మైదుకూరులో ఘనంగా తెలుగుభాషా దినోత్సవం!

కడప జిల్లా మైదుకూరులో తెలుగుభాషా దినోత్సవం ఘనంగా జరిగింది . మైదుకూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో తెలుగు భాషాభిమానులు , ఉపాధ్యాయులూ ,విద్యార్థుల మధ్య సమక్షం లో ఈ కార్యక్రమం జరిగింది. తెలుగు భాషోద్యమ సమాఖ్య మైదుకూరు శాఖ ఆధ్వర్యం లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు భాషోద్యమ సమాఖ్య రాయలసీమ ప్రాంత కార్యదర్శి , కథా రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు భాష ఉనికికి విఘాతం కల్గిస్తున్న పరిస్థితులను సభికులకు వివరించారు. ప్రపంచం లో అంతరించిపోనున్న అనేక భాషల వివరాలను ఓబుల్ రెడ్డి వివరిస్తూ అండమాన్ దీవుల్లో ” బో ” అనే భాష ఇటీవల అంతరించిన ఉదంతాన్ని ఉదహరించారు. తెలుగు భాష పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. గిడుగు రామ మూర్తి పంతులుకు నివాళి అర్పించారు. డాక్టర్ సామల రమేష్ బాబు నాయకత్వం లో ముందుకు సాగుతున్న తెలుగు భాషోద్యమ వివరాలను ఓబుల్ రెడ్డి ఈ సందర్భంగా సభికులకు తెలిపారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధి గా పాల్గొన్నసాహితీవేత్త జింకా సుబ్రమణ్యం మా ట్లాడుతూ విద్యార్థులు శతక సాహిత్యన్ని ఔపోసన పడితే తెలుగు భాషపై పట్టు పెరుగుతుందని సూచించారు.  తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తనకు సత్కారం చేసినందులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తనకు సత్కారం చేసినందులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
కస్తుర్బా విద్యాలయం   విశ్రాంత ప్రిన్సిపాల్  మిరియాల వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ తెలుగు భాషా సౌరభమంతా ప్రాచీన తెలుగు సాహిత్యం లో దాగుందని పద్యసహితంగా పేర్కొన్నారు. పద్య కవి లెక్కల వెంకట రెడ్డి మాట్లాడుతూ అచ్చతెలుగులో ఎవరైనా మాట్లాడేందుకు ప్రయత్నిస్తే  వారిని చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాషోద్యమ సమాఖ్య మైదుకూరు శాఖ అధ్యక్షుడు ఎ . వీరస్వామి , బాల సాహిత్య రచయిత టి. మహానందప్ప, అధ్యక్షుడు ఎ . వీరస్వామి , యువకవి కృష్ణమూర్తి యాదవ్ , గేయ రచయిత ఖాజహుస్సైన్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రముఖుల చిత్రాలు జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన తెలుగు భాషాభిమానులను , విద్యార్థులను ఆకట్టుకుంది.

చదవండి :  కడపకు ఒక్క జాతీయ సంస్థను కూడా కేటాయించకపోవడం దారుణం

ఇదీ చదవండి!

పాత కలెక్టరేట్

పాత కలెక్టరేట్ వయసు 132 ఏళ్ళు

కడప నడిబొడ్డున ఉన్న కలెక్టరేట్ పాత భవనాన్ని 1889 సంవత్సరంలో బ్రిటీషువారు నిర్మించారు. అంటే ఈ భవనం వయసు : …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: