
తెదేపా నేతపై కేసు నమోదు
కడప యోగివేమన విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్ర అధికారి లక్ష్మీప్రసాద్‌ను దూషించినందుకు తెదేపా నేత, బసవరామతారకం న్యాయ కళాశాల అధిపతి ఎస్.గోవర్ధనరెడ్డిపై పెండ్లిమర్రి పొలీసు స్టేషనులో 506 సెక్షన్ కింద కేసు నమోదైంది. యోగివేమన విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్ర అధికారి, బాధ్య కులసచివులు ఆచార్య సాంబశివారెడ్డి, సహాయ పరీక్షల నియంత్రణ అధికారి లక్ష్మీప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
పొలీసులు, ఫిర్యాదుదారుల వివరాల మేరకు పది రోజుల కిందట గోవర్ధన్‌రెడ్డి ఫోన్‌లో సహాయ పరీక్షల నియంత్రణ అధికారి లక్ష్మీప్రసాద్‌ను దుర్భాషలాడాడని విశ్వవిద్యాలయ ఉపకులపతికి ఫిర్యాదు చేశారు. విశ్వవిద్యాలయ బోధనా, బోధనేతర సిబ్బంది నిరసన తెలిపాయి.
సంఘటన వివరాలను అప్పడే జిల్లా కలెక్టరుకు, ఎస్పీకి, ఎస్సీ ఎస్టీ కమిషనుకు విశ్వవిద్యాలయం తరుఫున ఫిర్యాదు చేశారు. దళిత సంఘాలు, ప్రజాసంఘాలు విశ్వవిద్యాలయానికి వచ్చి సంఘటన వివరాలను ఆరాతీసి దుర్బాషలాడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. వారిద్దరు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పెండ్లిమర్రి పొలీసులు తెలిపారు.
సెక్షన్ 506 క్రింద ఆరోపణలు రుజువైతే రెండు సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా లేదా జరిమానాతో కూడిన జైలు శిక్ష పడే అవకాశం ఉంది.