వార్తా విభాగం

సంకీర్తనలు

ఈ విశ్వాసంబు యెవ్వరికిఁ దోఁప దిది

॥పల్లవి॥ఈ విశ్వాసంబు యెవ్వరికిఁ దోఁప దిదిపావనుల హృదయమునఁ బ్రభవించుఁగానిని॥చ1॥ఇమ్మయినపాపంబు లెన్నివలసినఁ బ్రాణిసమ్మతంబున జేయఁ జాలుఁగా కేమికుమ్మరికి నొకయేఁడు గుదియ కొకనాఁడవునునమ్మితలఁ చినవిష్ణునామంబుచేత॥చ2॥కొదలేనిదురితములు కొండలునుఁ గోట్లునుచెదర కెప్పుడుఁ బ్రాణి చేయుగా కేమిపొదరి గొరియలలోన పులిచొచ్చినట్లౌనుహృదయంబు హరిమీఁద నుండినంతటను॥చ3॥సరిలేని దుష్కర్మసంఘములు రాసులైపెరుగఁ జేయుచు ప్రాణి పెంచుఁగాకేమి?బెరసి కొండలమీఁదఁ బిడుగువడ్డట్లౌనుతిరువేంకటాచలాధిపునిఁ దలఁచినను రాగము: శ్రీరాగం రేకు: 0010-04 సంపుటము: 1-64 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, శ్రీరాగంపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఏమి నెఱఁగనిమమ్ము నెక్కువనేసి

॥పల్లవి॥ఏమి నెఱఁగనిమమ్ము నెక్కువనేసిపామరుల దొడ్డఁజేసె భాష్యకారులు॥చ1॥గతచన్నవేదాలు కమలజునకు నిచ్చిఅతనికరుణచేత నన్నియుఁ గనిగతిలేకపోయునక లియుగమున వచ్చిప్రతిపాలించఁగలిగె భాష్యకారులు॥చ2॥లోకమెల్ల వెల్లిఁబోఁగా లోననే సురలఁ గాచిఆకుమీఁదఁ దేలిన యతనికృపకాకరిమతములెల్ల గాలిఁబుచ్చి పర మిట్టేపై కొనఁగఁ గరుణించె భాష్యకారులు॥చ3॥పంకజపుఁ జేయి చాఁచి పాదపుఁబరమిచ్చిన-వేంకటేశుకృపతోడ వెలయఁ దానేతెంకినే వొడయవరై తిరుమంత్రద్వయానపంకమెల్లఁ బోఁగడిగె భాష్యకారులు రాగము: ఆహిరి రేకు: 0027-01 సంపుటము: 1-162 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ఆహిరిపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

కాలవిశేషమో లోకముగతియో సన్మార్గంబుల_

॥పల్లవి॥కాలవిశేషమో లోకముగతియో సన్మార్గంబుల_కీలువదలె సౌజన్యము కిందయిపోయినదిlisinopril and drivinglisinopriland.netlisinopril and driving॥చ1॥ఇందెక్కడిసంసారం, బేదెసఁ జూచిన ధర్మముకందయినది,విజ్ఞానము కడకుఁ దొలంగినది,గొందులు దరిఁబడె, శాంతము కొంచెంబాయ,వివేకముమందుకు వెదకినఁ గానము మంచితనంపుఁబనులు॥చ2॥మఱి యిఁక నేఁటివిచారము, మాలిన్యంబైపోయిన_వెఱుకలు, సంతోషమునకు నెడమే లేదాయ,కొఱమాలెను నిజమంతయు,కొండలకేఁగెను సత్యము,మఱఁగైపోయను వినుకులు, మతిమాలెను తెలివి॥చ3॥తమకిఁక నెక్కడిబ్రదుకులు, తడఁబడె నాచారంబులు,సమమైపోయిన వప్పుడె జాతివిడంబములు ,తిమిరంబింతయుఁ బాపఁగఁ దిరువేంకటగిరిలక్ష్మీ-రమణుఁడు గతిదప్పను కలరచనేమియు లేదు రాగము: సామంతం రేకు: 0010-03 సంపుటము: 1-63 Tags: పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

మందులేదు దీనికి మంత్ర మేమియులేదు

॥పల్లవి॥మందులేదు దీనికి మంత్ర మేమియులేదుమందుమంత్రము దనమతిలోనే కలదు॥చ1॥కదలకుండఁగఁ దన్నుఁ గట్టివేసినఁ, గట్టువదలించకొనఁ గొంత వలదావదలించఁబోయిన వడిగొని పైపైనేకదియుఁగాని తన్ను వదల దేమియును॥చ2॥మనసు లోపలనుండి మరి మీఁదఁ దానుండియెనసిన తిరువేంకటేశునితనరిన తలఁపునఁ దలఁప దుష్కృతములుతనకుఁదానే వీడుఁ దలఁకవలదుగాన రాగము: నాట రేకు: 0026-06 సంపుటము: 1-161 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, నాటపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఎంత చదివిన నేమి వినిన తన-

॥పల్లవి॥ఎంత చదివిన నేమి వినిన తన-చింత యేల మాను సిరులేల కలుగు॥చ1॥ఇతర దూషణములు యెడసినఁగాకఅతికాముకుఁడుగాని యప్పుడు గాకమతిచంచలము గొంత మానినఁగాకగతి యేల కలుగు దుర్గతులేల మాను॥చ2॥పరధనములయాస పాసినఁగాకఅరిదినిందలులేనియప్పుడు గాకవిరసవర్తనము విడిచినఁగాకపరమేల కలుగు నాపదలేల మాను॥చ3॥వేంకటపతి నాత్మ వెదకినఁగాకకింక మనసునఁ దొలఁగినఁగాకబొంకుమాట లెడసిపోయినఁగాకశంకయాల మాను జయమేల కలుగు రాగము: సామంతం రేకు: 0010-02 సంపుటము: 1-62 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, సామంతంపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

కొండో నుయ్యో కుమతులాల

॥పల్లవి॥కొండో నుయ్యో కుమతులాలతండుముండు తట్టుముట్టు తాఁకైనఁ గనుఁడీread॥చ1॥కాకివోటు జముచేత కందుకుందు మరుచేతమాకాపని గారు మనుజులాలపోకుమని యాఁపరాదు పొమ్మని చెప్పఁగరాదుమీకుమీకే చూచుకొండు మీరే కనుఁడు॥చ2॥గాములిల్లు పుట్టమీఁది కప్పు తోలు పై కప్పునేమా యెఱఁగము నిపుణులాలపామునోరికడి మీప్రాణపుటూరుపు గాలిజాము జాము మేలుఁగీడు చక్కఁజేయఁ గనుఁడు॥చ3॥రచ్చమాని చింతకిందు రాఁపులకూటమిపొందుముచ్చో చిచ్చో మూఢులాలయెచ్చరికతోడ వేంకటేశుదాసులఁ గూడిపచ్చిగచ్చు మేనితోడ భయమెల్ల బాయుఁడు రాగము: దేసాక్షి రేకు: 0026-05 సంపుటము: 1-160 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

పదిలము కోట పగవారు

॥పల్లవి॥పదిలము కోట పగవారుఅదనఁ గాచుకొందు రాఱుగురు॥చ1॥ఇమ్మైఁ జెప్ప యిందరిచేతతొమ్మిదినెల్లఁ దోఁగినదికొమ్మతీరునఁ గుదురైనకోటదొమ్మికాండ్లై దుగు రుందురు॥చ2॥వొంటికాఁడు రాజు వుడుగక తమలోనవొంటనీనిమంత్రు లొక యిద్దరుదంటతనంబునఁ దమయిచ్చఁ దిరిగాడు-బంటు లేడుగురు బలవంతులు॥చ3॥కలవు తొమ్మిది కనుమల తంత్రమునిలుపఁగలిగినట్టినెరవాదులుతెలిసి కొనేటితిమ్మినాయఁడు చొచ్చెబలిసె యీకోట భయమేల రాగము: శంకరాభరణం రేకు: 0010-01 సంపుటము: 1-61 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, శంకరాభరణంపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

మోసమున మాయావిమోహితుఁడై పోయి

॥పల్లవి॥మోసమున మాయావిమోహితుఁడై పోయికాసు సేయని పనికి గాసిఁబడెఁ బ్రాణి॥చ1॥కన్నులనియెడి మహకల్పభూజము లివితన్నుఁ బుణ్యనిఁ జేయఁ దగిలి వచ్చినవివున్నతోన్నతబుద్ధి నొనగూర్ప కది దేహికన్న చోటికిఁ బఱపి గాసిఁబడెఁ బ్రాణి॥చ2॥చిత్తమనియెడి మహచింతామణి దనకుతొత్తువలె వలసి తనుఁ దోడుతేఁగలదిహత్తించి హరిమీఁద నలరింప కది వృథాతిత్తిలో సుఖమునకు తిరిగె నీప్రాణి॥చ3॥కామతత్వంబనెడి కామధేనువు దనకువేమారుఁ గోరికల వెల్లిగొలిపెడిదియీమేను తిరువేంకటేశుఁ జేరకపోయికామాంధుఁడై మిగుల గతిమాలెఁ బ్రాణి రాగము: ముఖారి రేకు: 0026-04 సంపుటము: 1-159 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఏది చూచినా నీవే యిన్నియును మఱి నీవే

॥పల్లవి॥ఏది చూచినా నీవే యిన్నియును మఱి నీవేవేదవిరహితులకు వెఱతు మటుగాన॥చ1॥ఇరవుకొని రూపంబులిన్నిటానుఁ గలనిన్నుఁబరికించవలెఁగాని భజియింపరాదుగరిమచెడి సత్సమాగంబు విడిచిన నీ_స్మరణ విజ్ఞానవాసన గాదుగాన॥చ2॥యిహ దేవతాప్రభలనెల్ల వెలుఁగుట నీకుసహజమనవలెఁగాని సరిఁ గొలువరాదుఅహిమాంశుకిరణంబు లన్నిచోట్లఁ బరగుగ్రహియింపరా దవగ్రాహములు గాన॥చ3॥యింతయునుఁ దిరువేంకటేశ నీవునికిఁ దగఁజింతింపవలెఁగాని సేవింపరాదుఅంతయు ననరుహమును నరుహంబనఁగరాదుఅంతవానికిఁ బరుల కలవడదుగాన రాగము: సామంతం రేకు: 0009-05 సంపుటము: 1-60 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, సామంతంపూర్తి వివరాలు ...

error: