కడప – విశాఖపట్నంల నడుమ ‘ఇంద్ర’ బస్సు

కడప: కడప నుంచి విశాఖపట్నానికి ఇంద్ర బస్సు సర్వీసును ఆదివారం సాయంత్రం డిపో అధికారులు ప్రారంభించారు.ఈ బస్సు ప్రతి రోజు సాయంత్రం కడప డిపో నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు విశాఖపట్నానికి చేరుకుంటుంది. తిరిగి విశాఖపట్నంలో సాయంత్రం 5.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కడపకు చేరుకుంటుంది.

కడప నుంచి బద్వేలు, కావలి, ఒంగోలు బైపాస్, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, అన్నవరంల మీదుగా విశాఖపట్నానికి వెళ్తుంది.

చదవండి :  క్రిమినల్ కేసుల్లో ఇరికించాలని సీబీఐ ముందుగానే నిర్ణయించుకుందని నాకు సమాచారముంది...

పెద్దలకు ఒక్కొక్కరికి కడప నుంచి విశాఖకు రూ.1053, చిన్నపిల్లలకు ఒక్కొక్కరికి రూ.792 చొప్పున బస్సు టిక్కెట్టు నిర్ణయించారు.

ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం ఉందని డిపో ఇన్‌ఛార్జి మేనేజరు కన్యాకుమారి చెప్పారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి!

బుగ్గవంక

బుగ్గవంక రిజర్వాయర్ సొగసు

ఒక వ్యాఖ్య

  1. I traveled in first day service in Indra with my family from Rajamundry to kadapa. The bus is very old, A C water leaked in seats.It is a bitter experience to travel in kadapa RTC depo bus. I had written in complaint book also. Expect a better service from kadapa RTC depo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: