వార్తా విభాగం

ఆచార వ్యవహారాలు

రేపటి నుంచి మల్లూరమ్మ జాతర

రాయచోటి: చిన్నమండెం మండల పరిధిలోని మల్లూరమ్మ జాతర గురువారం నుంచి రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా మల్లూరంమను భక్తులు పూజిస్తారు. ఏటా పాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున అమ్మవారికి తిరునాళ్ల నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇటీవలే మల్లూరమ్మ ఆలయాన్ని రూ.20లక్షలు వెచ్చించి అభివృద్ధి చేశారు. ఈరోజు (బుధవారం) రాత్రి అమ్మవారిని తిమ్మారెడ్డిగారిపల్లె నుంచి సంప్రదాయబద్ధంగా ఆలయానికి తీసుకొస్తారు. గురువారం ఉదయం అభిషేకాలు, పూజలు ఉంటాయి. […]పూర్తి వివరాలు ...

వార్తలు

ఉర్దూ విశ్వవిద్యాలయం కోసం ఆందోళనలు

కడప: జిల్లాలో ఏర్పాటు చేస్తామని చెప్పిన ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని చంద్రబాబు మాట మార్చి కర్నూలుకు మంజూరు చేస్తున్నట్లు పేర్కొనడంపై జిల్లాలోని అన్ని వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉర్దూ విశ్వవిద్యాలయ సాధనకు నగరంలోని ఉర్దూ మాతృభాషాభిమానులు, కవులు, ప్రజాప్రతినిధులు ఉర్దూ విశ్వవిద్యాలయ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట నిరహారదీక్షలు చేపట్టారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు రోజూ 25 మందితో దీక్షలు చేపడతామని యాక్షన్ కమిటీ అధ్యక్షుడు సలాఉద్దీన్ తెలిపారు. మాట మార్చిన వ్యక్తులకు మద్దతు పలికే […]పూర్తి వివరాలు ...

పర్యాటకం సమాచారం

కడప నగరం

కడప (ఆంగ్లం: Kadapa లేదా Cuddapah, ఉర్దూ: کڈپ ), వైఎస్ఆర్ జిల్లా యొక్క ముఖ్య పట్టణము, రాయలసీమలోని ఒక ప్రముఖ నగరము. మూడు వైపులా నల్లమల అడవులు, పాలకొండలతో కడప నగరం చూడముచ్చటగా ఉంటుంది. కడప నగరం యొక్క పాలన ‘కడప నగర పాలక సంస్థ’ పరిధిలో జరుగుతుంది. కడప పేరు వెనుక కథ: కడప జిల్లా గెజిటీరులో కడప పేరును 18వ శతాబ్ది వరకూ కుర్ప (Kurpa/Kurpah) అనే రాసేవాళ్ళని స్పష్టంగా ఉంది. ఇది కృప […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు రాయలసీమ

సీమ జలసాధన కోసం మరో ఉద్యమం: మైసూరారెడ్డి

రాయలసీమ అభివృద్ధికి బాబు చేసిందేమీ లేదు కడప: రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. వెంటనే గాలేరు-నగరి సుజల స్రవంతి పథకానికి అవసరమైన నిధులు కేటాయించాలని లేకపోతే రాయలసీమకు జలసాధన కోసం మరో ఉద్యమం చేస్తామని మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి హెచ్చరించారు. సోమవారం వీరపునాయునిపల్లె ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు వద్ద కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహారదీక్ష శిబిరానికి వచ్చిన మైసూరారెడ్డి ఆయనకు సంఘీభావం తెలిపారు. నిధులు కేటాయించాల ఈ […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

కడప – విశాఖపట్నంల నడుమ ‘ఇంద్ర’ బస్సు

కడప: కడప నుంచి విశాఖపట్నానికి ఇంద్ర బస్సు సర్వీసును ఆదివారం సాయంత్రం డిపో అధికారులు ప్రారంభించారు.ఈ బస్సు ప్రతి రోజు సాయంత్రం కడప డిపో నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు విశాఖపట్నానికి చేరుకుంటుంది. తిరిగి విశాఖపట్నంలో సాయంత్రం 5.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కడపకు చేరుకుంటుంది. కడప నుంచి బద్వేలు, కావలి, ఒంగోలు బైపాస్, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, అన్నవరంల మీదుగా […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

కమలాపురం శాసనసభ్యుడి నిరాహారదీక్ష

గాలేరు-నగరి సుజల స్రవంతిలో భాగమైన సర్వరాయసాగర్ పనులు తక్షణం పూర్తి చేసి ప్రజలకు, రైతులకు తాగు, సాగు నీరు అందించాలని కోరుతూ కమలాపురం శాసనసభ్యుడు రవీంద్రనాద్ రెడ్డి ఆదివారం మండల కేంద్రమైన వీరపునాయునిపల్లెలో  నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షా శిబిరంలో ఆయన మాట్లాడుతూ … ‘ఇప్పటికే మన ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. తాగడానికి నీరు లేదు.  తినడానికి తిండి లేదు.. రబీ సీజన్ కూడా మోసం చేసింది.. చంద్రబాబు సీఎం అయితే ఆయనతో […]పూర్తి వివరాలు ...

వార్తలు

‘డబ్బులిచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాల’

కడప: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తీ చేసేదానికి అవసరమైన డబ్బులు కేటాయించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని అఖిలపక్షం నేతలు అన్నారు. శనివారం అఖిలపక్షం నేతలు కలెక్టరేట్ ఆవరణలో నీటిపారుదల శాఖ సీఈ వరదరాజుకు వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో నిలిచిపోయినన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు వచ్చే బడ్జెట్‌లో రూ.1800 కోట్లు నిధులు కేటాయించాలన్నారు. గండికోట జలాశయానికి నీరు తీసుకొచ్చేందుకు సంబంధిత పనులు పూర్తి చేయాలని, […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

35 టీఎంసీల నీరు తీసుకవస్తా : బాబు

కడప: గోదావరి, కృష్ణా పరిధిలో ఆదా చేసిన 70 టిఎంసీల నీటిని రాయలసీమకు మళ్లిస్తా.. రాబోవు జూలైలో కాలువ గట్టుపై నిద్రించైనా గండికోటలో నీరు నిల్వ చేస్తా.. గండికోట, మైలవరం ప్రాజెక్టులకు 35 టీఎంసీల నీరు తీసుకవస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. శుక్రవారం ఆయన గండికోట ప్రాజెక్టు సందర్శించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పులివెందుల రైతుల అభ్యర్థన మేరకు చీనీ తోటలకు నీరు ఇచ్చాం.. గండికోట ముంపు బాధితులకు న్యాయం చేస్తాం.. ప్రభుత్వ […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

అఖిలపక్షాన్ని అడ్డుకున్న పోలీసులు

కడప: ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్ళిన అఖిల పక్షాన్ని శుక్రవారం పోలీసులు అడ్డుకున్నారు.   దీంతో వారు ఎర్రగుంట్లలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే సి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ…అయ్యే పనులు చెప్పి, ప్రజలకు సేవ చేస్తే సంతోషిస్తాం.. జూలైలో 35 టీఎంసీల నీరు గండికోట, మైలవరం రిజర్వాయర్లులలో నిల్వ చేయగల్గితే పదవికి రాజీనామ చేస్తానని సవాల్ విసిరారు. 2016 జూలైకి పూర్తి స్థాయిలో 35 టిఎంసీలు నీరు నిల్వ చేస్తే పదవికే కాదు రాజకీయాలకు సైతం […]పూర్తి వివరాలు ...

error: