26నుంచి యోవేవి పీజీ కౌన్సిలింగ్

26నుంచి యోవేవి పీజీ కౌన్సిలింగ్

కడప: యోగివేమన విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల్లో పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశాల కోసం అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 26 నుంచి కౌన్సెలింగ్ జరుగుతుంది. ఈ మేరకు విశ్వవిద్యాలయ  సంచాలకులు ఆచార్య రఘునాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

విశ్వవిద్యాలయ కేంద్ర గ్రంథాలయంలో ఉదయం 9 గంటలకు అభ్యర్థులు హాజరుకావాల్సి ఉంటుందన్నారు.

26న ఉదయం ఉదయం బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, జెనెటిక్స్ అండ్ జీనోమిక్స్, మైక్రో బయాలజీ సబ్జెక్టులకు, మధ్యాహ్నం 2 గంటలకు పొలిటికల్ సైన్సు అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జర్నలిజం, సైకాలజీ సబ్జెక్టులు రాసిన ర్యాంకర్లు హాజరుకావాలన్నారు. వీటితోపాటు బోటని, తెలుగు, ఆంగ్లం సబ్జెక్టుల అభ్యర్థులు రావాలన్నారు.

చదవండి :  21వ శతాబ్ది తెలుగు సాహిత్యం తీరుతెన్నులు - 3వ రోజు

27న ఉదయం, మధ్యాహ్నం కామర్సు అభ్యర్థులు హాజరుకావాలన్నారు.

28న ఉదయం కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, ఫిజిక్సు మెటీరియల్ సైన్సు అండ్ నానో టెక్నాలజీ, మధ్యాహ్నం అయిదేళ్ల ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మేటిక్స్, ఎర్త్‌సైన్సు, జియాలజీ సబ్జెక్టుల కౌన్సెలింగ్ ఉంటుందన్నారు.

29న ఉదయం గణితం, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, కంప్యూటరు సైన్సు, మధ్యాహ్నం జువాలజి, ఫైన్ఆర్ట్స్, పీజీ డిప్లొమో ఇన్ థియేటరు ఆర్ట్సు సబ్జెక్టుల వారు హాజరుకావాలన్నారు. స్పెషల్ కేటగిరి కింద ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్, సీఏపీ, పీహెచ్, స్పొర్ట్సు అభ్యర్థులు ఇదే రోజురావాలన్నారు.

చదవండి :  'సాక్షి' బ్యాంకు ఖాతాలు తెరవండి

ట్యూషను ఫీజు కౌన్సెలింగ్ సమయంలోనే చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. మూడు సెట్ల జిరాక్సు కాపీలు, ఒరిజనల్ సర్టిఫికెట్లను వెంట తెచ్చుకోవాలని సూచించారు.

కౌన్సెలింగ్‌లో ఓసీలు, బీసీ వర్గాలు రూ.300, ఎస్సీ, ఎస్టీలు రూ.150 చెల్లించాలన్నారు. ఇతర విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు అదనంగా మరో రూ.250 చెల్లించాల్సి ఉంటుందన్నారు.

ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సులకు కౌన్సెలింగ్ తరవాత నిర్వహిస్తామన్నారు.

 

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *