మూడు రోజులు కాదు వారానికి నాలుగు రోజులు

మూడు రోజులు కాదు వారానికి నాలుగు రోజులు

కడప – హైదరాబాదు ట్రూ జెట్ విమాన సర్వీసు

ముందస్తుగా బుక్ చేసుకుంటే టికెట్ ధర రూ.1665

కడప: కడప -హైదరాబాదుల మధ్య ప్రారంభం కానున్న ట్రూజెట్  విమాన సర్వీసు (Flight Number: 2T305) వారంలో నాలుగు సార్లు నడవనుంది. ప్రతి శుక్ర,శని,ఆది,సోమ వారాలలో హైదరాబాదు – కడపల మధ్య ఈ విమాన సర్వీసు నడుస్తుంది.

ఉదయం 10 గంటల 05 నిముషాలకు హైదరాబాదు నుండి బయలుదేరి మధ్యాహ్నం 11 గంటల 10 నిముషాలకు కడప చేరుతుంది.

అదే విమానం 11 గంటల 35 నిముషాలకు కడప నుండి బయలుదేరి తిరుపతి మీదుగా మధ్యాహ్నం 02 గంటల 05 నిముషాలకు హైదరాబాదు చేరుతుందని ట్రూజెట్ ఒక ప్రకటనలో తెలియచేసింది. కడప – హైదరాబాదు విమానానికి ముందస్తుగా కొనేవారికి టికెట్ రూ.1665 కు దొరుకుతుంది.

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: