జనని సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలందు దెనుగు లెస్స జగతి దల్లి కంటె సౌభాగ్య సంపద మెచ్చుటాడు బిడ్డ మేలుగాదె ( క్రీడాభిరామం -రచన వినుకొండ వల్లభరాయుడు.) కడప జిల్లా పులివెందుల ప్రాంతంలోని మోపూరు గ్రామంలోని భైరవేశ్వర ఆలయం నేటికీ వుంది. ఇది వీరశైవులకు ప్రసిద్ధ క్షేత్రం. (క్రీ.శ.1423 -1445) ప్రాంతంలో విజయనగర పాలకుడు ప్రౌఢ దేవరాయలు పరిపాలించేవారు. డిండిమ భట్టారకుని జయించాలన్న తపనతో శ్రీనాథుడు వున్నారు. ఆ సమయంలో మోపూరు పాలకుడుగా వల్లభరాయుడు వుండేవారు. […]పూర్తి వివరాలు ...
స్వర్ణయుగమని చెప్పుకునే విజయనగర చక్రవర్తుల తుది దిశలో సామాన్యుల బ్రతుకు కడగండ్ల పాలైంది. మండలాధీశుల భోగలాలసత్వం, అధికారుల దౌర్జన్యం, దోపిడీలు.. దానికితోడు జనులలో పేరుకుపోయిన అమాయకత్వం, అజ్ఞానం వారి జీవితాలను మరింత దుర్భరంగా చేసాయి. అర్థం లేని ఆచారాలు, దురాచారాలు, అధికార బలం, దబాయింపులతో ప్రజలను మోసంచేసి అణచిపెట్టేవారు. అటువంటి చిమ్మచీకటి తెరలను చీల్చుకుని వెలిగిన వేగుచుక్కలు యోగి వేమన, పోతులూరి వీరబ్రహ్మము . (1608-1693). ఇద్దరూ సమకాలీకులైనా, ఒకరికొకరు ముఖ పరిచయం లేకున్నా ఒకే ఆశయంతో […]పూర్తి వివరాలు ...
రాయలసీమలో వైవిధ్య భరితమైన సాహిత్య ప్రాభవ వైభవాలు కనిపిస్తాయి. శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానంలోని అల్లసాని పెద్దన, ప్రజాకవి వేమన, కాలజ్ఞానకర్త వీరబ్రహ్మం, పదకవితా పితామహుడు అన్నమయ్య వంటి మహానుభావులు ఎందరో ఈ ప్రాంతంలో సాహితీ సేద్యం చేశారు. కవిత్వం, అవధానం, నవల, విమర్శ, కథ వంటి సాహితీ ప్రక్రియలన్నీ ఆనాటి పునాదుల పైనే నిర్మితమవుతూ వచ్చాయి.పూర్తి వివరాలు ...
నందలూరు : ‘సాహిత్యం ద్వారానే సామాజిక స్పృహ పెరుగుతుంది. సమాజం మంచి మార్గంలో నడవడానికి కథ మార్గదర్శనం చేస్తోంది. కథకు మరణం లేదు’ అంటూ తెలుగు కథకు ఉన్న ప్రాధాన్యాన్ని పలువురు సాహితీ ప్రముఖులు వివరించారు. నందలూరులో ఆదివారం గొబ్బిళ్ల శంకరయ్య మెమోరియల్ స్కూల్ ఆవరణంలో కళింగాంధ్ర ప్రాంతానికి చెందిన కథకులు అట్టాడ అప్పల్నాయుడుకు కేతు కథా పురస్కారం, ఏఎన్ జగన్నాథశర్మకుపూర్తి వివరాలు ...
తెలుగు సాహిత్యంలో ఇరవయ్యో శతాబ్దిలో అత్యంత ప్రతిభావంతులైన ఇంకా కొన్ని తరాలు కూడా చెప్పుకోగల గొప్ప రచయితలు ఐదుగురిని లేదా ఆరుగురిని ఎంపిక చేయాలంటే ఎవరు ఈ పరిగణనకు పూనుకున్నా అందులో శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులవారు ఒకరై వుండడం అనివార్యం. 20 సంవత్సరాల కిందట ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసరచయిత ఇట్లా రాశాడు. ‘‘పదిమంది సమూహంలో ఇట్టే పోల్చుకోదగిన ప్రతిభ ఆయనది. చిన్న చిన్న కోనేరులకు, తటాకాలకూ, సరస్సుల కూడిన మహానదికీ ఎటువంటి అంతరం ఉంటుందో […]పూర్తి వివరాలు ...
మా నాయన నిజ్జంగా సన్నపిల్లోడే! లేకపోతే కుక్క కర్సిందని – నాయనా! పెద్దక్క కు శెప్పినావా నడిపోనికి శెప్పినావా శిన్నోనికి శెప్పినావా అని బోరుబోరున ఏడుచ్చాండంట. మా నాయన పిరికోడేంగాదు మిల్టరీకి పోయి రెండో ప్రపంచయుద్ధంలో పనిచేసి వచ్చినాడు. ఒకసారి మా బరుగొడ్డు సగిలేటి వాగులో కొట్టుకోని పోతాంటే తలుగు తీసుకుని పోయి దాని మెడకు ఏసి లాక్కోని వచ్చినాడు. మిలట్రీ నుంచి రిటైర్ అయి వచ్చినాంక వీవింగ్ట్రైనింగ్ చేసి వచ్చి వీవింగ్ టీచరుగా పనిజేసి రిటైర్ […]పూర్తి వివరాలు ...
రాయలసీమలో కథా రచనను తొలినాళ్ళలో ప్రారంభించి ఆ రుచిని తెలుగు పాఠకలోకానికి దశాబ్దాలపాటు పంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి కీ.శే. కె.సభా. అన్ని ప్రక్రియల్లో రచనలు చేసి సీమ వాడి, వేడి, జిగి, బిగి, ఆర్ద్రత, ఆప్యాయతల స్థాయిని చాటిన సభా బహుముఖ ప్రజ్ఞాశాలి. జాతీయోద్యమ చైతన్యంతో జీవితానుభవాలను, ఆదర్శాలను తన రచనా మూలాలుగా అందించిన దార్శనికుడు. కథా రచయితగా, నవలాకారుడిగా, కవిగా, గేయకర్తగా,పూర్తి వివరాలు ...
కడప జిల్లా మైదుకూరులో తెలుగుభాషా దినోత్సవం ఘనంగా జరిగింది . మైదుకూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో తెలుగు భాషాభిమానులు , ఉపాధ్యాయులూ ,విద్యార్థుల మధ్య సమక్షం లో ఈ కార్యక్రమం జరిగింది. తెలుగు భాషోద్యమ సమాఖ్య మైదుకూరు శాఖ ఆధ్వర్యం లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు భాషోద్యమ సమాఖ్య రాయలసీమ ప్రాంత కార్యదర్శి , కథా రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు భాష ఉనికికిపూర్తి వివరాలు ...
ఋషులదెట్టి జాతి ఇంపుగా వెలసిన బ్రహ్మకిష్టులైరి బ్రహ్మలైరి తుదిని ఎవ్వరైన సొదమునుటేనయా! విశ్వదాభిరామ వినురవేమ ఋషులకు కూడా కులభేదాలు అంటగడితే ఎలా? అంటున్నాడు వేమన ఈ పద్యంలో. ఋషుల కులం, వంశం, తెగ, వర్గం, పుట్టుక లాంటి వాటిని గురించి ఆలోచించడం శుద్ధ అనవసరం.పూర్తి వివరాలు ...