
పాలకవర్గాలు ఏర్పడినాయి!
కడప నగరపాలికతోపాటు, ఆరు పురపాలికల్లో పాలకవర్గాలు గురువారం కొలువు దీరాయి. జమ్మలమడుగులో మాత్రం ఓ కౌన్సిలర్ కనిపించకుండా పోవడంతో తెదేపా నేతలు వీరంగం చేశారు. దీంతో అక్కడ పాలకవర్గం ఎన్నికను ఈరోజుకు వాయిదా వేశారు. బద్వేలులో ఛైర్మన్‌గా తెదేపా కౌన్సిలర్ పార్థసారధిని ఎన్నుకోగా, వైస్ ఛైర్మన్ అభ్యర్థిపై స్పష్టత రాకపోవడంతో ఆ ఎన్నిక వాయిదా వేశారు.
కడప నగరపాలికలోని మేయర్, డిప్యూటీ మేయర్, ఏడు పురపాలికల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు గురువారం ఎన్నిక నిర్వహించారు. అన్ని చోట్లా ఎన్నిక దాదాపు ప్రశాంతంగా జరిగినప్పటికీ జమ్మలమడుగులో మాత్రం ఉదయం నుంచి ఉద్రిక్తత కొనసాగింది. చివరకు ఇక్కడి ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేశారు.
ఎర్రగుంట్ల, రాయచోటిలో వైకాపా మెజార్టీ స్థానాలు సంపాదించినప్పటికీ తెదేపా నేతలు పలువురు కౌన్సిలర్లను ప్రలోభపెట్టి తమ వైపు తిప్పుకున్నారు. దీంతో ఈ రెండు స్థానాలలో తెదేపా, వైకాపాలు సమాన స్థానాలతో నిలబడ్డాయి. ఫలితంగా అధికారులు చీటీల రూపంలో డ్రా నిర్వహించారు. వైకాపాకు అదృష్టం వరించింది.
కడప మేయర్‌గా వైకాపా జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు ఎన్నికయ్యారు. ఇక్కడ డిప్యూటీ మేయర్ గా అరీఫుల్లాను ఎన్నుకున్నారు. ప్రొద్దుటూరు పురపాలిక ఛైర్మన్‌గా తెదేపాకు చెందిన వి.గురివిరెడ్డి ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్‌గా జబీబుల్లాను ఎన్నుకున్నారు.
ప్రొద్దుటూరు పురపాలిక ఛైర్మన్‌గా తెదేపాకు చెందిన వి.గురివిరెడ్డి ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్‌గా జబీబుల్లాను ఎన్నుకున్నారు. తెదేపాకు
పులివెందుల పురపాలికలో ఛైర్మన్‌గా వైఎస్ మనోహర్‌రెడ్డి సతీమణి ప్రమీల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడ వార్డులన్నీ దాదాపు వైకాపాకే దక్కడంతో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. వైస్ ఛైర్మన్‌గా చిన్నప్పను ఎన్నుకున్నారు.
మైదుకూరు నగర పంచాయతీ ఛైర్మన్‌గా తెదేపాకు చెందిన డాక్టర్ రంగసింహను ఎన్నుకున్నారు. వైస్ ఛైర్మన్‌గా సుద్దాల పెద్దగురప్పను ఎన్నుకున్నారు.
ఎర్రగుంట్ల నగరపంచాయితీలో వైకాపాకు చెందిన హెచ్.ముసలయ్య, సుబాష్‌రెడ్డిలు ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లుగా ఎన్నికయ్యారు.
రాయచోటిలో ఛైర్మన్‌గా వైకాపాకే చెందిన నసీబున్సీసా ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్‌గా మాత్రం తెదేపాకు చెందిన ఇందాజుల్లా లాటరీలో ఎన్నికయ్యారు.
జమ్మలమడుగులో ఓ సందర్భంగా పరిస్థితి చేజారిపోయే వరకు వెళ్లింది. వెంటనే అదనపు బలగాలను అక్కడికి పంపడమే కాకుండా, ఎస్పీ అశోక్‌కుమార్ కూడా అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.