॥పల్లవి॥మలసీఁ జూడరో మగ సింహముఅలని మీఱిన మాయల సింహము॥చ1॥అదివో చూడరో ఆదిమపురుషునిపెదయౌభళము మీఁది పెనుసింహమువెదకి బ్రహ్మాదులు వేదాంతతతులుకదిసి కానఁగలేని ఘనసింహము॥చ2॥మెచ్చిమెచ్చి చూడరో మితిమీఱినయట్టి-చిచ్చిఱకంటితోడి జిగిసింహముతచ్చినవారిధిలోన తరుణిఁ గౌఁగిటఁ జేర్చినచ్చినగోళ్ళ శ్రీనరసింహము॥చ3॥బింకమునఁ జూడరో పిరితియ్యక నేఁడుఅంకపుదనుజసంహారసింహమువేంకటనగముపై వేదాచలముపైకింక లేక వడిఁ బెరిగినసింహము రాగము: శంకరాభరణం రేకు: 0002-07 సంపుటము: 1-13 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శంకరాభరణంపూర్తి వివరాలు ...
॥పల్లవి॥సందడి విడువుము సాసముఖామంధరధరునకు మజ్జనవేళా॥చ1॥అమరాధిపు లిడుఁ డాలవట్టములుకమలజ పట్టుము కాళాంజిజమలిచామరలు చంద్రుఁడ సూర్యుఁడఅమర నిడుఁడు పరమాత్మునకు॥చ2॥అణిమాదిసిరులనలరెడు శేషుఁడమణిపాదుక లిడు మతి చెలఁగాప్రణుతింపు కదిసి భారతీరమణగుణాధిపు మరుగురు బలుమరును॥చ3॥వేదఘోషణము విడువక సేయుఁడుఆదిమునులు నిత్యాధికులుశ్రీదేవుండగు శ్రీవేంకటపతిఆదరమున సిరు లందీ వాఁడె రాగము: ధన్నాసి రేకు: 0002-06 సంపుటము: 1-12 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ధన్నాసిపూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఇందుకొరకె యిందరును నిట్లయిరికిందుపడి మఱికాని గెలుపెఱఁగరాదు॥చ1॥అటమటపువేడుకల నలయించి మఱికదాఘటియించుఁ బరము తటుకన దైవముఇటు సేయ నీశ్వరున కీసు గలదా? లేదు.కుటిలమతిఁ గని కాని గుణిఁ గానరాదు॥చ2॥బెండుపడ నవగతులఁ బెనఁగించి మఱికదాకొండనుచుఁ బర మొసంగును దైవముబండుసేయఁగ హరికి బంతమా? యటుగాదు.యెండదాఁకక నీడహిత వెఱఁగరాదు॥చ3॥మునుప వేల్పులకెల్ల మ్రొక్కించి మఱికదాతనభ క్తి యొసఁగు నంతట దైవముఘనవేంకటేశునకు గపటమా? అటుగాదు.తినక చేఁదునుఁ దీపు తెలియనేరాదు. రాగము: మాళవిశ్రీ రేకు: 0002-05 సంపుటము: 1-11 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥సహజ వైష్ణవాచార వర్తనుల-సహవాసమె మాసంధ్య॥చ1॥అతిశయమగు శ్రీహరిసంకీర్తనసతతంబును మాసంధ్యమతి రామానుజమతమే మాకునుచతురతమెఱసిన సంధ్య॥చ2॥పరమభాగవతపదసేవనమేసరవి నెన్న మాసంధ్యసిరివరుమహిమలు చెలువొందఁగ వే-సరక వినుటె మాసంధ్య॥చ3॥మంతుకెక్క తిరుమంత్రపఠనమేసంతతమును మాసంధ్యకంతుగురుఁడు వేంకటగిరిరాయని-సంతర్పణమే మాసంధ్య రాగము: సామంతం రేకు: 0002-04 సంపుటము: 1-10 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఎవ్వరిఁ గాదన్న నిది నిన్నుఁ గాదంటయెవ్వరిఁ గొలిచిన నిది నీకొలువు॥చ1॥అవయవములలో నదిగా దిదిగా-దవి మే లివి మే లన నేలాభువియుఁ బాతాళము దివియు నందలిజంతు-నివహ మింతయునూ నీదేహమేకాన॥చ2॥నీవు లేనిచోటు నిజముగఁ దెలిసినఆవల నది గా దనవచ్చునుశ్రీవేంకటగిరి శ్రీనాథ సకలముభావింప నీవే పరిపూర్ణుఁడవుగాన రాగము: బౌళి రేకు: 0002-03 సంపుటము: 1-9 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఇందిరానామ మిందరికికుందనపుముద్ద వో గోవిందis-aber.net॥చ1॥అచ్చుతనామము అనంతనామముఇచ్చినసంపద లిందరికినచ్చినసిరులు నాలుకతుదలుకొచ్చికొచ్చీ నోగోవిందా॥చ2॥వైకుంఠనామము వరదనామముఈకడనాకడ నిందరికివాకుఁదెరపులు వన్నెలు లోకాలఁగూకులు వత్తులు నోగోవిందా॥చ3॥పండరినామము పరమనామముఎండలువాపెడి దిందరికినిండునిధానమై నిలచినపేరుకొండలకోనేటివోగోవిందా రాగము: శుద్ధవసంతం రేకు: 0002-02 సంపుటము: 1-8 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic పూర్తి వివరాలు ...
॥పల్లవి॥సదా సకలము సంపదలేతుద దెలియఁగ వలెఁ దొలఁగఁగవలయు॥చ1॥అహర్నిశమును నాపదలేసహించిన నవి సౌఖ్యములేయిహమున నవి యిందఱికినిమహిమ దెలియవలె మానఁగవలెను॥చ2॥దురంతము లివి దోషములేపరంపర లివి బంధములువిరసములౌ నరవిభవములౌ-సిరులే మరులౌ చిరుసుఖ మవును॥చ3॥గతి యలమేల్ మంగ నాంచారికిఁబతియగువేంకటపతిఁ దలఁచిరతు లెఱుఁగగవలె రవణము వలెనుహిత మెఱుఁగఁగవలె నిదె తనకు రాగము: శుద్ధవసంతం రేకు: 0002-01 సంపుటము: 1-7 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శుద్ధవసంతంపూర్తి వివరాలు ...
॥పల్లవి॥మానుషము గాదు మఱి దైవికము గానిరానున్నా అది రాకుమన్నఁ బోదు॥చ1॥అనుభవనకుఁ బ్రాప్తమైనదితనకుఁదానె వచ్చి తగిలికాని పోదు॥చ2॥తిరువేంకటగిరిదేవుని-కరుణచేతఁ గాని కలుష మింతయుఁ బోదు రాగము: గుండక్రియ రేకు: 0001-06 సంపుటము: 1-6 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, గుండక్రియపూర్తి వివరాలు ...
॥పల్లవి॥వేదం బెవ్వని వెదకెడినిఆ దేవునిఁ గొనియాడుఁడీ॥చ1॥అలరిన చైతన్యాత్మకుఁడెవ్వఁడుకలఁ డెవ్వఁ డెచటఁ గలఁడనినతలఁతు రెవ్వనినిఁ దనువియోగదశయిల నాతని భజియించుఁడీ॥చ2॥కడఁగి సకలరక్షకుఁడిం దెవ్వఁడువడి నింతయు నెవ్వనిమయముపిడికిట తృప్తులు పితరులెవ్వనినిఁదడవిన, ఘనుఁడాతనిఁ గనుఁడీ॥చ3॥కదిసి సకలలోకంబులవారలుయిదివో కొలిచెద రెవ్వనినిత్రిదశవంద్యుఁడగు తిరువేంకటపతివెదకి వెదకి సేవించుఁడీ రాగము: పాడి రేకు: 0001-05 సంపుటము: 1-5 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, పాడిపూర్తి వివరాలు ...