ఆయనకు ఆ స్థలం బాగా నచ్చింది. ఆ కొండ కోట నిర్మాణానికి ఎంతో అనువుగా ఉందనీ, అక్కడ కోటను నిర్మిస్తే ఆ చుట్టు పక్కల గ్రామం వెలసి సుసంపన్నంగా, ఎంతో వైభవంగా కళకళలాడుతుందనీ జ్యోతిష్కులు శెలవిచ్చారు. దాంతో కాకమహారాజులు అక్కడ కోటను నిర్మించాలని అనుకున్నాడు. వైకుంఠశుద్ధ పంచమి రోజున కోట నిర్మాణానికి శంకుస్థాపన జరిపాడు. అతితక్కువ వ్యవధిలోనే అక్కడ గండికోట ఆవిర్భవించి దుర్భేద్యమైన కోటగా పేరు తెచ్చుకుంది. 101 బురుజులతో నిర్మితమైన గండి కోట ఎంతో సుందరంగానూ, దృఢంగానూ […]పూర్తి వివరాలు ...
నలుగు పెట్టేటప్పుడు పెండ్లి కొడుకును వేణుగోపాలునిగా భావించి ముత్తైదువులు పాడే పాట ఇది… వర్గం: నలుగు పాట నలుగూకు రావయ్య నాదవినోదా వేగామె రావయ్య వేణూగోపాల ||నలుగూకు|| సూరి గన్నెరి పూలు సూసకము కట్టించి సుందరుడ నాచేత సూసకమందుకో ||నలుగూకు|| సన్నమల్లెలు దెచ్చి సరమూ కట్టించి సరసూడ నాచేత సరమందవయ్య ||నలుగూకు|| చెండుపూలూ దెచ్చి చెండు గుట్టించి చెందురుడ నాచేత చెండందువయ్య ||నలుగూకు|| సిరిచందనపు చెక్క గంధము తీయించి కామూడ నాచేత గంధము అందుకో ||నలుగూకు|| జాజికాయ […]పూర్తి వివరాలు ...
కడప యోగివేమన విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్ర అధికారి లక్ష్మీప్రసాద్‌ను దూషించినందుకు తెదేపా నేత, బసవరామతారకం న్యాయ కళాశాల అధిపతి ఎస్.గోవర్ధనరెడ్డిపై పెండ్లిమర్రి పొలీసు స్టేషనులో 506 సెక్షన్ కింద కేసు నమోదైంది. యోగివేమన విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్ర అధికారి, బాధ్య కులసచివులు ఆచార్య సాంబశివారెడ్డి, సహాయ పరీక్షల నియంత్రణ అధికారి లక్ష్మీప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పొలీసులు, ఫిర్యాదుదారుల వివరాల మేరకు పది రోజుల కిందట గోవర్ధన్‌రెడ్డి ఫోన్‌లో సహాయ పరీక్షల నియంత్రణ అధికారి లక్ష్మీప్రసాద్‌ను […]పూర్తి వివరాలు ...
పులివెందుల: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (మెయిన్), రమణప్ప సత్రం, మైదానాల్లో సోమవారం పన్నెండేళ్ళ లోపు బాలబాలికల (అండర్-12) అఖిల భారత ఛాంపియన్‌షిప్ టెన్నిస్ టోర్నీ ప్రారంభమైంది. అక్టోబర్ 3తేదీ వరకు జరిగనున్న ఈ పోటీలను ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ ఈ.సి.గంగిరెడ్డి ప్రారంభించారు. టోర్నీలో పాల్గొనేందుకు చెన్నై, బెంగళూరు, కొయంబత్తూరు, విశాఖపట్టణం, శివకాశి, హైదరాబాద్, కేరళ తదతర ప్రాంతాల నుంచి 50 మందికి పైగా క్రీడాకారులు తరలివచ్చారు. పారిశ్రామికవేత్త గంగాధర, స్వామి వివేకానంద పాఠశాల అధిపతి సోమశేఖర్‌రెడ్డి […]పూర్తి వివరాలు ...
వర్గం: పిల్లల పాట నీళ్ళకు బోర తిమ్మ నిద్దరొస్తాదమ్మ కట్టెలు తేరా తిమ్మ కడుపు నస్తాదమ్మ నట్టుకు బోర తిమ్మ నడుము నస్తాదమ్మ పిన్నె దీసుకోర తిమ్మ ఇంతె సాలు మాయమ్మ సేనికి బోర తిమ్మ సినుకులొస్తాయమ్మ ఇంట్లో పడుకోర తిమ్మ ఇంతె చాలు మాయమ్మ పాడినవారు: వడ్లూరి నారాయణరెడ్డి, రాకట్ల, రాయడుర్గము తాలూకా, అనంతపురం జిల్లాపూర్తి వివరాలు ...
వర్ధమాన సినీకథానాయకుడు సాయిధరమ్‌తేజ్ సోమవారం పెద్దదర్గాను దర్శించి ప్రార్థనలు చేశారు. దర్గామహత్యం విని ఇక్కడి వచ్చానన్నారు. దర్గా ప్రతినిధులైన అమీర్‌ను అడిగి దర్గా విషయాలు తెలుసుకున్నారు. గురువుల ఆశీస్సుల కోసం వచ్చినట్లు తెలిపారు. ఆయన నటించిన రేయ్, పిల్లానీవులేని జీవితం సినిమాలు విడుదల కావలసి ఉంది. సాయిధరమ్‌తేజ్ ప్రముఖ నటుడు చిరంజీవి మేనల్లుడు.పూర్తి వివరాలు ...
గొడ్రాండ్రు దిగంబరులై భజనలు, నాట్యం చేస్తూ పార్శ్వనాథుని ఆలింగనం చేసుకునేవారు. రానురాను ఇది సభ్య ప్రపంచంలో అశ్లీలమై బూతు తిరునాళ్లుగా మారింది. తరువాత బ్రిటిష్ పాలకుల కాలం నాటికి కడప జిల్లా కలెక్టరు సర్ థామస్ మన్రో 1800- 1807 ప్రాంతంలో అశ్లీలతతో కూడిన ఆరాధనోత్సవాలను నిలిపేశారు. మరి కొంత కాలానికి మరింత జుగుప్సాకరంగా తిరునాళ్ల కొనసాగింది. 1918లో జిల్లా కలెక్టరు గారైన హెచ్.హెచ్. బర్‌కిట్...పూర్తి వివరాలు ...
వర్గం: హాస్యగీతాలు (పసలకాపర్లు పాడుకొనే పాట) పాడటానికి అనువైన రాగం : తిలకామోద్ స్వరాలు (ఆదితాళం) పొద్దన్నె లేసినాడు కాదరయ్యా వాడు కాళ్ళు మగం కడిగినాడు కాదరయ్యా(2) కాళ్ళు మగం నాడు కాదరయ్యా వాడు పంగనామం పీకినాడు కాదరయ్యా పంగనామం పీకినాడు కాదరయ్యా వాడు సద్ది సంగటి తిన్యాడు కాదరయ్యా సద్ది సంగటి తిన్యాడు కాదరయ్యా వాడు బుట్టి సంకన పెట్టినాడు కాదరయ్యా బుట్టి సంకన పెట్టినాడు కాదరయ్యా వాడు పల్లె దావ పట్టినాడు కాదరయ్యా పల్లె […]పూర్తి వివరాలు ...
ఇడుపులపాయ: ట్రిపుల్‌ఐటి విద్యార్థులకు దసరా సెలవులు ప్రకటించారు. ఈనెల 28వ తేదీ నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు సెలవులు ఇవ్వడంతో శనివారం రాత్రి విద్యార్థులందరు స్వగ్రామాలకు పయనం అయ్యారు. ట్రిపుల్‌ఐటి నుంచి వివిద దూర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడిపారు.పూర్తి వివరాలు ...