॥పల్లవి॥ఇందిర వడ్డించ నింపుగనుచిందక యిట్లే భుజించవో స్వామి-॥చ1॥అక్కాళపాశాలు నప్పాలు వడలుపెక్కైనసయిఁదంపుపేణులునుసక్కెరరాసులు సధ్యోఘృతములుకిక్కిరియ నారగించవో స్యామీ॥చ2॥మీరినకెళంగు మిరియపుఁదాళింపుఁ –గూరలు కమ్మనికూరలునుసారంపుఁబచ్చళ్ళు చవులుగ నిట్టేకూరిమితోఁ జేకొనవో స్వామీ॥చ3॥పిండివంటలునుఁ బెరుగులుఁ బాలుమెండైన పాశాలు మెచ్చి మెచ్చికొండలుపొడవు కోరి దివ్యాన్నాలువెండియు మెచ్చేవే వేంకటస్వామీ రాగము: శ్రీరాగం రేకు: 0004-02 సంపుటము: 1-22 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శ్రీరాగంపూర్తి వివరాలు ...
॥పల్లవి॥దురితదేహులే తొల్లియును శ్రీ-హరి భజించి నిత్యాధికులైరి॥చ1॥అనంతకోటి మహామునులు ఈ-సనకాదులు నిశ్చలయశులుఇనశశినయనుని నితనిని మునుగని భజించి గత కల్మషులైరి॥చ2॥అతిశయమతులు మహామహులు సుఖ-రతి విముఖులును చిరంతనులుహిత విచారమతి నితనిని సం-తతమును భజించి ధన్యులైరి॥చ3॥దేవతాధిపులు దివ్యులును కడుఁ-బావనులును తగ బరహితులుయీ వేంకటపతి నితనినిసేవించి సుఖాంచితమతులైరి రాగము: శుద్ధవసంతం రేకు: 0004-01 సంపుటము: 1-21 Tags: Annamacharya Keerthanalu, పూర్తి వివరాలు ...
॥పల్లవి॥అన్నియును నతని కృత్యములేయెన్నియైనానవు నతఁడేమి సేసినను॥చ1॥అణురేణు పరిపూర్ణుఁడవలి మోమైతేనుఅణువౌను కమలభవాండమైనఫణిశయనుని కృపాపరిపూర్ణ మైతేతృణమైన మేరువౌ స్థిరముగా నపుడే॥చ2॥పురుషోత్తముని భక్తి పొరపొచ్చ మైతేఎరవులౌ నిజసిరులు ఎన్నైననుహరిమీఁది చింత పాయక నిజం బైతేనిరతిఁ బట్టినవెల్లా నిధానములే॥చ3॥మదనగురుని సేవ మదికి వెగటైతేనుపదివేలు పుణ్యములు పాపంబులేపదిలమై వేంకటపతి భక్తి గలిగితేనుతుదిపదంబునకెల్ల దొడవవు నపుడే రాగము: శ్రీరాగం రేకు: 0003-07 సంపుటము: 1-20 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥చిత్తములో నిన్నుఁ జింతించనేరకమత్తుఁడఁనై పులుమానిసినైతి॥చ1॥అరుత లింగము గట్టి యది నమ్మఁజాలకపరువతమేఁగిన బత్తుడఁ నైతిసరుస మేఁకపిల్లఁ జంకఁబెట్టుక నూఁత-నరయు గొల్లనిరీతి నజ్ఞాని నైతి॥చ2॥ముడుపు కొంగునఁగట్టి మూలమూలలవెదకే-వెడమతినై నే వెర్తుడ నైతివిడువ కిక్కడ శ్రీవేంకటేశ్వరుఁ డుండపొడగానక మందబుద్ధి నేనైతి రాగము: ముఖారి రేకు: 0003-06 సంపుటము: 1-19 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic పూర్తి వివరాలు ...
॥పల్లవి॥తెలియఁ జీకటికి దీపమెత్తక పెద్ద-వెలుఁగులోపలికి వెలుఁగేలా॥చ1॥అరయ నాపన్నుని కభయ మీవలెఁగాకఇరవైనసుఖిఁ గావనేలావఱతఁబోయెడివాని వడిఁ దీయవలెఁగాకదరివానిఁ దివియంగఁ దానేలా॥చ2॥ఘనకర్మారంభునికట్లు విడవలెఁగాకయెసి మునక్తునిఁ గావనేలాఅనయము దుర్బలుని కన్నమిడవలెఁగాకతనసినవానికిఁ దానేలా॥చ3॥మితిలేనిపాపకర్మికిఁ దా వలెఁగాకహితవెఱుఁగుపుణ్యుని కేలాధృతి హీనుఁ గృపఁ జూచి తిరువేంకటేశ్వరుఁడుతతిఁ గావకుండినఁ దానేలా రాగము: గుండక్రియ రేకు: 0003-05 సంపుటము: 1-18 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, గుండక్రియపూర్తి వివరాలు ...
॥పల్లవి॥నీవేకానింక నే నన్య మెఱఁగ యే-త్రోవ చూపి నాకుఁ దోడయ్యెదవయ్య॥చ1॥అపరాధనత కోట్లయినవి వొక్క-నెపమున ననుఁ గావనేరవాఅపరిమితదురితా లైనవి యే-ఉపమచేత నన్ను నుద్దరించెదవయ్య॥చ2॥అతిశయముగఁ గర్మినైతిని నీ-మతము నాకొకయింత మరపవాఇతర కర్మారంభహితుఁడనుగతి మోక్ష మెటువలెఁ గల్పించెదవయ్య॥చ3॥తిరువేంకటాచలాధీశ్వరా నీ-శరణాగతులఁ బ్రోవఁజాలవాపరమదయానందపరుఁడవు యే-వెరవున భవములు వెడలఁ ద్రోచెదవయ్య రాగము: శ్రీరాగం రేకు: 0003-04 సంపుటము: 1-17 Tags: Annamacharya పూర్తి వివరాలు ...
॥పల్లవి॥దిబ్బలు వెట్టుచుఁ దేలిన దిదివోఉబ్బు నీటిపై నొక హంసా॥చ1॥అనువునఁ గమలవిహారమై నెలవైవొనరి వున్నదిదె వొక హంసామనియెడి జీవుల మానససరసుల-వునికి నున్న దిదె వొక హంసా॥చ2॥పాలునీరు నేర్పరిచి పాలలో-నోలనాడె నిదె వొక హంసాపాలుపడిన యీ పరమహంసముల-వోలి నున్నదిదె వొక హంసా॥చ3॥తడవి రోమరంధ్రంబుల గుడ్ల-నుడుగక పొదిగీ నొక హంసాకడువేడుక వేంకటగిరి మీఁదట-నొడలు వెంచెనిదె యొక హంసా రాగము: కాంబోధి రేకు: 0003-03 సంపుటము: 1-16 Tags: Annamacharya Keerthanalu, పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఎవ్వారులేరూ హితవు చెప్పఁగ వట్టి-నొవ్వులఁ బడి నేము నొగిలేమయ్యా॥చ1॥అడవిఁ బడినవాఁడు వెడలఁ జోటులేకతొడరి కంపలకిందు దూరినట్లునడుమ దురితకాననములతరిఁ బడివెడలలేక నేము విసిగేమయ్యా॥చ2॥తెవులువడినవాఁడు తినఁబోయి మధురముచవిగాక పులుసులు చవిగోరినట్లుభవరోగములఁ బడి పరమామృతము నోరఁజవిగాక భవముల చవులాయనయ్యా॥చ3॥తనవారి విడిచి యితరమైనవారి-వెనకఁ దిరిగి తా వెఱ్ఱైనట్లుఅనయము తిరువేంకటాధీశుఁ గొలువకమనసులోని వాని మఱచేమయ్యా రాగము: వరాళి రేకు: 0003-02 సంపుటము: 1-15 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, […]పూర్తి వివరాలు ...
కన్నడ గౌళ॥పల్లవి॥గాలినే పోయఁ గలకాలముతాలిమికిఁ గొంతయుఁ బొద్దు లేదు॥చ1॥అడుసు చొరనే పట్టె నటునిటుఁ గాళ్ళుగడుగుకొననే పట్టెఁ గలకాలముఒడలికి జీవుని కొడయఁడైనహరిఁదడవఁగా గొంతయుఁ బొద్దులేదు॥చ2॥కలఁచి చిందనే పట్టెఁ గడవ నించగఁ బట్టెకలుషదేహపుబాదఁ గలకాలముతలపోసి తనపాలిదైవమైనహరిదలఁచఁగా గొంతయుఁ బొద్దులేదు॥చ3॥శిరసు ముడువఁబట్టె చిక్కుదియ్యఁగఁ బట్టెగరిమలఁ గపటాలఁ గలకాలముతిరువేంకటగిరి దేవుఁడైన హరిదరిచేరాఁ గొంతయుఁ బొద్దు లేదు రాగము: తెలియదు రేకు: 0003-01 సంపుటము: 1-14 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...