మనుజుఁడైపుట్టి మనుజుని సేవించి

మనుజుఁడైపుట్టి మనుజుని సేవించి

॥పల్లవి॥
మనుజుఁడైపుట్టి మనుజుని సేవించి
అనుదినమును దుఃఖమందనేలా
॥చ1॥
జుట్టెఁడు గడుపుకై చొరనిచోట్లు చొచ్చి
పట్టెఁడుగూటికై బతిమాలి
పుట్టిన చోటికే పొరలి మనసు పెట్టి
వట్టిలంపటము వదలనేరఁడుగాన
॥చ2॥
అందరిలోఁ బుట్టి అందరిలోఁ బెరి-
గందరి రూపము లటు దానై
అందమైన శ్రీవేంకటాద్రీశు సేవించి
అందరానిపదమందె నటుగాన
రాగము: సామంతం
రేకు: 0032-02
సంపుటము: 1-196

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, సామంతం

చదవండి :  ఇహమునుఁ బరమును యిందే వున్నవి - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: