మొదటి గంటలో 15 శాతం ఓట్లు
కడప లోక్ సభ నియోజకవర్గం లో మొదటి గంటలో 15 శాతం ఓట్లు పోలయ్యాయి. సాయంత్రానికి ఎనబైశాతం నుంచి ఎనభై ఐదు శాతం ఓట్లు పోల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.కాగా కొన్ని చోట్ల ఓటింగ్ యంత్రాలు మొరాయిస్తున్నాయి.
ఎండల కారణంగా కూడా ప్రజలు ఉదయానే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.ముఖ్య ఎన్నికల అధికారి బన్వర్ లాల్ వీడియో ద్వారా ప్రత్యక్ష ప్రసారం లో పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు.
- పులివెందుల శాసనసభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న వైఎస్ వివేకానందరెడ్డి తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ పులివెందుల బాకరాపురంలోని పోలింగ్ బూత్ వద్ద ఏజంట్ గా కూర్చున్నారు.
- ఎర్రగుంట్ల మండలం నిడుజువ్విలోని పోలింగ్ బూత్లో తెలుగుదేశం పార్టీ తరపున కడప లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్న మైసూరా రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నజగన్మోహన రెడ్డి పులివెందుల బాకరాపురం పోలింగ్ బూత్ వద్ద తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జగన్ సతీమణి భారతి, అత్త సుగుణమ్మలు కూడా ఇక్కడే తమ ఓట్లు వేశారు. భారతి దాదాపు గంటసేపు క్యూలో నిలబడి తన ఓటు వేశారు.
- వైఎస్ జయమ్మ కాలనీలోని పోలింగ్ బూత్ వద్ద పులివెందు శాసనసభ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న విజయమ్మ ఓటు వేశారు.
- కాంగ్రెస్ అభ్యర్ది డాక్టర్ డి.ఎల్.రవీంద్రరెడ్డి ఎన్నికల సంఘం పక్షపాతంగా పనిచేస్తోందని ఆరోపిచడం విశేషం. కాగా వై.ఎస్.జగన్ దేవుని దయతో గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎందరు మంత్రులు ఇక్కడ మకాం చేసి డబ్బు పంచింది అంతా చూశారు. అయినప్పటీకీ తానే గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.