Tags :రాచమల్లు రామచంద్రారెడ్డి

    వ్యాసాలు

    కథానికా, దాని శిల్పమూ – రాచమల్లు రామచంద్రారెడ్డి

    ‘జీవితంలో చూసి ఉపేక్షించే విషయాలనే యీ కథలలో చదివి షాక్ తింటాం.’ అని నా కథల గురించి కుటుంబరావు అన్నారు. షాక్ (దిమ్మరపాటు) మాట యేమైనా పాఠకుని హృదయం మీద గాఢమైన అనుభూతి ముద్ర వేయాలనే ఉద్దేశంతోనే నేనీ కథానికలు రాసినాను. కథానికను గురించే కాదు. మొత్తం సాహిత్యం గురించే నా అవగాహన అది. అనుభూతి లేకుండా సాహిత్యమనేదే లేదు. సమస్త సాహిత్యమూ హృదయ వ్యాపారమే. అంటే అనుభూతి వ్యంజకమే. అయితే, అనుభూతి అనేది వెగటు కలిగించే […]పూర్తి వివరాలు ...

    ప్రసిద్ధులు వ్యాసాలు

    ఆ రోజుల్లో రారా..

    ఒక రోజు చండ ప్రచండంగా వెలిగిన రారా (రాచమల్లు రామచంద్రారెడ్డి) ఈ రోజు మన మధ్యలేరు. ఆయన సహచరుడైన నాకు ఆయన జ్ఞాపకాలు (రారా జ్ఞాపకాలు) మిగిలాయి. కడపోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన జ్ఞాపకాన్ని మననం చేసుకోవడం మంచిదన్న అభిప్రాయంతో, నా జ్ఞాపకాల్ని పాఠకుల ముందుంచుతున్నాను. కడప జిల్లాకు సంబంధించి ఆధునిక కథానిక ప్రక్రియలు గాని, విమర్శనా ప్రక్రియను గాని, ఉటంకించదలచుకుంటే రారా పేరు అనివార్యం. నిజానికి ఆయన పేరు కడప జిల్లాకు మాత్రమే పరిమితం కాదు […]పూర్తి వివరాలు ...

    ప్రసిద్ధులు వ్యాసాలు

    మన జయరాం, మన సొదుం

    మధ్య తరగతి ఆలోచనల్ని భూ మార్గం పట్టించిన కథాశిల్పి సొదుం జయరాం. వీరికి 2004లో రాచకొండ రచనా పురస్కారం శ్రీకాకుళంలోని కథానిలయం వార్షికోత్సవ సభలో ఫిబ్రవరి 15న అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత కేతు విశ్వనాథరెడ్డి మిత్రుడు జయరాం గురించి అందిస్తున్న రచన… నాలుగైదు దశాబ్దాల కిందటి మాట. కడప జిల్లాలోని పల్లెటూళ్ళలో ఆధునిక సాహిత్య చైతన్యం అబ్బిన రైతు కుటుంబాలు చాలా తక్కువగా ఉండేవి. వీటిలో సొదుం జయరాం […]పూర్తి వివరాలు ...

    అభిప్రాయం వ్యాసాలు

    ‘నాది పనికిమాలిన ఆలోచన’

    కేతు విశ్వనాథరెడ్డి గురించి సొదుం జయరాం “జ్ఞాపకశక్తికీ నాకూ చుక్కెదురు. విశ్వం, నేనూ ఎప్పుడు దగ్గరయ్యామో నాకు సరిగ్గా గుర్తు లేదు. ఇద్దరం ప్రొద్దుటూరు మునిసిపల్ హైస్కూల్లో చదువుకున్నాం. కానీ ఆ రోజుల్లో మా ఇద్దరికీ స్నేహం అయినట్టు లేదు. నేను ఇంటర్మీడియేట్ చదువుతున్న రోజులలో రా.రా గారు కడపకొచ్చారు. ఆయన ఎక్కడెక్కడి వాళ్ళను ఒకచోట చేర్చారు. గజ్జల మల్లారెడ్డి, కేతు విశ్వనాధరెడ్డి, ఆర్వీఆర్, రామప్ప, బండి గోపాల్ రెడ్డి, వై.సి.వి.రెడ్డి, కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి, గోవిందరెడ్డి, రామ్మోహన్ […]పూర్తి వివరాలు ...

    ప్రసిద్ధులు వ్యాసాలు

    హృదయమున్న విమర్శకుడు – రారా!

    రా.రా .గా ప్రసిద్ధుడయిన విమర్శకుడూ, సంపాదకుడూ, కథకుడూ, అనువాదకుడూ సిసలయిన మేధావీ – రాచమల్లు రామచంద్రారెడ్డి (1922-88) హృదయమున్న రసైకజీవి! స్వపరభేదాలు పాటించని విమర్శకుడు. పిసినారి అనిపించేటంత పొదుపరి కథకుడు. ముళ్లలోంచి పువ్వులను ఏరే కళలో ఆరితేరిన సంపాదకుడు. మూలరచయిత మనసును లక్ష్యభాషలోని పాఠకుడికి సమర్థంగా చేర్చిన అనువా దకుడు. అక్షరాంగణంలో నిలువెత్తు విగ్రహాలుగా పాతుకు పోయిన ‘ప్రముఖుల’ గుట్టురట్టు చెయ్యడానికి క్షణమాత్రం జంకని విగ్రహ విధ్వంసి. ఒక్కమాటలో చెప్తే- మూడున్నర దశాబ్దాల సాహిత్య జీవితంలో ఒక […]పూర్తి వివరాలు ...

    కథలు

    ఓడిపోయిన సంస్కారం (కథ) – రాచమల్లు రామచంద్రారెడ్డి ( రా.రా )

    సుందరమ్మకంతా కలలో ఉన్నట్లుంది. పెండ్లంటే మేళతాళాలూ, పెద్దల హడావుడీ, పిల్లల కోలాహలం, మొదలైనవన్నీ వుంటాయనే ఆమె మొదట భయపడింది. మూడేండ్లనాడు తన మొదటి పెండ్లి ఆ విధంగానే జరిగింది. ఈ రెండవ పెండ్లి యే ఆర్భాటమూ లేకుండా కొద్దిమంది ఆత్మీయుల సమక్షంలో నవనాగరిక పద్ధతిలో జరుగుతుందని వారం రోజులనాడు తెలిసినప్పుడు ఆమె కెంతో మనశ్శాంతి కలిగింది. పెండ్లి ఐన సంవత్సరానికే వైధవ్యభారం నెత్తిన వేసుకొని పుట్టినిల్లు జేరిన తాను తిరిగి పెండ్లికూతురు వేషం ధరించాలంటే ఆమె చాలా […]పూర్తి వివరాలు ...