1974 నాటి ‘ఆంద్రప్రదేశ్ జిల్లాల (ఏర్పాటు) చట్టం’ లో పేర్కొన్న సెక్షన్ 3, సబ్ సెక్షన్2లోని క్లాజు (e) ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము జీవో నంబరు ఎంఎస్ 613 (http://www.www.kadapa.info/go613/) ద్వారా 2010 జూలై 7 నుండి కడప జిల్లా పేరును ‘వై.ఎస్.ఆర్ జిల్లా’గా మార్చింది. ఈ ఉత్తర్వును 8-07-2010 నాటి ఆంధ్రప్రదేశ్ గెజిట్లోనూ, 15-07పూర్తి వివరాలు ...
కడప: పెండ్లిమర్రి మండలంలోని మొయిళ్లకాల్వ గ్రామంలో వెలసిన హజరత్ హుస్సేని వల్లీదర్గాలో శుక్రవారం ఉరుసు ఉత్సవం జరుగుతుందని దర్గాకమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం రాత్రి 9గంటలకు గంధం, శ్రీనివాసరావు బృందంచే శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి జీవిత చరిత్ర నాటకం ఉంటుందని, రాత్రి అన్న సంతర్పణ నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు. 10గంటలకు పూలచాందినితో గ్రామపురవీధుల్లో ఫకీర్ల మేళతాళాలతో చదివింపులు సమర్పిస్తామన్నారు. బండలాగుడు పోటీలు మద్యాహ్నం 2గంటల నుంచి వృషభరాజములచే బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. గెలుపొందిన ఎడ్ల యజమానులకు ప్రథమ […]పూర్తి వివరాలు ...
ఉర్దూ విశ్వవిద్యాలయం కోసం కొనసాగుతున్న ఆందోళన కడప: జిల్లాలో ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాట నిలుపుకోవాలని వైకాపా నాయకులు పేర్కొన్నారు. ఊరికోమాట, రోజుకో ప్రకటన ఇవ్వడం ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టటానికే చేస్తున్నారని ఆరోపించారు. అధిక సంఖ్యలో ఉర్దూ విద్యార్థులు, కవులు, సాహితీవేత్తలు ఉన్న ప్రాంతంలో కాకుండా కర్నూలులో విశ్వవిద్యాలయం స్థాపిస్తామని చంద్రబాబు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు గురువారం స్థానిక కలెక్టరేట్ వద్ద ఉర్దూ విశ్వవిద్యాలయ కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో జరగుతున్న […]పూర్తి వివరాలు ...
మొత్తానికి కడప జిల్లాకు చెందిన నాయకులు జిల్లా అభివృద్ది కోసం సమాలోచనలు సాగించడానికి సిద్ధమయ్యారు. ఈ దిశగా అఖిలపక్షం గురువారం కడపలో సమావేశం నిర్వహించింది. జిల్లా అభివృద్ది కోసము పోరాటాలు చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులూ, రైతు సంఘాల నాయకులూ నొక్కి చెప్పారు. ఇది ఒక ముందడుగు… ఈ అడుగులు గమ్యం చేరే వరకు ఇలాగే సాగాలని జిల్లా ప్రజానీకం ఆకాంక్షిస్తోంది! కడప: రాయలసీమలో వెనుకబడిన కడప జిల్లాను అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వమే వివక్ష చూపుతోన్ననేపధ్యంలో […]పూర్తి వివరాలు ...
కడప: వీరపనాయునిపల్లిలో గాలేరు నగరి ప్రాజక్టు పనులు పూర్తి చేయాలని కోరుతూ గత ఐదు రోజులుగా చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి గురువారం విరమించారు. భవిష్యత్తులో అసెంబ్లీ వేదికగా పోరాటాలు చేయాల్సి ఉన్నందున దీక్ష విరమించాలని అఖిలపక్ష నాయకులు ఆయనకు విజ్ఞప్తి చేశారు. తొలుత ససేమిరా అన్నా.. చివరకు వారి ఒత్తిడి మేరకు, భవిష్యత్తు పోరాటాల దృష్ట్యా దీక్ష విరమణకు ఎట్టకేలకు రవీంద్రనాథ్ రెడ్డి అంగీకరించారు. దాంతో వైఎస్ వివేకానందారెడ్డ వైకాపా ఎమ్మెల్యేలు నిమ్మరసం […]పూర్తి వివరాలు ...
ఒంటిమిట్ట (ఇంగ్లీషు: Ontimitta) కోదండరామునికి ప్రభుత్వ లాంఛనాలు సమర్పించేందుకు ముందుకు వచ్చిన ఆం.ప్ర ప్రభుత్వం అందుకోసం 15 వేల రూపాయలు (INR 15000 Only) కేటాయించింది. ఇందుకు సంబంధించి ఆం.ప్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి జెఎస్వి ప్రసాద్ పేర ప్రభుత్వం జీవో నెంబరు 63ను విడుదల చేసింది (ఫిబ్రవరి 21, 2015న). ఇందులో రాష్ట్ర విభజన నేపధ్యంలో ఒంటిమిట్ట ఆలయానికి ప్రభుత్వ లాంఛనాలు సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాల కోసం […]పూర్తి వివరాలు ...
కడప: బిజెపి కేంద్ర బడ్జెట్‌ను వ్యతిరేకించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ రామ్మోహన్ పిలుపునిచ్చారు. 2015-16 సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ పెట్టుబడిదారులకు, ధనవంతులకు, విదేశీ బహుళజాతి కంపెనీలకు వత్తాసుగా ఉందన్నారు. ఈ దేశాన్ని మరింతగా దోచుకోవడానికి అవసరమైన రాయితీలన్నింటిని అడ్డుగోలుగా అప్పచెప్పుతూ, సాధారణ ప్రజలపై మాత్రం మోయలేనిభారాన్నివేస్తూ బడ్జెట్ ప్రతిపాదనలుండడం యాదృచ్ఛికం కాదన్నారు. ఓట్లేసిన ప్రజల కంటే ఎన్నికల నిధులను సమకూర్చిన పెట్టుబడిదారులకు సేవ చేయడమే లక్ష్యంగా బిజెపికి […]పూర్తి వివరాలు ...
కమలాపురం: ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ‘గాలేరు-నగరి’కి నిధులు కేటాయించి ప్రాజెక్టు పూర్తి చేయాలని మాజీ మంత్రి, వైఎస్ వివేకానంద రెడ్డి డిమాండ్ చేశారు.‘ప్రజా పోరాటాలకు కమలాపురం నియోజకవర్గం పుట్టినిల్లు. ఈ నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి దీక్ష చేయడం అభినందనీయం’ అని ఆయన అన్నారు. గాలేరు-నగరి ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరుతూ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష బుధవారం నాలుగో రోజుకు చేరింది. ఈ సందర్భంగా వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ […]పూర్తి వివరాలు ...
రాయచోటి: రామాపురం మండలంలోని నీలకంఠరావుపేట దర్గాలో గురువారం నుంచి హజరత్ దర్బార్ అలీషావలి (రహంతుల్లా అలై), జలీల్ మస్తాన్‌వలీ ఉరుసు నిర్వహించనున్నట్లు సద్గురు దర్గా స్వామిజీ చెప్పారు. 5న గంధం, 6న జెండా మెరవణి, 7న ప్రసాద పంపిణీ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. హిందూ-ముస్లిం సమైక్యతకు చిహ్నంగా, మతసామరస్యానికి ప్రతీకగా నీలకంఠరావుపేట దర్గా నిలిచింది. పక్కనే సాయిబాబా ఆలయం ఉండటంతో ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. బెంగళూరు, చెన్నై, నెల్లూరు, గద్వాల్ తదితర ప్రాంతాల నుంచి భక్తులుతరలిరానున్నారు. దర్గా […]పూర్తి వివరాలు ...