
మే 3 నుండి కడప – విజయవాడల నడుమ విమాన సర్వీసు
వారానికి మూడు రోజులు…మంగళ, బుధ, గురు వారాలలో
టికెట్ ధర రూ.1665
కడప: కడప – విజయవాడ నగరాల మధ్య వారానికి మూడు సార్లు విమానాన్ని నడిపేందుకు ట్రూజెట్ విమానయాన సంస్థ సిద్ధమైంది. మొదటి విమానం మే 3వ తేదీ మధ్యాహ్నం 1 గంట 35 నిముషాలకు విజయవాడ నుండి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటల 40 నిముషాలకు కడప చేరుతుంది.
అదే విమానం మధ్యాహ్నం 3 గంటల 05 నిముషాలకు కడప నుండి బయలుదేరి 04 గంటల 10 నిముషాలకు విజయవాడ చేరుతుంది.
ఇప్పటికే ఈ సర్వీసుకు సంబంధించి టికెట్ల అమ్మకాన్ని ట్రూజెట్ ప్రారంభించింది. కడప – విజయవాడల మధ్య ముదస్తుగా టికెట్ కొనే వారికి ధరను రూ.1665 గా నిర్ణయించినారు.
ప్రతి మంగళ, బుధ, గురు వారాలలో కడప – విజయవాడల మధ్య ఈ విమాన సర్వీసు నడిపేందుకు డిజిసిఏ (Director General of Civil Aviation) ట్రూజెట్ సంస్థకు అనుమతిని మంజూరు చేసింది. ఈ నేపధ్యంలో మే 3 నుండి కడప – విజయవాడ సర్వీసు నడిపేందుకు సిద్ధమైనట్లు ట్రూజెట్ సంస్థ ప్రతినిధి ఒకరు కడప.ఇన్ఫో కు తెలియచేశారు.
http://www.trujet.com/ebooking/home/ మరియు ఇతర ట్రావెల్ వెబ్ సైట్ల ద్వారా కడప – విజయవాడ విమాన సర్వీసుకు టికెట్లు కొనుక్కోవచ్చు.
1 Comment
కడప విజయవాడ ల మధ్య సర్వీసు నడపటం కన్నా ఇదే సర్వీసును కడప – బెంగుళూరు లేదా చెన్నై ల మధ్య నడపటం సముచితంగా ఉంటుంది…