జగన్ పిటిషన్లపై ‘సుప్రీం’లో విచారణ ప్రారంభం
న్యూఢిల్లీ: వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు, కడప ఎంపి జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తులకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు సహజ న్యాయసూతాలకు వ్యతిరేకం అని ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మాలానీ సుప్రీం కోర్టులో వాదించారు. జగన్ దాఖలు చేసిన లీవ్ పిటిషన్లపై సుప్రీం కోర్టులో ఈరోజు విచారణ ప్రారంభమైంది. జగతి పబ్లికేషన్స్, సాక్షి టీవీల్లో పెట్టుబడులు, తన ఆస్తులపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని కోరుతూ ఆయన సుప్రీం కోర్టులో మూడు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంత్రి మండలి నిర్ణయాలు సమష్టి నిర్ణయాలని ఆయన సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. జస్టిస్ దల్వీర్ భండారీ, జస్టిస్ దీపక్ వర్మలతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్లను విచారిస్తోంది. జగన్ తరపును ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మాలానీ వాదిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశించినా సిబిఐ ప్రాథమిక నివేదిక కాపీలను తనకు చూపలేదని ఆయన చెప్పారు. సిబిఐ ప్రాథమిక విచారణను పట్టించుకోకుండా హైకోర్టు విచారణకు ఆదేశించిందని రామ్ జెఠ్మాలనీ ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు.
రామ్ జెఠ్మాలనీ వాదనలు ముగిశాయి. మరో న్యాయవాది ముకుల్ రోహత్గీ తన వాదనలు ప్రారంభించారు. రాజకీయ కక్షతోనే జగన్పై ఆరోపణలు చేశారని ఆయన వాదించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తాను పిటిషన్ వేసినట్లు శంకరావు చెప్పినట్లు ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు.
‘హైకోర్టుతీర్పు సహజన్యాయసూత్రాలకు వ్యతిరేకం’
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు, కడప ఎంపి జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తులకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు సహజ న్యాయసూతాలకు వ్యతిరేకం అని ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మాలానీ సుప్రీం కోర్టులో వాదించారు. జగన్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లపై సుప్రీం కోర్టులో ఈరోజు విచారణ ప్రారంభమైంది. జగతి పబ్లికేషన్స్, సాక్షి టీవీల్లో పెట్టుబడులు, తన ఆస్తులపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని కోరుతూ ఆయన సుప్రీం కోర్టులో మూడు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంత్రి మండలి నిర్ణయాలు సమష్టి నిర్ణయాలని ఆయన సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.
జస్టిస్ దల్వీర్ భండారీ, జస్టిస్ దీపక్ వర్మలతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్లను విచారిస్తోంది. జగన్ తరపున ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మాలానీ వాదిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశించినా సిబిఐ ప్రాథమిక నివేదిక కాపీలను తనకు చూపలేదని ఆయన చెప్పారు. సిబిఐ ప్రాథమిక విచారణను పట్టించుకోకుండా హైకోర్టు విచారణకు ఆదేశించిందని రామ్ జెఠ్మాలనీ ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు.
రామ్ జెఠ్మాలనీ వాదనలు ముగిశాయి. మరో న్యాయవాది ముకుల్ రోహత్గీ తన వాదనలు ప్రారంభించారు. రాజకీయ కక్షతోనే జగన్పై ఆరోపణలు చేశారని ఆయన వాదించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తాను పిటిషన్ వేసినట్లు శంకరావు చెప్పినట్లు ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు.