దేవుని కడప బ్రహ్మోత్సవాలలో గురువారం (29 జనవరి 2015) నాటి ఉత్సవ కార్యక్రమాలు… ఉదయం వసంతోత్సవం, చక్రస్నానం, అవభృథ స్నానం సాయంత్రం వూంజల్‌సేవ, హంసవాహనసేవ, ధ్వజావరోహణంపూర్తి వివరాలు ...
దేవుని కడప: దేవునికడప బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం వేంకటేశ్వర స్వామి వారు సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం చంద్రప్రభ వాహనంపై వూరేగారు. ఉదయం నిత్యహోమాలు, బలిహరణం, గ్రామబలి నిర్వహించారు. సాయంత్రం స్నపన తిరుమంజనం, వూంజల్‌సేవ చేసి సేదతీర్చారు. ఆలయ ప్రధాన అర్చకులు మచ్ఛాశేషాచార్యులు, మయూరం కృష్ణమాచార్యులు స్వామి వూంజల్‌సేవను, డోలోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వూంజల్‌సేవను తిలకించి భక్తులు తరించారు.పూర్తి వివరాలు ...
కడప: మూడు రాష్ట్రాల పోలీసు డాగ్ స్క్వాడ్‌లకు నిర్వహించిన పోటీల్లో కడప డాగ్‌స్క్వాడ్‌లు మొదటి, రెండవ బహుమతులు దక్కించుకున్నాయి. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇంటిలిజెన్స్ శిక్షణ అకాడమిలో ఈ పోటీలు జరిగినాయి. తెలంగాణ, అరుణాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కుక్కలకు ఈ పోటీలు నిర్వహించారు. కడప జిల్లా కుక్కలు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలవడంతో బంగారు, రజత పతకం అందచేశారు. ఈ సందర్భంగా డాగ్‌స్క్వాడ్ భాద్యతలు చూసే రామ్మోహన్‌రెడ్డి, శ్రీనివాసులు, పీరయ్య, శివకుమార్‌లను జిల్లా ఎస్పీ […]పూర్తి వివరాలు ...
రాయచోటి: సుండుపల్లి- సానిపాయ మార్గంలో బుర్రలదిన్నెపల్లె దగ్గర ఈ గురు, శుక్ర వారాలలో ఇస్తిమా (ఆధ్యాత్మిక సమ్మేళనం) జరగనుంది. ఇందుకు సంబంధించి నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ ప్రాంతాల నుండి సుమారు రెండు లక్షలకు పైగా భక్తులు వస్తారని భావిస్తున్నారు. భారీ స్థాయిలో తాగునీటి వసతి, షామియానాలు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను ఆయా మార్గాల్లో నిలిపేందుకు అనువైన ప్రాంతాలను ఎంపిక చేశారు. ఈ సమావేశాల్లో ప్రవక్త బోధనలు, సామూహిక ప్రార్థనలు, […]పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు: నగరంలో దొంగతనాలు కొనసాగుతూనే ఉన్నాయి. దొంగలు తాళం వేసి ఉన్న ఇళ్లను ఎంచుకుని మరీ దొంగతనం చేస్తుండడంతో నగర వాసులు ఇల్లు విడిచి పోవాలంటే భయపడుతున్నారు. ఒకటి రెండు రోజుల పాటు ఆ ఇంటిని గమనిస్తూ, ఇంట్లో వారు ఎక్కడికి వెళ్లారో తెలుసుకొని దొంగలు రంగంలోకి దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఐదు రోజుల క్రితం మోడంపల్లె, జిన్నారోడ్డులోని నాలుగు ఇళ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన మరువక ముందే మోడంపల్లెలోని శారదా ప్రేమవాణి అనే […]పూర్తి వివరాలు ...
దేవుని కడప బ్రహ్మోత్సవాలలో ఐదోరోజు శనివారం నాటి ఉత్సవాలు… ఉదయం కల్పవృక్ష వాహనంపై ఊరేగింపు, స్నపన తిరుమంజనం సాయంత్రం 6గంటలకు వూంజల్‌సేవ సాయంత్రం గరుడవాహన సేవ నగరసంకీర్తన ఉత్సవాలలో భాగంగా నగరంలోని ప్రధాన పురపాలక ఉన్నత పాఠశాల వద్ద ఉన్న అన్నమయ్య విగ్రహానికి అభిషేకోత్సవం, అలంకరణ ఉంటుందని రుక్మిణి పాండురంగ భజన బృందం తెలిపింది. అనంతరం స్వామి గరుడసేవలో పాల్గొనే భక్తులకు అన్నదానం చేయనున్నట్లు కమిటీ పేర్కొంది. సాయంత్రం నాలుగు గంటలకు భజన బృందంతో అన్నమయ్య విగ్రహం […]పూర్తి వివరాలు ...
దేవుని కడప: బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగో రోజైన శుక్రవారం కడపరాయడు (లక్ష్మీ వేంకటేశ్వరుడు) చిన్నశేష, హనుమంత వాహనాలపైన భక్తులకు దర్శనమిచ్చినారు. ఉదయం చిన్న శేష వాహనంపైన కొలువుదీరి గ్రామోత్సవానికి తరలి వెళ్ళిన స్వామి వారు సాయంత్రం ఉయ్యాల సేవ అనంతరం హనుమంత వాహనంపైన దేవుని కడప మాడ వీధులలో భక్తులకు దర్శనమిచ్చినారు. చెక్కభజనలు, కోలాటాలు, గోవింద నామస్మరణల నడుమ భక్తుల జయజయధ్వానాల నడుమ దేవదేవుడు ఊరేగినారు.పూర్తి వివరాలు ...
కడప జిల్లా వాసుల ఆశలన్నీ ఆవిరి కందుల సోదరులను భాజపాలో చేర్చుకోవడానికి మొన్న 18న కడపకొచ్చిన వెంకయ్య నాయుడు గారు కడప జిల్లా అభివృద్ధి విషయంలో మినుకుమినుకుమంటున్న ఆశల మీద నిర్దాక్షిణ్యంగా చన్నీళ్ళు గుమ్మరించి చక్కా వెళ్ళిపోయారు. కేంద్ర కేబినెట్లో ఆంధ్రప్రదేశ్ వాణిని బలంగా వినిపించగల నాయకుడిగా, చాలాకాలంగా ఈ ప్రాంత సమస్యలు, పరిస్థితుల గురించి అవగాహనతోబాటు బాధ్యతకూడా కలిగిన సీనియర్ నాయకుడిగా ఆయన్నుంచి కడప జిల్లావాసులు ప్రధానంగా కోరుకున్నది నాలుగు విషయాల్లో స్పష్టత – అవి: […]పూర్తి వివరాలు ...
దేవుని కడప బ్రహ్మోత్సవాలలో నాలుగోరోజు శుక్రవారం నాటి ఉత్సవాలు… ఉదయం చిన్నశేషవాహనంపై ఊరేగింపు ఉదయం 10గంటలకు స్నపన తిరుమంజనం సాయంత్రం 6గంటలకు వూంజల్‌సేవ సాయంత్రం హనుమంత వాహనం పై ఊరేగింపుపూర్తి వివరాలు ...