఎంచుకోవడం విశేషం. వీరు అన్నం మల్లికార్జునయాదవ్‌ది చింతకొమ్మదిన్నె మండలం నరసరామయ్యగారిపల్లె కాగా ఎంసీవీ మహేశ్వరరెడ్డిది ఖాజీపేట మండలం భూమాయపల్లె.పూర్తి వివరాలు ...
గండికోట, బ్రహ్మం సాగర్, తాళ్ళపాక, పెద్ద దర్గా … అని చెప్పేశాక అమర్ అన్నాడు ‘నేచర్ టూర్ లాగా ప్లాన్ చేద్దాం, గుళ్ళూ గోపురాలూ కాకుండా…’ అని. వెంటనే ఒక రూట్ మ్యాపు తయారుచేశాం. దానిని జట్టు సభ్యులకు పంపించాం. ‘కడపలో ఏముంది?’ అన్న ఆనంద్ ప్రశ్నను చాలా మంది మళ్ళీ మళ్ళీ అడిగారు. “రండి, వచ్చి చూడండి… తర్వాత మాట్లాడదాం” అని సరిపుచ్చాను. తేదీల ఖరారులో తఖరారు లేకుండా చెయ్యాలని జూలైలో మూడు తేదీలను ఎంపిక […]పూర్తి వివరాలు ...
”కేబుల్‌టీవీలు, గ్రాఫిక్‌సినిమాలతో హోరెత్తిపోతున్న ఈ కాలంలో ఇంకా బొమ్మలాటలు ఎవరు జూచ్చారు? మీకు ఎర్రిగాని… ఊళ్ళోకి వచ్చినందుకు అంతో ఇంతో లెక్క అడుక్కోని దోవ బట్టుకోని పోర్రి… ఎందుకింత సెమ!” నిన్నరాత్రి పొరుగూర్లో గ్రామపెద్దలు అన్నమాటలు, రోడ్డు గతుకుల్లా బండిలోని వెంకటరావును కుదిపివేస్తున్నాయి. ఆ రాత్రికి ఆ వూర్లోనే గడిపి, ఆటాడకుండా తెల్లవారుజామున్నే బృందాన్ని తట్టిలేపి, బండ్లు కట్టించి, చక్రాలపల్లెకు దారిపట్టించినాడు వెంకటరావు. చక్రాలపల్లె సమీపిస్తున్నకొద్దీ వెంకటరావులో తల్లి ఒడిలోకి చేరుకుంటున్న ఆనందం చోటు చేసుకోసాగింది. ఎనిమిదేళ్ళ […]పూర్తి వివరాలు ...
కడప: వేముల మండలం తుమ్మలపల్లెలో నిర్మించిన యురేనియం శుద్ధి కర్మాగారాన్నిభారత అణుశక్తి సంఘం చైర్మన్ శ్రీకుమార్ బెనర్జీ శుక్రవారం ప్రారంభించారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఆల్కైన్ లీచింగ్ పద్ధతిలో దేశంలోనే మొదటిసారిగా వైఎస్సార్ జిల్లాలో యురేనియం శుద్ధి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము చేపట్టిన ప్రత్యేక చర్యల ఫలితంగా ఇక్కడ రేడియేషన్ ప్రభావం ఉండదని, పర్యావరణానికి ముప్పు వాటిల్లదని ఆయన పేర్కొన్నారు.పూర్తి వివరాలు ...