జమ్మలమడుగు పురపాలిక పీఠం వైకాపాదే

జమ్మలమడుగు పురపాలిక పీఠం వైకాపాదే

జమ్మలమడుగు మున్సిపల్ చైర్ పర్సన్ గా తులశమ్మ(వైకాపా), వైస్‌ ఛైర్మన్‌గా ముల్లా జానీ (తెదేపా)ఎన్నికయ్యారు.  జమ్మలమడుగు మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిసింది.

తెదేపా, వైకాపా అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో లాటరీ ద్వారా ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లను ఎంపిక చేశారు. తెదేపా వాళ్ళు ప్రత్యక్ష ఎన్నికలలో అధిక స్థానాలు పొందినప్పటికీ లాటరీలో చైర్ పర్సన్,  పదవి వైకాపాకు దక్కడం విశేషంగా ఉంది.

మే నెలలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 9 స్థానాల్లో, టీడీపీ 11స్థానాల్లో విజయం సాధించింది. అయితే స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిలు ఎక్స్ అఫిషియో సభ్యులుగా తమ ఓటునుఇక్కడే వినియోగించుకుంటుండటం, అలాగే వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచిన జానీ తెదేపాకు ఓటు వేయటంతో రెండు పార్టీలకు సమానంగా 11 మంది సభ్యులున్నట్లయింది.

చదవండి :  జమ్మలమడుగులో ఎవరికెన్ని ఓట్లు?

మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా జమ్మలమడుగులో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

    వార్తా విభాగం

    ఇవీ చదవండి

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *