కడప జిల్లాకు అన్యాయం చేస్తున్నారు

కడప: జిల్లాలో వైకాపాకి ఆదరణ ఎక్కువ ఉందని చెప్పి ముఖ్యమంత్రి కడప జిల్లాకు పూర్తి అన్యాయం చేస్తున్నారని వైకాపా జిల్లా కన్వీనర్‌ అమరనాథరెడ్డి, కడప శాసనసభ్యుడు అంజాద్‌బాష, నగర మేయర్‌ సురేష్‌బాబులు ధ్వజమెత్తారు.  వైకాపా జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ… కడప విమానాశ్రయం పూర్తయి సంవత్సరం పూర్తి కావస్తున్నా ఇంత వరకు ప్రారంభించకపోవడం దారుణమన్నారు.ప్రభుత్వం ఏర్పడి 9 మాసాలు కావొస్తున్నా జిల్లాకు ఒక్కపైసా నిధులు మంజూరు చేయలేదన్నారు.  వస్తాయని భావిస్తున్న బ్రహ్మణి ఉక్కు ఫ్యాక్టరీని, డీఆర్‌డీఓ ప్రాజెక్టులను రాకుండా అడ్డుకుంటున్నారన్నారు.

చదవండి :  ఆయన ఒక్కడే అవినీతి పరుడా?

తెలుగుదేశం ప్రభుత్వం 7 నెలల పాలనలో ప్రజలకు చేసింది ఏమీ లేదని తెలిపారు. ముఖ్యమంత్రి నెలకోసారి విదేశాలకు వెళుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మంత్రులు, దళారులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

సింగపూర్‌ వెళ్లి సింగపూర్‌గా, జపాన్‌ వెళ్లి జపాన్‌లా మారుస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని చెప్పారు.  చంద్రన్న కానుక అని చెప్పి ముఖ్యమంత్రి సంస్థ అయిన హెరిటేజి సరుకులను విక్రయిస్తున్నారన్నారు. హెరిటేజ్‌లో అమ్ముడుపోకుండా ఉన్న నెయ్యి, డాల్డాలను ప్రజలకు ఇస్తున్నారని ఆరోపించారు.  తన స్వంత సంస్థకు లాభం చేకూర్చడానికే ఈ సరుకులు ఇస్తున్నారని విమర్శించారు. చాలా మండలాల్లో రైతులకు రుణ మాఫీ జరగలేదన్నారు.

చదవండి :  'కడప జిల్లాను పూర్తిగా మరిచారు'

ఇదీ చదవండి!

చంద్రన్నకు

చంద్రన్నకు ప్రేమతో …

చంద్రన్నకు రాయలసీమ ప్రజల బహిరంగ లేఖ మేధావీ,అత్యంత ప్రతిభావంతుడూ, సంపన్నుడూ అయిన మా రాయలసీమ ముద్దుబిడ్డకు… అన్నా! చంద్రన్నా!! మీరు …

ఒక వ్యాఖ్య

  1. I agree that this Chandra babu, I feel shame to call his name throghu my mouth,but I do not have any option,to open our kadapa air port we have one option that is with solid proof we should get help of judiciary or court, we can get our right from court otherwise should fight like TELANGANA, must have separate state we do not this chandra babu as our cheif minster ofcourse he is from RAYALASEEMA, we should bycot him being a RAYALASEEMA person, let him being a cheisef minister of VIJAYAWADA. As I said before he was a cheif minister of Hyderabad now he is for VIJAWADA.At last I would like to request to RAYALASEEMA public wake up from sleep and fight for our own state or forget every thing live like slaves under CHANDRA BABU.JAI RAYALASEEMA.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: