కడప : కమలాపురం ఎమ్మెల్యే గతాన్ని గుర్తు చేసుకుని విమర్శలు చేయాలని కడప, కమలాపురం ప్రాంతాల జగన్ వర్గనాయకులు హెచ్చరించారు. 2009 ఎన్నికల్లో మేయర్ రవీంద్రనాథరెడ్డి వచ్చేంత వరకు నామినేషన్ వేయలేని వీరశివా ఇప్పుడు తేల్చుకుందాం అంటూ ప్రగల్భాలు పలుకుతావా అంటూ ప్రశ్నించారు. కడపలో కాదు.. కమలాపురం నియోజకవర్గంలో గీత గీస్తే తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని వారు సవాల్ విసిరారు. వాహనాల కుంభకోణంలో పోలీసుల దాడిని తట్టుకోలేక ఆళ్లగడ్డ ఫామ్‌హౌస్‌లో దాక్కున్న ఘనత వీరశివారెడ్డికే దక్కుతుందన్నారు.పూర్తి వివరాలు ...
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ స్థానాలకు మరో రెండు రోజుల్లో ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అసోం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను సీఈసీ ఈరోజు విడుదల చేసింది.పూర్తి వివరాలు ...
కడప : ‘ఏమీ చేయలేని అమాయకుల మీద కాదు ప్రతాపం చూపేది. దమ్ముంటే నా మీదకు రా? కడప నడిబొడ్డున తగుల్దాం.. ఎప్పుడైనా సరే. సవాల్ చేస్తున్నా..’ అంటూ కమలాపురం శాసనసభ్యుడు వీరశివారెడ్డి ఆగ్రహంతో మాజీ మేయరు రవీంద్రనాథ్‌రెడ్డికి సవాల్ విసిరారు. సోమవారం ఇందిరా భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం జరిగిన కిడ్నాప్ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ వీరశివ సహనం కోల్పోయారు. మాజీ మేయరుపై విరుచుకుపడ్డారు. ‘రవీంద్రనాథ్‌రెడ్డి’ పేరు ఉచ్చరించేందుకుపూర్తి వివరాలు ...
కడప : కడప నగరంలోని అమీన్‌పీర్ (పెద్ద) దర్గాను ప్రముఖ సినీ నటుడు బ్రహ్మాజీ ఆదివారం దర్శించి ప్రార్థనలు చేశారు. దర్గా మహిమ గురించి మిత్రులు శంకర్, ఉత్తేజ్ తదితరులు తనకు చెప్పడంతో పాటు రెహమాన్ తరచు ఇక్కడికి రావడం తెలిసి రెండేళ్లుగా తాను రావాలని అనుకుంటున్నట్లు బ్రహ్మాజీ విలేకరులతో చెప్పారు. ఇన్నాళ్లకు ఆ భాగ్యం కలిగిందని అన్నారు. గురువులకు పూలచాదర్ సమర్పించి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. ప్రస్తుతం తాను నటించిన ‘దొంగల […]పూర్తి వివరాలు ...
కడప : ‘కాంగ్రెస్ పార్టీని వీడి నేనెప్పుడు పోయా.. నేను పోలేదు. జగనే రాజీనామా చేసిపోయారు. ‘ అని ప్రొద్దుటూరు మాజీ శాసన సభ్యుడు వరదరాజులురెడ్డి అన్నారు. ఆదివారం ఇందిరాభవన్‌కు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆత్మగౌరవాన్ని తక్కువ చేసుకుని తాను ఉండలేనని, ఆత్మగౌరవం ఉన్న చోటే ఉంటానని స్పస్టంచేశారు. జగన్ వర్గంలోకి పోయారు కదా అని ప్రశ్నించగా.. ఎందుకు, అక్కడికి పోయానో.. ఎందుకు తిరిగి వచ్చానో చెబుతాను. ఆ విషయాన్ని సోమవారం ఇక్కడే (ఇందిరాభవన్) విలేకరుల […]పూర్తి వివరాలు ...
స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పోటీ చేస్తే ఏకగ్రీవంగా గెలిపించుకుంటామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దేవగుడి ఆదినారాయణరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, కమలమ్మ అన్నారు. కడప నగరంలోని వైఎస్ గెస్ట్‌హౌస్‌లో శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీగా పోటీ చేయాలని మధ్యవర్తి ద్వారా తాము ప్రతిపాదించినప్పటికీ వివేకానందరెడ్డి సుముఖత చూపలేదన్నారు. ఆయన మొండిగా వ్యవహరించడం అందరికీ బాధాకరంగా ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే తామంతా పదవులు […]పూర్తి వివరాలు ...
ఆశల తెగ గోసి అనలంబు చల్లార్చి గోచి బిగియ బెట్టి కోపమడచి గుట్టు మీరువాడు గురువుకు గురువురా విశ్వదాభిరామ వినురవేమ కోరికలను మొదలంటా నరికేసుకోవాలి. మనసులో చెలరేగే మోహమనే నిప్పును ఉపశమింపజేసుకోవాలి. కామ ప్రక్రియతో పనిలేకుండా అంటే గోచిని విప్పే పనిలేకుండా చేసుకోవాలి. అయినదానికీ కానిదానికీ వచ్చే కోపాన్ని నిర్మూలించుకోవాలి. అప్పుడే బ్రహ్మ రహస్యం తెలుస్తుంది. అలా తెలుసుకున్నవాడే గురువవుతాడు. గురువు కాదు పరమ గురువవుతాడు అని సెలవిస్తున్నాడు వేమన.పూర్తి వివరాలు ...
కడప : జిల్లాలో మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న రాజీవ్‌ఆరోగ్యశ్రీ వైద్యశిబిరాల వివరాలను రాజీవ్‌ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ మార్కారెడ్డి తెలిపారు. మార్చి 1న అట్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ) పరిధిలోని రెడ్డిపల్లిలో, 3న తొండూరు పీహెచ్‌సీ పరిధిలోని టి.తుమ్మలపల్లిలో, 4న నూలివీడు పీహెచ్‌సీ పరిధిలోని పులికుంటలో, 5నపూర్తి వివరాలు ...
కడప: మార్చి 18 నుంచి కడపలో సీఆర్‌పీఎఫ్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు స్టెప్ సీఈవోమహేశ్వరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం సీఆర్‌పీఎఫ్ అధికారులు జిల్లా కలెక్టర్‌తో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కడప తెలుగు గంగ క్వార్టర్స్‌లోని స్టెప్ ఆర్మీ బిల్డింగులో ఈ ఎంపికలు నిర్వహిస్తారన్నారు. విద్యార్హత: 10వ తరగతి ఉత్తీర్ణులై 170 సెం.మీ ఎత్తు ఉన్న ఆసక్తి గల యువకులు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌కు దరఖాస్తు చేసి ఎంపికలో పాల్గొనాల్సిందిగా ఆయన తెలిపారుపూర్తి వివరాలు ...