వైఎస్ వల్లే గెలిచామంటే ఒప్పుకోను
పోరుమామిళ్ల: రాష్ట్రంలో రెండవ సారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానకి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కృషే కారణమంటే ఒప్పుకోనని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి కృషి ప్రభుత్వ ఏర్పాటులో ఎంతైనా ఉందని రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి మహిధర్ రెడ్డి అన్నారు.
బుధవారం పోరుమామిళ్ల పట్టణంలోని మాజీ శాసన సభ్యుడు వి శివరామక్రిష్ణారావు స్వగృహంలో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో బద్వేలు తాలుకా ఎన్నికల ఇన్‌ఛార్జిగా రాలేదని నాయకుల మధ్య సమన్వయ కర్తగా మాత్రమేవచ్చానన్నారు. ప్రస్తుతం ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే పరిస్థితి కనిపించడంలేదని, ఓటింగ్‌రోజు ఏ పరిణామాలు ఉద్బవిస్తాయో చెప్పలేమన్నారు.
పార్టీలు వీడటం మంచిది కాదని, పార్టీకి అంకితమై పని చేస్తే పదువులు అవే వస్తాయన్నారు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో బకాయిల శాతం బాగా పెరిగి పోయాయని కడప జిల్లా నుంచి 22 కోట్లు బయాయలు ఉన్నాయన్నారు.
పాలక వర్గం అవగాహన లేని కారణంగా ఇలాంటి పరిణామాలు ఉత్పన్నమౌతున్నాయని , తమ సొంత మనుషుల కోసం ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఖాళీలను పూర్తి చేసుకొని అధనపు భారం పెడుతున్నారన్నారు. బద్వేలు మున్సిపాలిటీలో రూ.1.20 కోట్లు బకాయిలు ఉన్నాయని, రూ.60 లక్షలు వార్షిక ఆదాయం ఉన్న మున్సిపాలిటీలో ఎంత మేరకు ఖర్చు చేయాలో తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బద్వేలు శాసన సభ్యురాలు కమలమ్మ, మాజీ శాసన సభ్యులు శివరాక్రిష్ణారావు, తులసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
1 Comment
YSR valla kakapothe evarivalla gelichavura niyabba.