బద్వేలు: వైఎస్ రాజశేఖరరెడ్డి మృతి అనంతరం పాలకులు రాజకీయ కుట్రలతోనే జిల్లాకు నిధులను నిలిపివేశారని సీపీఎం నాయకులు ధ్వజమెత్తారు. రాజకీయ కుట్రలతోనే జిల్లా అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన నేతలు ఇదేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. బద్వేలులో నిర్వహించిన ఆ పార్టీ 8వ జిల్లా మహాసభలు గురువారంతో ముగిసాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు వెంకట్, జిల్లా కార్యవర్గ సభ్యుడు రవిశంకర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…పూర్తి వివరాలు ...
జిల్లా చరిత్ర పుటల్లో పోలి గ్రామానికి ప్రత్యేకస్థానం ఉంది. రాజంపేట పట్టణానికి ఆనుకుని ఉన్న ఈ గ్రామానికి వేయి సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ ఓ స్త్రీ (పోలి) తన బిడ్డను త్యాగం చేసి యజమాని వంశాన్ని నిలబెడితే, మరో స్త్రీ(సగలక్క) ఆత్మబలిదానం చేసుకుని పోలి గ్రామస్తులను కాపాడింది. ఇదంతా 11వ శతాబ్దం నాటి యథార్థ గాథ అని, ఈ వివరాలన్నీ కడప కైఫీయత్తుల్లో వెలుగు చూశాయని చరిత్రకారులు అంటున్నారు. రాజంపేట పట్టణ పరిధిలో ఉన్న పోలి […]పూర్తి వివరాలు ...
పులివెందుల: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రహ్మతుల్లా కేసు విషయంలో నిన్న రాత్రి పులివెందుల పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా చేసిన కడప ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా 68మందిపై పోలీసులు నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. వీరిపై 11 సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. రహ్మతుల్లా అనే పార్టీ కార్యకర్తను పోలీసులు దూషించటంతో పాటు కొట్టడాన్ని నిరసిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 8.30 […]పూర్తి వివరాలు ...
కడపః ఈనెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో అందుబాటులో ఉంటారు. 9,11 వ తేదీలలో పులివెందులలోని తన క్యాంపు కా ర్యాలయంలో అందుబాటులో ఉంటారు. 10వ తేదీన కడపలో పర్యటిస్తారని పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వై.ఎస్.భాస్కర్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఖరారైన సమయంలోనే జగన్ పర్యటన ఖరారవడం విశేషం.పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు: ఈనెల 9న రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రొద్దుటూరుకు రానున్నారు. ఇందుకు సంబంధించి కలెక్టర్ బుధవారం సాయంత్రం స్థానిక అధికారులతో కలిసి హెలిప్యాడ్ నిర్మాణానికి అనువైన ప్రదేశాలను పరిశీలించారు. మొదట గోపవరం గ్రామ పంచాయతీలోని కొర్రపాడు రోడ్డు రింగ్ రోడ్డు వద్ద ఉన్న అపెరల్ పార్కు దగ్గర ఉన్న ఖాళీ ప్రదేశాన్ని, తర్వాత పాలిటెక్నిక్ కళాశాల మైదానాన్ని పరిశీలించారు.పూర్తి వివరాలు ...
జిల్లాలో సగటున 10 లక్షల 8 వేల ఎకరాల సాగు భూమి ఉండగా సగటున 9 లక్షల 81 వేల ఎకరాల విస్తీర్ణంలో సాగు జరుగుతోంది. వరి, వేరుసెనగ, కంది, సెనగ, అలసందలు జిల్లాలో సాగు చేసే ప్రధాన ఆహార పంటలు. పసుపు, చెరకు, ప్రత్తి, ఉల్లి, పొద్దుతిరుగుడు, నువ్వులు, మిరప, టమోటా తదితరాలైన వాణిజ్య పంటలు సాగవుతాయి. సాగు భూమిలో సుమారుగా 5 శాతం మేరకు వాణిజ్య పంటలు సాగవుతాయి. జిల్లా వ్యాప్తంగా 52 శాతం […]పూర్తి వివరాలు ...
తెలుగు సాహిత్యంలో ఇరవయ్యో శతాబ్దిలో అత్యంత ప్రతిభావంతులైన ఇంకా కొన్ని తరాలు కూడా చెప్పుకోగల గొప్ప రచయితలు ఐదుగురిని లేదా ఆరుగురిని ఎంపిక చేయాలంటే ఎవరు ఈ పరిగణనకు పూనుకున్నా అందులో శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులవారు ఒకరై వుండడం అనివార్యం. 20 సంవత్సరాల కిందట ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసరచయిత ఇట్లా రాశాడు. ‘‘పదిమంది సమూహంలో ఇట్టే పోల్చుకోదగిన ప్రతిభ ఆయనది. చిన్న చిన్న కోనేరులకు, తటాకాలకూ, సరస్సుల కూడిన మహానదికీ ఎటువంటి అంతరం ఉంటుందో […]పూర్తి వివరాలు ...
తెలుగు సాహిత్యంలో ధృవతార సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు. ఆయన బహు భాషా కోవిదుడు. రాయలసీమ గర్వించదగ్గ భారతీయ సాహిత్యకారుడు. సాహితీసేద్యంలో ఆయన ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఆ మహానుభావుని కుమార్తె నాగపద్మిని. నాన్నగారి (అయ్యగారు) జ్ఞాపకాలను ఆమె ఇలా పంచుకున్నారు …పూర్తి వివరాలు ...
పరిస్థితులు అనుకూలించిన పరిధిలోనే అనతికాలంలో ఇన్ని మంచి పరిణామాలకు వైఎస్ సొంత చొరవతో దోహదం చేసినందువల్లే అమెరికన్ కాన్సల్ జనరల్ అక్కసుతో ఏకపక్ష ప్రతికూల నివేదికను పంపడానికి కారణమై ఉండాలి! ఇది పూర్తిగా దేశ, రాష్ట్ర ఆంతరంగిక వ్యవహారాల్లో పరాయిశక్తి జోక్యంగా భావించి, నిరసించాల్సిన పరిణామం. వ్యక్తిత్వాన్ని కోల్పోయి, పరదేశానికీ, పరదేశీకీ ‘జో హుకుం’ అనే పరాధీన పాలకులకీ, మడమ తిప్పకుండా తమ రాజకీయ వ్యక్తిత్వ విభవాన్ని ఇనుమడింపచేసుకునే ‘స్వాధీన’ పరిపాలకులకీ మధ్యన తేడా ఇదే! కేజీ […]పూర్తి వివరాలు ...