‘ఉప’ ప్రచారానికి హనుమంతుడు

    కడప : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మే 1, 2, 3 తేదీల్లో కడప లోక్‌సభ సెగ్మెంట్‌లో ఆయన ప్రచార కార్యక్రమం ఖరా రైంది.

    కడప ఉప ఎన్నికల ప్రచారానికి ఇప్పటికే ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహరాల ఇన్‌చార్జీ గులాం నబీ ఆజాద్‌, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, ప్రజారాజ్యం అధినేత చిరంజీవి, మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్యల షెడ్యూల్‌ ఖరారైంది.

    చదవండి :  జగన్ బయటకొస్తే వార్ వన్ సైడే...

    hanmanth Raoకాగా తాజాగా విహెచ్‌ కూడా వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. కడప లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్ధి డిఎల్‌ రవీంద్రారెడ్డి, ఎన్నికల ప్రచారానికి రావాల్సిందిగా విహె చ్‌ను ఆహ్వానించినట్లు తెలిసింది.

    ఆయన ఆహ్వానం మేరకే విహెచ్‌ కడపకు ప్రచారానికి వెళుతున్నట్లు అతని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం జగన్‌ కడపలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధిగా బరిలో ఉండటంతో ఆయనకు వ్యతిరేకంగా ప్రచా రం చేసేందుకు విహెచ్‌ కడపకు వెళ్ళేందుకు సై అన్నట్లు సమాచారం. ప్రస్తుతం అమెరికాలో ఉన్న విహెచ్‌ ఈ నెల చివరి వారంలో హైదరాబాద్‌కు చేరుకుని, ఆ తరువాత ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

    చదవండి :  డి.ఎల్ అలా చేస్తారా?

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *